Oscars 2023 Highlights: చరిత్ర సృష్టించిన ఆర్ఆర్ఆర్.. నాటు నాటు పాటకు ఆస్కార్.. విశ్వవేదికపై అవార్డ్ అందుకున్న కీరవాణి, చంద్రబోస్..

Basha Shek

| Edited By: Rajeev Rayala

Updated on: Mar 13, 2023 | 5:04 PM

95th Academy Awards 2023 Live Updates: యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న 95వ ఆస్కార్‌ వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. అమెరికా లాస్ ఏంజిల్స్‌లోని డోల్బీ థియేటర్ వేదికగా జరిగే ఈ వేడుక కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీతారలు చేరుకున్నారు.

Oscars 2023 Highlights: చరిత్ర సృష్టించిన ఆర్ఆర్ఆర్.. నాటు నాటు పాటకు ఆస్కార్.. విశ్వవేదికపై అవార్డ్ అందుకున్న కీరవాణి, చంద్రబోస్..
Keeravani, Chandrabose

95th Academy Awards 2023 Live Updates: యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న 95వ ఆస్కార్‌ వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. అమెరికా లాస్ ఏంజిల్స్‌లోని డోల్బీ థియేటర్ వేదికగా జరిగే ఈ వేడుక కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీతారలు చేరుకున్నారు. ఈ సారి ఆస్కార్ అవార్డు వేడుకను ప్రముఖ కమెడియన్ జిమ్మీ కిమ్మెల్ హోస్ట్ చేయనున్నారు. ఆస్కార్ రేసులో ఆర్ఆర్ఆర్ నుంచి నాటు నాటు సాంగ్ పోటీ పడుతుండడంతో భారతీయులంతా ఈ సినీ వెంట్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఆర్‌ఆర్‌ఆర్‌ హీరోలు రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌, దర్శకుడు రాజమౌళి, సింగర్స్ కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌ లాస్‌ఏంజెలిస్‌ చేరుకున్నారు. నాటు నాటు సాంగ్‌తో పాటు మరో రెండు భారతీయ డాక్యుమెంటరీలు కూడా ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్స్‌లో ఉన్నాయి. ఇక ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుల ప్రజెంటర్‌గా బాలీవుడ్ బ్యూటీ దీపిక హీరోయిన్‌ అరుదైన గౌరవం దక్కించుకుంది. ఆమెతో పాటు జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, ఇషా గుప్తా తదితర బాలీవుడ్ తారలు ఆస్కార్‌ థియేటర్‌ వద్ద సందడి చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 13 Mar 2023 02:29 PM (IST)

    నాటు నాటు సాంగ్ పై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్

  • 13 Mar 2023 12:21 PM (IST)

    తెలుగు సినిమాకి ఆస్కార్ రావడం గర్వాంగా ఫీల్ అవుతున్న.. టీవీ9 తో RRR నిర్మాత dvv దానయ్య

    తెలుగు సినిమాకు ఆస్కార్ రావడం గర్వంగా ఫీల్ అవుతున్నని అన్నారు ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య. తనకు ఆనందంతో మాటలు రావడం లేదని.. ప్రపంచ స్థాయికి సినిమా వెళ్లడం రాజమౌళి క్రెడిట్ అని.. సినిమా కోసం అందరూ కష్టపడ్డారని.. నాటు నాటు పాట కోసం 16 రోజులు కష్టపడ్డారని..రానున్న రోజుల్లో తెలుగు సినిమాకి మరిన్ని అవార్డ్ లు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.

  • 13 Mar 2023 11:44 AM (IST)

    నాటు నాటు పాటకు అవార్డ్ రావడం ఎమోషనల్ మొమెంట్.. ఎన్టీఆర్..

    95వ అకాడమీ అవార్డ్స్ వేడుకలలో ఈసారి తెలుగు సినిమా సత్తా చాటింది. నాటు నాటు పాటకు అవార్డ్ ఎమోషనల్ మొమెంట్ అన్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇది గ్రేట్‌ ఫీలింగ్‌ అని.. నాటు నాటుకి అవార్డు రావడం ఎమోషనల్‌ మొమెంట్‌ అని అన్నారు. అలాగే.. ఇండియాని ఆర్‌ఆర్‌ఆర్‌ రెప్రెజెంట్‌ చేసిందన్నారు. భిన్నసంస్కృతుల సమ్మేళనం భారతం అని.. ఇంటెన్స్, స్ట్రాంగ్‌, డ్రమాటిక్‌, యాక్షన్‌ ఫిల్డ్ మూవీస్‌ వస్తాయని అన్నారు. తాను ఏడవలేదని.. కానీ కళ్లు మాత్రం తడిబారాయన్నారు.

  • 13 Mar 2023 11:32 AM (IST)

    దేశం గెలిచింది.. ఆస్కార్ అవార్డుతో ఇంటికి వస్తున్నాం.. రామ్ చరణ్..

