Electricity Bills: కరెంట్ బిల్ కట్టాలా..? ఏ యాప్స్‌ ద్వారా ఎలా చెల్లించాలో తెలుసుకుందాం రండి..

గూగుల్​ పే, పేటీఎం, ఫోన్​పే, భీమ్​ వంటి పలు యాప్స్​ డిజిటల్​ చెల్లింపులకు ఉపయోగకరంగా నిలుస్తున్నాయి. ఈ యాప్‌లు విద్యుత్​ బిల్లు చెల్లింపు, డీటీహెచ్​ రీచార్జ్​,..

Electricity Bills: కరెంట్ బిల్ కట్టాలా..? ఏ యాప్స్‌ ద్వారా ఎలా చెల్లించాలో తెలుసుకుందాం రండి..
Electricity Bills
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 12, 2023 | 3:52 PM

ప్రస్తుతం మనం ఉన్న ఈ టెక్నాలజీ​ యుగంలో డిజిటల్​ చెల్లింపుల హవా నడుస్తోంది. గతంలో లాగా గంటల తరబడి లైన్లలో నిల్చొని బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేకుండా.. ఇంట్లోనే కాళ్లు కదపకుండా పనులన్నీ పూర్తి చేసే సౌకర్యం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. అందుకే డిజిటల్​ చెల్లింపులకు, ఆ సేవలను అందించే యాప్‌లకు ఆదరణ పెరుగుతోంది. గూగుల్​ పే, పేటీఎం, ఫోన్​పే, భీమ్​ వంటి పలు యాప్స్​ డిజిటల్​ చెల్లింపులకు ఉపయోగకరంగా నిలుస్తున్నాయి. ఈ యాప్‌లు విద్యుత్​ బిల్లు చెల్లింపు, డీటీహెచ్​ రీచార్జ్​, మొబైల్​ రీచార్జ్​, గ్యాస్ బుకింగ్​​, మెట్రో కార్డ్ రీఛార్జ్‌లతో పాటు అనే సర్వీసులను అందిస్తున్నాయి. ఆ క్రమంలోనే మీ నెలవారీ విద్యుత్​ బిల్లును BHIM, పేటీఎం, ఫోన్​‌పే ఉపయోగించి ఎలా చెల్లించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

భీమ్(BHIM): మీ ఫోన్‌లో BHIM యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి.. మీ బ్యాంక్ అకౌంట్‌ను యాడ్​ చేయండి. ఇలా చేయడం ద్వారా కేవలం రెండు నిమిషాల్లోనే మీ విద్యుత్ బిల్లును చెల్లించవచ్చు. BHIM యాప్‌లోని స్క్రీన్ మధ్యలో ఉన్న ‘పే బిల్స్​’​పై క్లిక్​ చేసి.. దానిలోని ‘ఎలక్ట్రిసిటీ బిల్​’ ఆప్షన్​ను ఎంచుకోండి. తరువాత మీ రాష్ట్ర పరిధిలోని విద్యుత్​ డిస్ట్రిబ్యూటర్(TSSPDCL/ APSPDCL)​ను ఎంచుకోండి. ఇన్‌పుట్ బాక్స్​లో మీ యూజర్ ఐడీని ఎంటర్​ చేయండి. దీంతో అక్కడ మీరు చెల్లించాల్సిన బ్యాలెన్స్​ అమౌంట్​ చూపిస్తుంది. మీ యూపీఐ పిన్​తో బిల్​ పేమెంట్​ పూర్తి చేయండి. ఆ వెంటనే మీ బిల్​ పేమెంట్​ పూర్తయినట్లు మీ మొబైల్​కు మెసేజ్​ వస్తుంది.

పేటీఎం(Paytm): పేటీఎం యాప్​ ద్వారా కూడా సులభంగా మీ విద్యుత్ బిల్లును చెల్లించవచ్చు. ముందుగా పేటీఎం యాప్‌ని ఓపెన్​ చేసి యాప్ హోమ్‌పేజీలో రీఛార్జ్, బిల్ పేమెంట్​ విభాగంలోకి వెళ్లండి. ఆ తర్వాత ‘ఎలక్ట్రిసిటీ బిల్’ ఆప్షన్​పై క్లిక్​ చేయండి. మీ రాష్ట్ర పరిధిలోని ఎలక్ట్రిసిటీ బోర్డ్​(TSSPDCL/ APSPDCL)​ను ఎంచుకోండి. ఆ తర్వాత మీ యూజర్​ ఐడీని ఎంటర్​ చేసి కంటిన్యూపై క్లిక్ చేయండి. బ్యాలెన్స్​ బిల్​ అమౌంట్​ చూపిస్తుంది. మీ యూపీఐ ఐడీతో పేమెంట్​ పూర్తి చేయండి. ఆపై మీకు బిల్లింగ్ పూర్తయినట్లు మెసేజ్ వస్తుంది.

ఇవి కూడా చదవండి

ఫోన్​ పే(PhonePe): ఫోన్​‌పే ద్వారా కరెంట్ బిల్ చెల్లించడానికి.. యూజర్లు ముందుగా తమ యాప్​ ఓపెన్​ చేసి ‘రీఛార్జ్ అండ్​ బిల్​ పేమెంట్​’ ఆప్షన్​పై క్లిక్​ చేయాలి. దానిలో ఎలక్ట్రిసిటీ బిల్​ ఆప్షన్​ను కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసిన తర్వాత మీ బిల్లర్ పేరును టాప్ సెర్చ్ బార్‌లో ఎంటర్​ చేయండి. తర్వాత మీ కన్స్యూమర్ ఐడీని టైప్ చేసి, కన్ఫర్మ్ చేయండి. మీరు చెల్లించాల్సిన బ్యాలెన్స్​ మొత్తం చూపిస్తుంది. మీ యూపీఐ పిన్ ఎంటర్ చేసి, పేమెంట్​ పూర్తి చేయండి. ఆపై మీ ఫోన్‌కు మెసేజ్ వస్తుంది.

గూగుల్​ పే(Google Pay): ఇతర యూపీఐ యాప్స్ లాగానే గూగుల్ పేలో సైతం ఎలక్ట్రిసిటీ బిల్​ పే చేయవచ్చు. అందుకోసం ముందుగా యాప్ హోమ్​ స్క్రీన్​పై కనిపించే ఎలక్ట్రిసిటీ బిల్​ పేమెంట్​పై క్లిక్​ చేయండి. ఆ తర్వాత మీ ఎలక్ట్రిసిటీ బోర్డ్​ను ఎంచుకొని కన్స్యూమర్​ నెంబర్​ ఎంటర్​ చేయండి. మీ యూపీఐ ఐడీ ఉపయోగించి బ్యాలెన్స్ అమౌంట్​ను చెల్లించండి. తద్వారా మీ ఎలక్ట్రిసిటీ బిల్లింగ్ పూర్తయినట్లే. గూగుల్ పేతో సహా పై అన్ని యాప్స్‌ల​లో ఆటో పే ఆప్షన్​ కూడా అందుబాటులో ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ చూశారా ??
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ చూశారా ??
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..