Basha Shek |
Updated on: Mar 13, 2023 | 6:50 AM
ముంబయిలో లాక్మే ఫ్యాషన్ వీక్‌ను అట్టహాసంగా నిర్వహించారు. మిల్కీ బ్యూటీ తమన్నా, కరిష్మా కపూర్, మోడల్స్ పాల్గొని ర్యాంప్‌వాక్‌తో ఆకట్టుకున్నారు.
ముఖ్యంగా 48 ఏళ్ల కరిష్మా కపూర్ ఈ ఫ్యాషన్ వీక్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. బంగారు రంగు దుస్తులు, అందుకు తగ్గ మ్యాచింగ్ హీల్స్‌తో ర్యాంప్ వాక్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.
కరిష్మా కపూర్‌తో పాటు పలువురు నటీమణులు ర్యాంప్ వాక్ చేశారు. వారిలో మలైకా అరోరా కూడా ఒకరు. ఆమె చాలా అందమైన దుస్తులలో ఎంతో గ్లామరస్‌గా కనిపించింది.
ఇక మిల్కీ బ్యూటీ తమన్నా బ్లాక్ కలర్ దుస్తుల్లో కనువిందు చేసింది. ఓపెన్ హెయిర్‌లో ఎంతో బ్యూటిఫుల్‌గా కనిపించిందీ అందాల తార.
ఇక నుస్రత్ భారుచా తన గ్లామరస్ స్టైల్‌తో ఆకట్టుకుంది. మొత్తానికి అందాల తారల హొయలు, ర్యాంప్‌వాక్‌తో ముంబై ఫ్యాషన్ వీక్ అట్టహాసంగా జరిగింది.