    95వ ఆస్కార్ అవార్డ్ వేడుకలలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డ్ కైవలం చేసుకుంది నాటు నాటు సాంగ్. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘ఇది భారతదేశానికి వచ్చిన గౌరవంగా భావిస్తున్నా.. నేను పనిచేసిన పాటకు ఆస్కార్‌ వచ్చింది. పాటను, సినిమాను, మమ్మల్ని, మా దర్శకుడిని మీరు ఆదరించినందుకు ధన్యవాదాలు. అందరి ఆశీస్సులు ఫలించాయి’ అంటూ చెప్పుకొచ్చారు. అలాగే .. మేం గెలిచాం.. ఇండియన్ సినిమాగా గెలిచాం.. దేశం గెలిచింది. ఆస్కార్ అవార్డుతో ఇంటికి వస్తున్నాం అంటూ ట్వీట్ చేశారు చరణ్.

  • 13 Mar 2023 11:24 AM (IST)

    భారతదేశం ఓ చరిత్ర సృష్టించిన రోజు… చంద్రబాబు..

    ఆస్కార్ పోటీలో తెలుగువారు ప్రపంచానికి టార్చ్ బేరర్ లా నిలవటం గర్వకారణమని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. భారతదేశం ఓ చరిత్ర సృష్టించిన రోజు అని.. 95ఏళ్ల ఆస్కార్ చరిత్రలో ‘నాటు నాటు’ పాట చరిత్ర సృష్టించి తెలుగునేలని పులకింప చేసిందని అన్నారు. కీరవాణి, పాట రాసిన చంద్రబోస్, రాజమౌళికి నా అభినందనలు. టీమ్ లీడర్ రాజమౌళి అయినా జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రేమ్ రక్షిత్, కాలభైరవ అంతా ఓ చరిత్ర సృష్టించేలా కష్టపడ్డారు అంటూ ట్వీట్ చేశారు.

  • 13 Mar 2023 11:17 AM (IST)

    భారతీయ సినీ చరిత్రలో అపూర్వ ఘట్టం.. నందమూరి బాలకృష్ణ

    ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డుని గెలుపొందిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర బృందానికి నా హృదయపూర్వక అభినందనలు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఉత్తమ పాటగా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకోవడం భారతీయ సినీ చరిత్రలో అపూర్వ ఘట్టం. తెలుగు జాతితో పాటు దేశం గర్వించదగిన విజయమిది. స్వరకర్త కీరవాణి గారికి, గీత రచయిత చంద్రబోస్ గారికి, ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు. అలాగే డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌ కేటగిరిలో ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకున్న భారతీయ చిత్రం ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ చిత్ర బృందానికి నా అభినందనలు’’ అన్నారు నందమూరి బాలకృష్ణ.

  • 13 Mar 2023 11:07 AM (IST)

    భారతీయులు గర్విస్తున్న క్షణాలివి.. పవన్ కళ్యాణ్..

    భారతీయులందరూ గర్వపడేలా ఆస్కార్ వేదికపై పురస్కారాన్ని స్వీకరించిన ‘ఆర్.ఆర్.ఆర్.’ చిత్ర సంగీత దర్శకులు శ్రీ ఎం.ఎం.కీరవాణి గారికి, గీత రచయిత శ్రీ చంద్రబోస్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా నిలిచిన ‘ఆర్.ఆర్.ఆర్.’ చిత్రంలో ‘నాటు నాటు…’ గీతంలోని తెలుగు పదం నేల నలుచెరగులా ప్రతి ఒక్కరితో పదం కలిపేలా చేసి హుషారెత్తించింది. ఆ హుషారు ఈ రోజు ఆస్కార్ వేదిక మీద రెట్టించిన ఉత్సాహంతో కనిపించింది. ఈ వేదికపై ఈ గీతాన్ని ప్రదర్శించడంతోపాటు… అవార్డు పొందటం ద్వారా భారతీయ సినిమా స్థాయి మరో స్థాయికి చేరిందంటూ ట్వీట్ చేశారు.

  • 13 Mar 2023 10:43 AM (IST)

    కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ పై ప్రభుదేవా ప్రశంసలు..

    ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డ్ కైవసం చేసుకున్నందుకు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ కు ప్రభుదేవా అభినందనలు తెలిపారు. ప్రేమ్ రక్షిత్ సాధించాడు. నాటు నాటు సాంగ్ కొరియోగ్రాఫింగ్ చేసినందుకు మేమంతా నిన్ను చూసి గర్విస్తున్నాము అంటూ ట్వీట్ చేశారు.

  • 13 Mar 2023 10:06 AM (IST)

    ఆర్ఆర్ఆర్ టీంకు ప్రధాని శుభాకాంక్షలు..

    ఇది ఆసాధారణం. నాటు నాటు పాటకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉంది. ఇది రాబోయే సంవత్సరాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే పాట అవుతుంది. ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి అభినందనలు. భారతదేశం గర్వంతో ఉప్పొంగుతుంది. అంటూ ట్వీట్ చేశారు ప్రధాని మోదీ.

  • 13 Mar 2023 09:49 AM (IST)

    చరిత్ర తిరిగరాశారు.. రవితేజ..

