AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oppo Reno 7 Pro: కెమెరా లవర్స్‌కి శుభవార్త.. 50MP స్మార్ట్‌ఫోన్‌ ధరపై భారీ తగ్గింపు.. వివరాలివే..

ఒప్పో కంపెనీ.. కెమెరా ప్రియుల కోసమే దాని రెనో సిరీస్ ఫోన్‌లను తయారు చేస్తుంది. Oppo కంపెనీ తన ఈ రెనో సిరీస్‌లో గత సంవత్సరం Oppo Reno 7 సిరీస్ కింద..

Oppo Reno 7 Pro: కెమెరా లవర్స్‌కి శుభవార్త.. 50MP స్మార్ట్‌ఫోన్‌ ధరపై భారీ తగ్గింపు.. వివరాలివే..
Oppo Reno 7 Pro 5g
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 12, 2023 | 4:21 PM

Share

Oppo కంపెనీ విడుదల అయిన చాలా స్మార్ట్‌ఫోన్‌లలో ప్రత్యేకమైన కెమెరా ఉంటుంది. ముఖ్యంగా ఒప్పో కంపెనీ.. కెమెరా ప్రియుల కోసమే దాని రెనో సిరీస్ ఫోన్‌లను తయారు చేస్తుంది. Oppo కంపెనీ తన ఈ రెనో సిరీస్‌లో గత సంవత్సరం Oppo Reno 7 సిరీస్ కింద రెనో 7, Reno 7 Pro అనే రెండు మొబైల్‌లను విడుదల చేసింది. కెమెరా ప్రియులకు తెగ నచ్చేసిన ఈ ఒప్పో స్మార్ట్‌ఫోన్ భారీగా అమ్ముడుపోయింది. విశేషమేమంటే.. ఇప్పుడు కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా  Oppo కంపెనీ తన రెనో 7 ప్రో(Oppo Reno 7 Pro 5G) ఫోన్ ధరను భారీగా తగ్గించింది.

ఇక ఈ క్రమంలోనే మీరు Oppo Reno 7 Pro స్మార్ట్‌ఫోన్ 12 GB RAM + 256 GB స్టోరేజ్ వేరియంట్‌ను చాలా డిస్కౌంట్ ధరలో పొందవచ్చు. కంపెనీ ధర ప్రకారం ఈ వేరియంట్ ధర రూ. 40,990 ఉండగా.. ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమేజాన్‌లో ప్రస్తుతం ఈ ఫోన్ ధర రూ.34,899. రూ. తగ్గింపు ధరలో కనిపించింది. అంతే దాదాపు 15 శాతం తగ్గింపు ప్రకటించింది అమెజాన్. దీనితో పాటు బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా కూడా కొన్ని ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇంకా దీనిపై ఇన్‌స్టంట్‌గా రూ.1,500. రాయితీ పొందవచ్చు. అలాగే  20,000 రూ. వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.

Oppo Reno 7 Pro 5G స్పెసిఫికేషన్స్:

ఒప్పో రెనో 7 ప్రో స్మార్ట్‌ఫోన్ 6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డి+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇంకా 90hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ రెస్పాన్స్ రేట్‌తో పాటు.. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో లభిస్తుంది. ఇది శక్తివంతమైన MediaTek Dimensity 1200 SoC Max ప్రాసెసర్‌తో ఆధారితం. అలాగే ఆండ్రాయిడ్ 11 ఆధారంగా కలర్ OS 12పై రన్ అవుతుంది. ఇదే క్రమంలో కెమెరా విషయానికి వస్తే.. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ప్రైమరీ కెమెరా 50 మెగా పిక్సెల్ సోనీ imx766 సెన్సార్. రెండవ కెమెరా 8-మెగాపిక్సెల్ సెన్సార్, మూడవ కెమెరా 2-మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కలిగి ఉంది. ఇవే కాకుండా 32 మెగా పిక్సెల్ సోనీ imx709 సెన్సార్ సామర్థ్యం గల సెల్ఫీ కెమెరా కూడా ఈ ఫోన్‌లో ఉన్న మరో ప్రత్యేకత. Oppo Reno 7 Pro ఫోన్ బ్యాటరీ కూడా శక్తివంతంగా ఉంది. ఎందుకంటే ఇది 4500 mAh కెపాసిటీని కలిగి ఉంది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఈ ఫోన్ 65W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సప్పోర్ట్ ఇస్తుంది. స్టార్‌ట్రైల్స్ బ్లూ, స్టార్‌లైట్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో మీరు ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ v5.2, GPS/ A-GPS, NFC, USB టైప్-C, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..