Summer Tips: వేసవిలో ఈ 6 డ్రింక్స్ తాగితే చాలు.. మండే ఎండలను తరిమికొట్టినట్లే..!

వేసవిలో కొన్ని రకాల డ్రింక్స్ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పానీయాలు మన దాహాన్ని తీర్చడమే కాకుండా

Summer Tips: వేసవిలో ఈ 6 డ్రింక్స్ తాగితే చాలు.. మండే ఎండలను తరిమికొట్టినట్లే..!
Summer Drinks
Follow us

|

Updated on: Mar 12, 2023 | 5:01 PM

ప్రతి ఏటా ఏప్రిల్ , మే నెలల నుంచి ప్రారంభమయ్యే వేసవి కాలపు ఎండలు ఈ ఏడాది ఫిబ్రవరి ముగియక ముండే వచ్చిపడ్డాయి. అంతేనా.. మున్ముందు రోజులలో సూర్యతాపం ఎలా ఉండబోతుందో ముందుగానే హెచ్చరిస్తున్నాయి కూడా ఈ మండే ఎండలు. అయితే ఎండా కాలంలోని మండే ఎండల నుంచి మనల్ని మనం కాపాడుకుంటూనే మన శరీరం ఆరోగ్యవంతంగా ఉండగలుగుతుంది. అంటే వేడి, డీహైడ్రేషన్ వంటి సమస్యల బారిన పడకుండా శరీరాన్ని కాపుడుకోవచ్చు. ఈ క్రమంలో కొన్ని రకాల డ్రింక్స్ లేదా పానీయాలు వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పానీయాలు మన దాహాన్ని తీర్చడమే కాకుండా శరీరంలోని వేడిని నియంత్రించి మనల్ని చల్లబరుస్తాయి. ఇంకా ఎండాకాలంలో శరీరానికి కావలసిన పోషకాలను కూడా అందించగులుగుతాయి. మరి ఆ డ్రింక్స్ ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

చెరకు రసం: వేసవి కాలంలో రోడ్డు పక్కన ఏర్పాటు చేసే దుకాణాలలో చెరుకు రసం దుకాణాలు మొదటివి. చెరకు, అల్లం, నిమ్మకాయలను కలిపి మెత్తగా చేసి పుదీనా కలుపుతారు. ఈ పానీయం సహజ తీపి రుచిని కలిగి ఉంటుంది, ఇంకా ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ డ్రింక్ మనల్ని వేసవి ఎండల నుంచి కాపాడగలుగుతుంది. అయితే దీనిని ఐస్ కలపకుండా తాగడం మంచిది.

మజ్జిగ: వేడి కాలంలో మజ్జిగ పానీయంగా లేదా ఆహారంగా తీసుకోవడం తప్పనిసరి. ఇది మన శరీరాన్ని చల్లబరచడమే కాకుండా జీర్ణవ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. భోజనం చేసిన తర్వాత ఒక గ్లాసు మజ్జిగ తాగడం వల్ల ఏ కాలంలో అయినా శరీరానికి మేలు జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

పుచ్చకాయ జ్యూస్: వేసవిలో రోడ్డు పక్కన ఉన్న స్టాల్స్‌లో ఏర్పాటు చేసే మరో ముఖ్యమైన స్టాల్ ఇది. ఈ పుచ్చకాయ జ్యూస్ మన దాహం తీర్చడమే కాకుండా శరీరానికి కావలసిన అనేక పోషకాలను అందిస్తుంది.

మెంతి టీ:  మెంతి టీ మన శరీరానికి చాలా చల్లదనాన్ని ఇవ్వడమే కాక శరీరం నుంచి విషాన్ని బయటకు పంపుతుంది. గ్యాస్‌, స్టమక్‌ యాసిడ్‌ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అధిక రక్తపోటు, రక్తంలో చక్కెరను కూడా నియంత్రిస్తుంది. పాలిచ్చే తల్లులలో పాల ఉత్పత్తిని పెంచుతుంది.

జీలకర్ర నీరు: ఆహారంలో ఉపయోగించే జీలకర్ర మన అంతర్గత ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అందుకోసం కాచి చల్లారిన నీటిలో నానబెట్టిన జీలకర్ర నీరు లేదా రెండు చిటికెల జీలకర్ర వేసి మరిగించిన నీరు త్రాగవచ్చు. ఇది మన శరీరానికి చాలా చల్లదనాన్ని ఇవ్వడంతో పాటు జీర్ణ సమస్యలను పరిష్కరిస్తుంది.

కొబ్బరి నీరు: వేసవి కాలంలో తప్పనిసరిగా తీసుకోవలసిన డ్రింక్ ఏమైనా ఉంది అంటే అది కొబ్బరి నీరే. దీనిలోని పోషకాలు మన శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలను కల్సిస్తాయి. వేసవి కాలంలో ఉదయాన్నే కొబ్బరినీళ్లు తాగడం వల్ల శరీరం రోజంతా చల్లగా ఉంటుంది. మధ్యాహ్న సమయంలో  కొబ్బరినీరు తాగితే శరీరానికి ఉల్లాసం లభిస్తుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..