    ఇది ఎప్పటికీ ప్రేక్షకుల మనసులలో చిరస్థాయిగా ఉండిపోతుంది. రాబోయే తరాలకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ ప్రతిష్టాత్మకమైన వేడుకలలో ఆర్ఆర్ఆర్ అగ్రస్థానంలో ఉంది. అంటూ మూవీ టీంకు శుభాకాంక్షలు తెలిపారు రవితేజ.

  • 13 Mar 2023 09:42 AM (IST)

    ఆనందంతో గంతులేసిన రాజమౌళి దంపతులు..

    ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో సంతోషంతో భావోద్వేగానికి గురయ్యారు. ఇక జక్కన్న తనయుడు కార్తికేయ గంతులేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతుంది.

  • 13 Mar 2023 09:31 AM (IST)

    ఆర్ఆర్ఆర్ టీంకు వెంకయ్య నాయుడు విషెస్..

    నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డ్ గెలుచుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. మూవీ టీంకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

  • 13 Mar 2023 09:24 AM (IST)

    కోట్లాది మంది హృదయాలు గర్వంతో ఉప్పొంగుతున్నాయి… మెగాస్టార్ చిరంజీవి..

    ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట ఆస్కార్ గెలుచుకోవడంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. భారత్ కల ఓ వ్యక్తి వల్ల సాకారమైందని అన్నారు చిరు. “భారత్ ఎప్పటికీ ఒక కల అని భావించేది.. కానీ ఓ వ్యక్తి విజన్, ధైర్యం, పట్టుదలతోనే ఇది సాకారమైంది. ఇప్పుడు కోట్ల మంది భారతీయుల హృదయాలు గర్వంతో ఉప్పొంగిపోతున్నాయి. ఆర్ఆర్ఆర్ బృందంలోని ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా ” అంటూ ట్వీట్ చేశారు చిరు.

  • 13 Mar 2023 09:16 AM (IST)

    ఉత్తమ చిత్రం ‘Everything Everywhere All At Once’ .

    ‘Everything Everywhere All At Once’ చిత్రం ఉత్తమ చిత్రంగా ఆస్కార్ అవార్డ్ గెలుచుకుంది. ఈ అవార్డు వేడుకలలో ఈ చిత్రం ఏకంగా ఏడు ఆస్కార్స్ గెలుచుకుంది.

  • 13 Mar 2023 09:09 AM (IST)

    ఉత్తమ నటిగా మిచెల్ యోహ్..

    ‘Everything Everywhere All At Once’ మూవీ ఫేమ్ యాక్ర్టెస్ మిచెల్ యోహ్ ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డ్ అందుకున్నారు. ఈ విభాగంలో కేట్ బ్లాంచెట్ – టార్, అనా డి అర్మాస్ – బ్లోండ్, ఆండ్రియా రైస్‌బరో – టు లెస్లీ, మిచెల్ విలియమ్స్ – ది ఫాబెల్‌మాన్స్ పోటీ పడగా.. మిచెల్ యోహ్ గెలుపొందారు.

  • 13 Mar 2023 08:59 AM (IST)

    ఉత్తమ నటుడిగా బ్రెండన్ ఫ్రేజర్..

    ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డ్ అందుకున్న బ్రెండన్ ఫ్రేజర్. ఈ కేటగిరిలో ఆస్టిన్ బట్లర్ – ఎల్విస్, కోలిన్ ఫారెల్ – ది బాన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్, పాల్ మెస్కల్ – ఆఫ్టర్‌సన్, బిల్ నైజీ – లివింగ్ నామినేట్ కాగా.. బ్రెండన్ ఫ్రేజర్ ఆస్కార్ అందుకున్నారు.

  • 13 Mar 2023 08:48 AM (IST)

    ఉత్తమ దర్శకుడిగా డానియల్ క్వాన్.. డేనియల్ షినెర్ట్..

    ఆస్కార్ అవార్డ్స్ వేడుకలలో ఉత్తమ దర్శకుడిగా ‘Everything Everywhere All At Once’ చిత్రానికి గానూ డైరెక్టర్స్… డానియల్ క్వాన్.. డేనియల్ షినెర్ట్ అవార్డ్స్ అందుకున్నారు. ఈ కేటగిరిలో టాడ్ ఫీల్డ్ – టార్, మార్టిన్ మెక్‌డొనాగ్ – ది బాన్‌షీస్ ఆఫ్ ఇనిషెరిన్, రూబెన్ ఓస్ట్‌లండ్ – ట్రయాంగిల్ ఆఫ్ సాడ్‌నెస్, స్టీవెన్ స్పీల్‌బర్గ్ – ది ఫాబెల్‌మాన్స్ నామినేట్ అయ్యారు.

  • 13 Mar 2023 08:44 AM (IST)

    బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్..

    బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ విభాగంలో ‘Everything Everywhere All At Once’ చిత్రం ఆస్కార్ గెలుచుకుంది. ఈ కేటగిరిలో ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్, ఎల్విస్, టార్, టాప్ గన్: మావెరిక్ నామినేట్ అయ్యాయి.

  • 13 Mar 2023 08:34 AM (IST)

    బెస్ట్ సౌండ్.. టాప్ గన్ మావెరిక్..

