AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sreeleela: ఈ అమ్మడి మనసూ అందమైనదే.. అనాథ పిల్లల కోసం శ్రీలీల ఏం చేసిందో తెలిస్తే హ్యాట్సాఫ్ చెబుతారంతే

సినిమాల సంగతి పక్కన పెడితే సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటుంది శ్రీలీల. అందుకే ఈ అమ్మడి మనసూ కూడా అందమైనదేనంటున్నారు ఫ్యాన్స్‌. వివరాల్లోకి వెళితే.. సాధారణంగా సినిమా షూటింగ్‌ల నుంచి విరామం లభిస్తే సినిమా

Sreeleela: ఈ అమ్మడి మనసూ అందమైనదే.. అనాథ పిల్లల కోసం శ్రీలీల ఏం చేసిందో తెలిస్తే హ్యాట్సాఫ్ చెబుతారంతే
Actress Sreeleela
Basha Shek
|

Updated on: Mar 13, 2023 | 6:00 AM

Share

శ్రీలీల.. చేసింది రెండు సినిమాలే కానీ.. స్టార్‌ హీరోయిన్‌కి మించిన క్రేజ్‌ సొంతం చేసుకుందీ అందాల తార. పెళ్లి సందడితో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ కన్నడ ముద్దుగుమ్మ మొదటి సినిమాలోనే అందం, అభినయం పరంగా ఫుల్‌ మార్కులు కొట్టేసింది. ఆతర్వాత రవితేజ ధమాకా సినిమాతో సూపర్‌ హిట్‌ సినిమాను సొంతం చేసుకుంది. ఇందులో ఆమె అభినయంతో పాటు స్టెప్పులు ఓ రేంజ్‌లో సెన్సేషన్‌ సృష్టించాయి. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో జెట్‌ స్పీడ్‌లో దూసుకెళుతూ స్టార్‌ హీరోల సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటోందీ సొగసరి. ఇదిలా ఉంటే సినిమాల సంగతి పక్కన పెడితే సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటుంది శ్రీలీల. అందుకే ఈ అమ్మడి మనసూ కూడా అందమైనదేనంటున్నారు ఫ్యాన్స్‌. వివరాల్లోకి వెళితే.. సాధారణంగా సినిమా షూటింగ్‌ల నుంచి విరామం లభిస్తే సినిమా తారలు వెకేషన్‌ లేదా టూర్లకు చెక్కేస్తారు. లేదా ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవడానికి తమ సమయాన్ని కేటాయిస్తారు. కానీ శ్రీలీల మాత్రం తనకు దొరికిన ఖాళీ సమయాన్ని అనాథ పిల్లల కోసం కేటాయిస్తోంది. ఇందుకోసం #HereForYou అనే క్యాంపెయిన్‌ను ప్రారంభించింది శ్రీలీల. ఇందులో భాగంగా ఇటీవల ఓ అనాథ శ‌ర‌ణాల‌యానికి వెళ్లి అక్క‌డి పిల్ల‌ల‌తో సరదాగా గ‌డిపింది.

ఇవి కూడా చదవండి

అనంతరం ఆ ఫొటోల‌ను నెట్టింట షేర్ చేసిన ఆమె ‘గొప్ప మనసులున్న చిన్నారులను కలిశాను. గొప్ప కలలున్న సమాజం వీళ్లు. డాన్సులు, కథలు చెప్పుకోవటం వంటి కార్య‌క్ర‌మాల‌తో ఎంతో ఆనందంగా గ‌డిపాను. నా ప్రేమ‌ను వీరికి పంచాల‌నే ఉద్దేశంతో ఇక్క‌డ‌కు వ‌చ్చాను. వారి అమాయ‌క చూపుల్లో త‌డిసి ముద్ద‌య్యాను. ఇలాంటి ప‌నులు చేయాల‌ని అంద‌రికీ ఉంటుంది. అయితే ఎలా చేయాలి? ఏం చేయాల‌నేది తెలియ‌క పోవ‌చ్చు. గూగుల్‌లో సెర్చ్ చేసి ఇలాంటి చిన్నారులు మీ చుట్టు ప‌క్క‌లే ఉంటారు. వారిని క‌లుసుకోండి. నేను వారికి మీరు భారీ విరాళాలు ఇవ్వామని చెప్ప‌డం లేదు. మీ విలువైన స‌మ‌యంలో కొంత వారికి కేటాయించండి. వాళ్లు కోరుకునేది అదే. వారానికో, నెల‌కో వారితో స‌మ‌యాన్ని కేటాయించండి. ఇది వారి క‌డుపు మాత్ర‌మే కాదు.. హృద‌యాన్ని కూడా ఆనందంతో నింపేస్తుంది. అలాంటి మ‌న‌సుతోనే నేను #HereForYou కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టాను. మీరు ఏదేని అనాథాశ్ర‌మాన్ని సంద‌ర్శిస్తే ఆ ఫొటోల‌ను షేర్ చేస్తూ #HereForYou హ్యాష్‌ ట్యాగ్‌ జ‌త చేయండి’ అని పిలుపునిచ్చింది శ్రీలీల. ప్రస్తుతం అనాథాశ్రమంలో పిల్లలతో శ్రీలీల గడిపిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంత చిన్న వయసులోనే అంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన శ్రీలీలపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Sreeleela (@sreeleela14)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..