AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Honda 100cc bike: హీరో, బజాజ్ కంపెనీలకు షాక్.. కిర్రాక్ లుక్‪లో హోండా కొత్త బైక్.. పూర్తి వివరాలు తెలుసుకోండి..

100 సీసీ వేరియంట్లో హీరో స్ల్పెండర్ కు మించి విక్రయాలు జరుపుతున్న బైక్ మరొకటి లేదు. దీని తర్వాత బజాజ్ ప్లాటినా కూడా అత్యంత ప్రజాదరణ పొందింది. ఇప్పుడు రెండింటికీ పోటీగా హోండా కంపెనీ కొత్త 100సీసీ బైక్ తీసుకొస్తోంది.

Honda 100cc bike: హీరో, బజాజ్ కంపెనీలకు షాక్.. కిర్రాక్ లుక్‪లో హోండా కొత్త బైక్.. పూర్తి వివరాలు తెలుసుకోండి..
Honda Shine 125
Madhu
|

Updated on: Mar 12, 2023 | 12:30 PM

Share

గ్రామీణ ప్రాంతాల్లో 100 సీసీ బైక్ లకు డిమాండ్ ఎక్కువ. ఆ డిమాండ్ ను క్యాష్ చేసుకోవడంలో హీరో ముందుంది. హీరో స్ల్పెండర్ ఆ ప్రాంతాల్లో అత్యధిక విక్రయాలు జరుపుతోంది. 100 సీసీ వేరియంట్లో ఈ స్ల్పెండర్ కు మించి విక్రయాలు జరుపుతున్న బైక్ మరొకటి లేదు. దీని తర్వాత బజాజ్ ప్లాటినా కూడా అత్యంత ప్రజాదరణ పొందింది. ఇప్పుడు రెండింటికీ కౌంటర్ పార్ట్ గా హోండా కంపెనీ ఓ 100సీసీ బైక్ తీసుకొస్తోంది. మార్చి 15న దీనికి ముహూర్తం ఫిక్స్ చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన టీజర్ నుచి హోండా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఈ హోండా 100సీసీ బైక్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లను ఓ సారి చూద్దాం..

హోండా షైన్ 100..

హోండా తన కొత్త 100సీసీ బైక్ కు సంబంధించిన టీజర్ విడుదల చేసింది. దీనిలో బైక్ ఎలా ఉండబోతుందో వివరించింది. దీనికి షైనింగ్ ఫ్యూచర్ అని క్యాప్షన్ ఇచ్చింది. బహుశా ఈ బైక్ కి తన అత్యంత ప్రజాదరణ పొందిన బైక్ లలో ఒకటైన హోండా షైన్ పేరునే పెట్టే అవకాశం ఉంది. హోండా షైన్ 100 పేరుతో ఇది లాంచ్ చేసే చాన్స్ ఉంది.

డిజైన్ ఎలా ఉంది..

డిజైన్​ విషయానికొస్తే.. ఈ కొత్త 100సీసీ మోటార్​సైకిల్​.. హోండా షైన్​ 125 సీసీ బైక్​ని పోలి ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ముందు వైపు అచ్చం షైన్ 125లాగే ఉంది. టెలిస్కోపింగ్ ఫోర్క్, డ్యూయల్ షార్క్ అబ్జార్బర్, అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఇంజిన్ ఇలా..

హోండా 100సీసీ బైక్ లో 100 సీసీ సింగిల్ సిలెండర్, ఫ్యూయల్ ఇన్జెక్టర్ ఇంజిన్ ఉంటుంది. ఇది హీరో హీరో స్ల్పెండర్, బజాజ్ సీటీ 100, బజాజ్ ప్లాటినా 100 బైక్ లకు పోటీగా తీసుకొస్తున్నందున ధర కూడా వాటికి దగ్గరగానే ఉండే అవకాశం ఉంది. దీని ధర రూ.70,000 (ఎక్స్ షోరూం) దగ్గరలోనే ఉండే చాన్స్ ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..