    95వ అకాడమీ అవార్డ్స్‌లో ‘టాప్ గన్ మావెరిక్’ ఉత్తమ సౌండ్‌ విభాగంలో ఆస్కార్ గెలుచుకున్నాడు. ఈ అవార్డ్ కోసం ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్, అవతార్: ది వే ఆఫ్ వాటర్, ది బాట్‌మాన్, ఎల్విస్ పోటీపడ్డాయి.

  • 13 Mar 2023 08:32 AM (IST)

    అవార్డ్ అందుకుంటూ పాట పాడిన కీరవాణి..

    అంతర్జాతీయ వేదికపై ఆస్కార్ అవార్డ్ అందుకుంటూ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి పాట పాడారు. 95వ అకాడమీ అవార్డ్‌లో నాటు నాటు ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌ కేటగిరిలో అవార్డ్ గెలుచుకుంది.

  • 13 Mar 2023 08:27 AM (IST)

    నాటు నాటు పాటకు ఆస్కార్..

    ఆస్కార్ అవార్డ్ వేడుకలలో నాటు నాటు సాంగ్ అవార్డ్ దక్కించుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నామినేట్ అయిన నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకుంది. విశ్వవేదికపై మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డ్స్ అందుకున్నారు.

  • 13 Mar 2023 08:25 AM (IST)

    బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే.. ఉమెన్ టాకింగ్..

    95వ అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే విభాగంలో ‘ఉమెన్ టాకింగ్’ ఆస్కార్ గెలుచుకుంది. ఈ విభాగంలో ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్, గ్లాస్ ఆనియన్: ఎ నైవ్స్ అవుట్ మిస్టరీ, లివింగ్, టాప్ గన్: మావెరిక్ పోటీ పడ్డాయి.

  • 13 Mar 2023 08:16 AM (IST)

    బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే..

    బెస్ట్ ఒరిజినల్ స్ర్కీన్ ప్లే విభాగంలో డేనియల్ క్వా, డేనియల్ షినెర్ట్ రూపొందించిన ‘Everything Everywhere All At Once’ ఆస్కార్ గెలుచుకుంది. ఈ విభాగంలో ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్ – మార్టిన్ మెక్‌డొనాగ్, ది ఫాబెల్‌మాన్స్ – స్టీవెన్ స్పీల్‌బర్గ్, టోనీ కుష్నర్, టార్ – టాడ్ ఫీల్డ్, ట్రయాంగిల్ ఆఫ్ సాడ్‌నెస్ – రూబెన్ ఓస్ట్‌లండ్ పోటీ పడ్డాయి.

  • 13 Mar 2023 08:13 AM (IST)

    ఇద్దరు మహిళలు భారత్ కీర్తి.. ఇది చారిత్రాత్మకం.

    95వ అకాడెమీ అవార్డ్స్‌లో బెస్ట్ షార్ట్ ఫిల్మ్ కేటగిరిలో ది ఎలిఫెంట్ విసిపరర్స్ ఆస్కార్ గెలుచుకుంది. చీరకట్టు వేదికపై ఆవార్డ్ అందుకున్నారు మేకర్ గునీత్ మోంగా. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో “ఇండియన్ ప్రొడక్షన్‌కి ఇది మొట్టమొదటి ఆస్కార్. ఈ రాత్రి చారిత్రాత్మకం. ఇద్దరు మహిళలతో భారతదేశం యొక్క కీర్తి” అని గునీత్ మోంగా రాసుకొచ్చారు.

  • 13 Mar 2023 08:00 AM (IST)

    బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్.. అవతార్ ది వే ఆఫ్ వాటర్..

    బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో అవతార్.. ది వే ఆఫ్ వాటర్ చిత్రం ఆస్కార్ గెలుచుకుంది. ఈ విభాగంలో ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్, ది బ్యాట్‌మ్యాన్, బ్లాక్ పాంథర్ వకాండ ఫరెవర్, టాప్ గన్ మావెరిక్ చిత్రాలు పోటీ పడ్డాయి.

  • 13 Mar 2023 07:54 AM (IST)

    రాజమౌళికి థాంక్స్ చెప్పిన రామ్ చరణ్ సతీమణి..

    దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి థాంక్స్ చెప్పారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల. ఆస్కార్ అవార్డ్ వేడుకలలో జక్కన్న ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలను ఇన్ స్టా వేదికగా పంచుకుంటూ ఆస్కార్ లవ్ అంటూ రాసుకొచ్చారు.

  • 13 Mar 2023 07:49 AM (IST)

    బెస్ట్ ఒరిజినల్‌ స్కోర్‌ – ‘ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్’..

    ‘ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్’ చిత్రం బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఆస్కార్ అవార్డు అందుకుంది. ఈ విభాగంలో బాబిలోన్, ది బాన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ మరియు ది ఫాబెల్మాన్స్ పోటీ పడగా..’ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్’ గెలిచింది.

  • 13 Mar 2023 07:45 AM (IST)

    బెస్ట్ ప్రొడక్షన్‌ డిజైన్‌ – ‘ఆల్‌ క్వైట్ ఆన్‌ ది వెస్టర్న్ ఫ్రంట్‌’..

    బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ విభాగంలో ‘ఆల్‌ క్వైట్ ఆన్‌ ది వెస్టర్న్ ఫ్రంట్‌’ చిత్రం ఆస్కార్ అవార్డ్ గెలుచుకుంది. ఈ అవార్డ్ కోసం Avatar: The Way of Water, Babylon, Elvis, The Fabelmans చిత్రాలు పోటీ పడ్డాయి.

  • 13 Mar 2023 07:42 AM (IST)

    సర్వత్రా ఉత్కంఠ పెంచుతున్న ఆస్కార్‌ వేడుక..

    సర్వత్రా ఉత్కంఠ పెంచుతున్నాయి ఆస్కార్ వేడుకలు. ఇప్పటిదాకా పదకొండు అవార్డుల ప్రదానం జరగ్గా.. బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచ్‌ ఫిల్మ్ విభాగంలో భారత్‌ అవార్డ్ అందుకోలేకపోయింది. డాక్యుమెంటరీ విభాగంలో నామినేట్ అయిన ఆల్‌ దట్‌ బ్రీత్స్ అవార్డ్ దక్కించుకోలేకపోయింది.

  • 13 Mar 2023 07:37 AM (IST)

    బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్..

    ది బాయ్, ది మోల్, ది ఫాక్స్ అండ్ ది హార్స్ బెస్ట్ యానిమేటేడ్ షార్ట్ ఫిల్మ్స్‏గా నిలిచాయి. ఈ అవార్డ్ కోసం ది ఫ్లయింగ్ సెయిలర్, ఐస్ మర్చంట్స్, మై ఇయర్ ఆఫ్ డిక్స్, యాన్ ఓస్ట్రిచ్ టోల్డ్ మి ది వరల్డ్ ఈజ్ ఫేక్, ఐ థింక్ ఐ బిలీవ్ ఇట్ షార్ట్ ఫిల్మ్ నామినేట్ అయ్యాయి.

  • 13 Mar 2023 07:34 AM (IST)

    బెస్ట్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో భారత్‏కు ఆస్కార్‌..

    బెస్ట్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఇండియాకు ఆస్కార్ లభించింది. ది ఎలిఫెంట్ విస్పరర్స్ ఆస్కార్ అవార్డు అందుకుంది. వేదిక మీదకు చీరకట్టులో వెళ్లారు ఫిల్మ్ మేకర్ గునీత్‌ మోంగా. సంప్రదాయ దుస్తుల్లో అవార్డ్ అందుకున్నారు కార్తికి గాన్‌స్లేవ్స్, గునీత్‌ మోంగా.

  • 13 Mar 2023 07:27 AM (IST)

    భారత్ కు ఆస్కార్..

    భారతీయ చిత్రం ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ అవార్డ్ గెలుచుకుంది. ఈ అవార్డ్ కోసం హౌలౌట్, హౌ డు యు మెజర్ ఏ ఇయర్?, ది మార్తా మిచెల్ ఎఫెక్ట్, స్ట్రేంజర్ ఎట్ ది గేట్ నామినేట్ కాగా.. భారత్ నుంచి ఎంపికైనా ది ఎలిఫెంట్ విస్పరర్స్ విజేతగా నిలిచింది.

  • 13 Mar 2023 07:24 AM (IST)

    నాటు నాటు పాటకు స్టాండింగ్ ఓవియేషన్..

    ఆస్కార్ వేదికపై నాటు నాటు పాట లైవ్ పెర్ఫామెన్స్‏తో అదరగొట్టారు సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ. వెస్టర్స్ డాన్స్ తో మెప్పించారు హాలీవుడ్ డ్యాన్సర్స్. దీంతో అక్కడున్నవారంత నాటు నాటు పాట పెర్ఫామెన్స్ కు లైవ్ ఓవియేషన్ ఇచ్చారు.

  • 13 Mar 2023 07:21 AM (IST)

    బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్.. ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్..

    ‘ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్’ మూవీ ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్‌గా నిలిచింది. ఈ అవార్డ్ కోసం అర్జెంటీనా, 1985 (అర్జెంటీనా), క్లోజ్ (బెల్జియం), EO (పోలాండ్), ది క్వైట్ గర్ల్ (ఐర్లాండ్) నామినేట్ అయ్యాయి.

  • 13 Mar 2023 07:15 AM (IST)

    ఆస్కార్‌ వేదిక మీద ఆకట్టుకుంటున్న మనవారి వస్త్రధారణ..

    ఆస్కార్ వేదికపై లాల్చీ పంచకట్టులో మెప్పించిన సింగర్స్ రాహుల్‌, కాలభైరవ. మరోవైపు బ్లాక్‌ డ్రస్‌లో అదరగొడుతున్న ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌. భారతీయత ఉట్టిపడేలా లాల్చీ, పైజామాలో కనిపించిన రాజమౌళి.

  • 13 Mar 2023 07:12 AM (IST)

    ఆస్కార్ వేదికపై నాటు నాటు సాంగ్ లైవ్ పెర్ఫామెన్స్..

    ఆస్కార్ వేదికపై సింగర్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ నాటు నాటు సాంగ్ పాడారు. బ్లాక్ ట్రెడిషనల్ వేర్‏లో.. లాల్చీ, పంచకట్టులో కనిపించారు సింగర్స్.

