MLC Kavitha: కవిత విచారణ ప్రారంభమై 2 గంటలు పూర్తి.. ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న కేసీఆర్.. అరెస్టుపై ఉత్కంఠ..

జాయింట్ డైరెక్టర్ సహా ఆరుగురు సభ్యులతో కూడిన టీమ్ ఎంఎల్‌సీ కవితను విచారిస్తున్నారు. ఇక తమ విచారణలో భాగంగా తొలి గంటలోనే ప్రశ్నలతో..

MLC Kavitha: కవిత విచారణ ప్రారంభమై 2 గంటలు పూర్తి.. ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న కేసీఆర్.. అరెస్టుపై ఉత్కంఠ..
MLC Kavitha
Follow us

|

Updated on: Mar 11, 2023 | 1:23 PM

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితపై ఈడీ విచారణ రెండు గంటలుగా కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం 11 గంటల 09 నిముషాలకు ఢిల్లీలోని ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆఫీసుకు చేరుకున్నారు కవిత. అయితే కవిత విచారణ ప్రారంభమై ఇప్పటికి రెండు గంటలు పూర్తి అయింది. ఈ నేపథ్యంలో జాయింట్ డైరెక్టర్ సహా ఆరుగురు సభ్యులతో కూడిన టీమ్ ఎంఎల్‌సీ కవితను విచారిస్తున్నారు. ఇక తమ విచారణలో భాగంగా తొలి గంటలోనే ప్రశ్నలతో కవితను ఉక్కిరిబిక్కిరి చేసినట్లు తెలుస్తోంది. ఇంకా రూ. వంద కోట్ల హవాలా డబ్బుపై ప్రధానంగా ఆరా జరుపుతోంది ఈడీ. ఐటీసీ కోహినూర్‌ డీల్ తర్వాత హవాలాలో ఎన్నికోట్లు చేతులు మారాయి..? ఢిల్లీలోని బెంగాలీ మార్కెట్‌లో హవాలాకు సహకరించింది ఎవరు..? అని కవితను ఈడీ ఆధికారులు ప్రశ్నించారు. ఇంకా అంతకముందు ధ్వంసం చేసిన ఫోన్ల నుంచి డేటా రికవరీ చేసి కవిత ముందు ఉంచింది ఈడీ విచారణ బృంధం. దీనిపై స్పందించిన కవిత.. డబ్బు చేతులు మారిన ఆధారాలను ఈడీ ముందు పెట్టారు.

ఢిల్లీలో ఎంఎల్‌సీ కవితపై ఈడీ విచారణ సాగుతున్న క్రమంలో.. అక్కడి పరిణామాలను హైదరాబాద్‌లోని ప్రగతిభవన్ నుంచే కేసీఆర్ ఆరా తీస్తున్నారు. ఎప్పటికప్పుడు కేటీఆర్‌, హరీష్‌రావులను అడిగి సమీక్ష జరుపుతున్నారు. కాగా, విచారణ అనంతరం కవితను అరెస్ట్ చేసే వరకూ ఈడీ వెళ్తే.. ఢిల్లీలోని అప్ మద్దతుతో ఆందోళన కార్యక్రమాలు, పెద్ద ఎత్తున నిరసనలు జరపాలని బీఆర్‌ఎస్ ప్లాన్ వేసినట్లు సమాచారం. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ మంత్రలు హస్తినాలోనే ఉండగా.. మరి కొందరు బీఆర్‌ఎస్ నేతలు హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి క్యూ కడుతున్నారు. ఇంకా వారితో పాటు పలువురు మంత్రులు, బీఆర్ఎస్ పార్టీలోని కొందరు కీలక నేతలు కూడా ఉన్నారని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరోవైపు కవితను అరెస్టు చేయకుంటే ముద్దుపెట్టుకుంటారా..? అంటూ తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ ఘాటుగా రియాక్టయ్యారు. తప్పుచేసినవారు ఎంతటివారైనా శిక్షతప్పదన్నారు. ఆమె తప్పు చేయనప్పుడు భయమెందుకని ప్రశ్నించారు. అయితే బండి సంజయ్‌కు మెంటల్‌ హాస్పిటల్‌లో చేర్చాలన్నారు ఎంపీ మాళోత్‌ కవిత. బండి మాట తీరును చూసి యావత్‌ తెలంగాణ మహిళా సమాజం సిగ్గుపడుతోందన్నారు. కవిత అరెస్టు చేయకపోతే ముద్దుపెట్టుకుంటారా అంటూ చేసిన కామెంట్‌పై క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ గన్‌పార్క్‌ దగ్గర కవితకు వ్యతిరేకంగా ఓయూ జేఏసీ భగ్గుమంది. లిక్కర్‌ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. కవిత తీరు తెలంగాణ తలదించుకునేలా చేసిందన్నారు. అందుకు నైతిక బాధ్యత వహిస్తూ కేసీఆర్‌ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..