- Telugu News Photo Gallery Cinema photos Know how the love story of Kiraak RP and his to be wife Lakshmi started
కిర్రాక్ ఆర్పీ, లక్ష్మీల ప్రేమకథలో ఇన్ని ట్విస్టులు ఉన్నాయా? వీరు ఫస్ట్ టైమ్ ఎప్పుడు, ఎలా కలుసుకున్నారో తెలుసా?
నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్‌తో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు ప్రముఖ కమెడియన్ కిర్రాక్ ఆర్పీ. బ్రాంచ్‌ల మీద బ్రాంచ్‌లు ఓపెన్ చేస్తూ బిజినెస్లో మంచి లాభాలు గడిస్తున్నాడు.
Updated on: Mar 12, 2023 | 9:49 PM

నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్‌తో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు ప్రముఖ కమెడియన్ కిర్రాక్ ఆర్పీ. బ్రాంచ్‌ల మీద బ్రాంచ్‌లు ఓపెన్ చేస్తూ బిజినెస్లో మంచి లాభాలు గడిస్తున్నాడు.

ఇప్పటికే కూకట్ పల్లి, మణికొండలలో నెల్లూరు చేపల పులుసు కర్రీ పాయింట్‌లను ఓపెన్ చేసిన ఆర్పీ ఇటీవల అమీర్‌పేటలో ముచ్చటగా మూడో బ్రాంచ్ ఓపెన్ చేశాడు. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని, నటుడు శ్రీకాంత్ తదితరులు హాజరయ్యారు.

ఇదే సందర్భంగా తమ పెళ్లి డేట్‌పై కూడా క్లారిటీ ఇచ్చాడు ఆర్పీ. ఈ ఏడాది నవంబర్ 29న లక్ష్మీ ప్రసన్నతో పెళ్లి జరగబోతున్నట్లు చెప్పాడు.

ఈ క్రమంలో ఆర్పీ ప్రేమించిన అమ్మాయి లక్ష్మీప్రసన్న మరోసారి ప్రేమకథ ఎలా మొదలైందో రివీల్ చేసింది. ‘ఆర్సీ రెడ్డి కోచింగ్ సెంటర్ లో ఉన్నప్పుడు కిరాక్ ఆర్పీ గెస్ట్ గా వచ్చారు. అక్కడే మా ఇద్దరికి పరిచయం ఏర్పడింది.

ఆ తర్వాత మా అమ్మ నెంబర్ తీసుకొని.. ముందు మా ఫ్యామిలీకి, బంధువులకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత మా పేరెంట్స్ తో మాట్లాడి పెళ్లికి ఒప్పించాడు. ఇప్పుడైతే అంతా హ్యాపీ’ అని చెప్పుకొచ్చింది లక్ష్మీ ప్రసన్న.





