  • 13 Mar 2023 07:08 AM (IST)

    ఆస్కార్‌ స్టేజ్‌ మీదకు వచ్చిన దీపిక పదుకోణె..

    అస్కార్ వేదికపైకి చేరుకున్నారు బాలీవుడ్ నటి దీపిక పదుకోణె. స్టేజ్ పై ఆర్‌ఆర్‌ఆర్‌ గురించి మాట్లాడింది. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌ గురించి దీపిక మాట్లాడింది.

  • 13 Mar 2023 07:05 AM (IST)

    నాటు నాటు పెర్ఫామెన్స్..

    ఆస్కార్ అవార్డ్స్ వేదికపై నాటు నాటు పాటకు హాలీవుడ్ డ్యాన్సర్లు పెర్ఫామెన్స్ ఇచ్చారు. నాటు నాటు పాట లైవ్ ప్రదర్శన ఇవ్వడంతో థియేటర్ మొత్తం చప్పట్లతో దద్దరిల్లింది.

  • 13 Mar 2023 07:02 AM (IST)

    బెస్ట్ కాస్ట్యూమ్స్ – బ్లాక్‌ పాంథర్‌

    ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్ చిత్రం ఆస్కార్ దక్కించుకుంది. ఈ అవార్డ్ కోసం “బాబిలోన్”, “బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్”, “ఎల్విస్”, “ఎవరీథింగ్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్”, “మిసెస్ హారిస్ గోస్ టు ప్యారిస్” చిత్రాలు పోటీపడ్డాయి.

  • 13 Mar 2023 06:54 AM (IST)

    మేకప్‌ అండ్‌ హెయిర్‌స్టైల్‌ – ది వేల్‌..

    ఈ విభాగంలో ముగ్గురు అవార్డు అందుకున్నారు. ది వేల్‌‏కి మేకప్‌, హెయిర్‌స్టైల్‌కి అవార్డు అందుకున్నారు అడ్రిన్‌ మొరోట్‌, జుడీ చిన్‌, అన్నీమేరీ బ్రాడ్లీ.

  • 13 Mar 2023 06:49 AM (IST)

    బెస్ట్ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‏గా ‘గులెర్మో డెల్‌ టోరోస్‌ పినోచియో’..

    ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్‏గా గులెర్మో డెల్ టోరోస్ పినోచియో చిత్రం అవార్డ్ గెలుచుకుంది. ఈ అవార్డ్ కోసం మార్సెల్ ది షెల్ విత్ షూస్ ఆన్, పస్ ఇన్ బూట్స్: ది లాస్ట్ విష్, ది సీ బీస్ట్, టర్నింగ్ రెడ్ పోటీ పడ్డాయి.

  • 13 Mar 2023 06:46 AM (IST)

    బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డ్ ‘జేమ్స్ ఫ్రెండ్’..

    ఉత్తమ సినిమాటోగ్రఫీ ఆస్కార్ అవార్డ్ జేమ్స్ ఫ్రెండ్ కు అందుకున్నారు. ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్ చిత్రానికి ఈ అవార్డ్ అందుకున్నారు జేమ్స్ ఫ్రెండ్. ఈ అవార్డ్ కోసం డారియస్ ఖోండ్జ్..”బార్డో, ఫాల్స్ క్రానికల్ ఆఫ్ ఎ హ్యాండ్‌ఫుల్ ఆఫ్ ట్రూత్స్”, మాండీ వాకర్.. “ఎల్విస్”, రోజర్ డీకిన్స్.. “ఎంపైర్ ఆఫ్ లైట్”, ఫ్లోరియన్ హాఫ్‌మీస్టర్.. “తార్” పోటి పడ్డారు.

  • 13 Mar 2023 06:38 AM (IST)

    రెడ్ కార్పెట్‏పై గర్జించే పులిలా ఎన్టీఆర్..

    రెడ్ కార్పెట్ మీద గర్జించే పులి బొమ్మ ఉన్న సూట్‏తో ఎంట్రీ ఇచ్చారు తారక్.. టైగర్ పిక్చర్ గురించి ఆరా తీశారు నిర్వహాకులు. పులి.. భారత్ జాతీయ మృగం అని చెప్పిన ఎన్టీఆర్. రెడ్ కార్పెట్ పైకి ఇండియా నడిచి వస్తున్న సింబల్ గా చెప్పారు తారక్.

  • 13 Mar 2023 06:35 AM (IST)

    బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ అవార్డ్ ‘ఆన్ ఐరిష్ గుడ్ బై’ చిత్రం..

    బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరిలో ఆన్ ఐరిష్ గుడ్ బై చిత్రం ఆస్కార్ అవార్డ్ గెలుచుకుంది. ఈ అవార్డ్ కోసం ఇవాలు, లే పపిల్లే, నైట్ రైడ్, ది రెడ్ సూట్ కేస్ చిత్రాలు పోటిపడ్డాయి.

  • 13 Mar 2023 06:31 AM (IST)

    బెస్ట్ డాక్యూమెంటరీ ఫీచర్ ఫిల్మ్‏గా ‘నవల్నీ’

    బెస్ట్ డాక్యూమెంటరీ ఫీచర్ ఫిల్మ్‏గా ‘నవల్నీ’ అవార్డ్ గెలుచుకుంది. ఈ అవార్డ్ కోసం ఆల్ దట్ బ్రీత్స్, ఆల్ ది బ్యూటీ అండ్ ది బ్లడ్ షెడ్, ఫైర్ ఆఫ్ లవ్, ఎ హౌస్ మేడ్ ఆఫ్ స్ప్లింటర్స్, నవల్నీ పోటీ పడ్డాయి.

  • 13 Mar 2023 06:28 AM (IST)

    ఉత్తమ సహాయ నటిగా జెమీ లీ కర్టిస్‌..

    బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ కి జామీ లీ కర్టిస్ గెలుచుకుంది. వేదికపై అవార్డ్ అందుకున్న జామీ లీ.. చిత్రయూనిట్ తోపాటు.. తనకు సపోర్ట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. తన కుటుంబానికి ప్రేమతో ధన్వవాదాలు తెలిపింది జామీ లీ.

  • 13 Mar 2023 06:25 AM (IST)

    మొదలైన ఆస్కార్‌ హంగామా..

    విశ్వవేదికపై ఆస్కార్ హంగామా మొదలైంది. బెస్ట్ సపోర్టింగ్‌ యాక్టర్‌తో అవార్డులు ప్రధానోత్సవం మొదలైంది. సపోర్టింగ్‌ యాక్టర్‌ని అనౌన్స్ చేసింది జ్యూరీ. బెస్ట్ సపోర్టింగ్‌ యాక్టర్‌గా క హుయ్‌ క్వాన్‌ అవార్డ్ అందుకుంది. ‘ఎవరిథింగ్‌ ఎవిరీవేర్‌ ఆల్‌ ఆట్‌ ఒన్స్’ లో నటించింది క్వాన్‌.

  • 13 Mar 2023 06:22 AM (IST)

    ఆస్కార్ వేడుకలలో కీరవాణి దంపతులు..

    జిమ్మీ కిమ్మెల్ హోస్ట్‏గా వ్యవహరిస్తోన్న ఆస్కార్ అవార్డ్ వేడుకలలో ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ సందడి చేస్తుంది. అకాడమీ అవార్డ్స్ ప్రారంభమైన కాసేపటికే వేదికపై నాటు నాటు పాటకు డాన్స్ చేసారు ఆస్కార్ యాంకర్స్. ఈ వేడుకలలో మ్యూజిక్ కీరవాణి దంపతులు సంప్రదాయ దుస్తుల్లో తళుక్కుమన్నారు.

  • 13 Mar 2023 06:16 AM (IST)

    బ్లాక్ అండ్ వైట్ సూట్‏లో మెరిసిన చంద్రబోస్..

    ప్రపంచ సినిమా పండుగ అట్టహాసంగా సాగుతోంది. 95వ ఆస్కార్‌ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం లాస్‌ ఏంజెల్స్‌ డాల్బీ థియేటర్‌లో జరుగుతున్నాయి. ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ ఆస్కార్ అవార్డు వేడుకలలో సందడి చేస్తున్నారు. ఈ వేడుకలకు గేయ రచయిత చంద్రబోస్ హజరయ్యారు. బ్లాక్ అండ్ వైట్ సూట్‏లో మెరిసారు. ఆస్కార్‌ రేసులో RRR నాటు పాటతో పాటు లేడీ గాగా, రిహానా పాటలు పోటీ పడుతున్నాయి.

  • 13 Mar 2023 06:09 AM (IST)

    నాటు నాటు ఊపుతో ప్రారంభమైన ఆస్కార్‌ అవార్డుల వేడుక

    నాటు నాటు ఊపుతో ఆస్కార్ అవార్డ్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రపంచమంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ వేడుకలలో నాటు నాటు పాటకు డాన్స్ చేశారు ఆస్కార్ యాంకర్స్. ఈ పాట తర్వాతే అవార్డ్ ను వేదికపైకి తీసుకువచ్చారు ప్రెజంటర్స్. డాల్పీ థియేటర్‌ దద్దరిల్లేలా, హాలీవుడ్‌ షేక్‌ అయ్యేలా మన తెలుగు సినిమా సత్తా చాటుతోంది. విశ్వవేదికపై నాటు నాటుకు పట్టం కట్టే సమయం అసన్నమైంది.

  • 13 Mar 2023 06:03 AM (IST)

    ఆస్కార్‌ కార్పెట్‌పై గర్జించిన ఎన్టీఆర్‌..

    ఆస్కార్‌ వేదికపై ఎన్టీఆర్‌ బ్లాక్‌ పాంథర్‌ సూట్‌లో సందడి చేశాడు. సూట్‌పై గర్జించే పులి బొమ్మ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది.

  • 13 Mar 2023 05:51 AM (IST)

    స్టన్నింగ్ లుక్‌లో దీపికా పదుకొనె

    ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు వేడుకల ప్రజెంటర్‌గా బాలీవుడ్ బ్యూటీ దీపిక హీరోయిన్‌కు అరుదైన గౌరవం దక్కించుకుంది. ఇందుకోసం ఆమె బ్లాక్‌ డ్రెస్‌లో ఆస్కార్‌ వేడుకకు విచ్చేసింది.

  • 13 Mar 2023 05:47 AM (IST)

    నాటు నాటు పాటకు స్టెప్పులేయనున్న అమెరికన్‌ బ్యూటీ..

    కాగా ఈ వేడుకల్లో నాటు నాటు నాటు పాటకు అమెరికన్‌ నటి లారెన్‌ గాట్లిబ్‌ స్టెప్పులేయనుంది. ఈమెకు భారతీయ సినిమాతో మంచి అనుబంధం ఉంది.

  • 13 Mar 2023 05:30 AM (IST)

    చిచ్చా వచ్చేశాడుగా..

    నాటు నాటు సాంగ్‌ పాటను అద్భుతంగా ఆలపించిన సింగర్లు రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవ ఆస్కార్‌ వేదిక దగ్గరకు చేరుకున్నారు. వీరిద్దరూ ఆస్కార్ వేదికపై లైవ్ ఫెర్మామెన్స్ ఇవ్వనున్నారు.

  • 13 Mar 2023 05:05 AM (IST)

    స్టైలిష్‌ దుస్తుల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ టీం..

    ఆస్కార్‌ వేడుక సందర్భంగా దర్శకుడు రాజమౌళి, హీరోలు రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ స్టైలిష్‌ దుస్తుల్లో ముస్తాబయ్యారు. ప్రస్తుతం వీరి ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

  • 13 Mar 2023 05:04 AM (IST)

    చెర్రీ- ఉపాసనల సందడి..

    ఆర్‌ఆర్‌ఆర్‌లో సీతరామరాజు పాత్రతో గ్లోబల్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న రామ్‌ చరణ్‌ సతీసమేతంగా ఆస్కార్‌ వేదిక దగ్గరకు చేరుకున్నాడు. ఈ సందర్భంగా కలర్‌ ఫుల్‌ దుస్తుల్లో కనువిందు చేశారు చెర్రీ- ఉపాసన దంపతులు.

  • 13 Mar 2023 04:56 AM (IST)

    బాలీవుడ్ తారల సందడి..

    బాలీవుడ్ తారలు ఈషా గుప్తా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆస్కార్ వేడుకకు విచ్చేశారు. ఈ క్రమంలో   ప్రియాంక చోప్రా, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ లతో ఫొటోలు దిగి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింద ఈషా గుప్తా.

    View this post on Instagram

    A post shared by Esha Gupta (@egupta)

Published On - Mar 13,2023 4:53 AM

Follow us
రాజమండ్రి గడ్డపై బాబాయ్, అబ్బాయ్..
రాజమండ్రి గడ్డపై బాబాయ్, అబ్బాయ్..
ఈ బంగారు మసాలా సుగుణాలు తెలిస్తే.. అస్సలు మిస్ చేసుకోరు!ఆడవాళ్లకు
ఈ బంగారు మసాలా సుగుణాలు తెలిస్తే.. అస్సలు మిస్ చేసుకోరు!ఆడవాళ్లకు
సిడ్నీ టెస్ట్.. మూడో రోజు బుమ్రా బరిలోకి దిగుతాడా? అప్డేట్ ఇదిగో
సిడ్నీ టెస్ట్.. మూడో రోజు బుమ్రా బరిలోకి దిగుతాడా? అప్డేట్ ఇదిగో
సీతమ్మవారిని ముక్కుతో పొడిచిన ఫలితం.. కాకికి రాములవారి శాపం
సీతమ్మవారిని ముక్కుతో పొడిచిన ఫలితం.. కాకికి రాములవారి శాపం
ఆంధ్ర అబ్బాయి.. జపాన్ అమ్మాయి..కర్నూలు వేదికగా ఒక్కటైన ప్రేమ జంట
ఆంధ్ర అబ్బాయి.. జపాన్ అమ్మాయి..కర్నూలు వేదికగా ఒక్కటైన ప్రేమ జంట
కొత్త ఏడాదిలో గుడ్‌ న్యూస్‌.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..
కొత్త ఏడాదిలో గుడ్‌ న్యూస్‌.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..
నేడే ఏథర్ 450 నయా వెర్షన్ రిలీజ్.. ఆకట్టుకునేలా సూపర్ ఫీచర్లు
నేడే ఏథర్ 450 నయా వెర్షన్ రిలీజ్.. ఆకట్టుకునేలా సూపర్ ఫీచర్లు
చీలిపోతున్న భూమి.. త్వరలో మరో మహా సముద్రం !!
చీలిపోతున్న భూమి.. త్వరలో మరో మహా సముద్రం !!
ఇక చాయ్‌, సమోసాతో అమెరికాలో ముచ్చట్లు హోటళ్ల మెనూలో కొత్తగా..!
ఇక చాయ్‌, సమోసాతో అమెరికాలో ముచ్చట్లు హోటళ్ల మెనూలో కొత్తగా..!
ఉబర్ క్యాబ్‌ను వాట్సాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే..
ఉబర్ క్యాబ్‌ను వాట్సాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే..