WPL 2023: పాపం స్మృతి.! వరుసగా 5 ఓటములు.. ఇలా జరిగితేనే ఆర్సీబీకి ప్లే-ఆఫ్స్ ఛాన్స్.!!
డబ్ల్యూపీఎల్ 2023లో ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగింది రాయల్ ఛాలెంజర్స్ జట్టు. లేడీ కోహ్లీ స్మృతి మందానా సారధ్యంలో..
డబ్ల్యూపీఎల్ 2023లో ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగింది రాయల్ ఛాలెంజర్స్ జట్టు. లేడీ కోహ్లీ స్మృతి మందానా సారధ్యంలో అద్భుత విజయాలను సాధిస్తుందని.. అందరూ అనుకున్నారు. కట్ చేస్తే.. వరుసగా 5 మ్యాచ్‌ల్లో 5 ఓటములు.. ప్లే-ఆఫ్ రేసు నుంచి దాదాపుగా ఔట్ అయినట్లే. ఎలిసా పెర్రీ, హీథర్ నైట్, సోఫీ డివైన్ వంటి ఆటగాళ్లు ఈ జట్టులో ఉన్నప్పటికీ.. ఆర్‌సీబీ ఒక్క విజయాన్ని కూడా అందుకోలేకపోయింది. తక్కువ స్కోర్ అయినప్పటికీ.. సోమవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లోనూ ఆర్‌సీబీ ఓటమి చవిచూసింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 4 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఈ చిన్న లక్ష్యాన్ని ఢిల్లీ మరో 2 బంతులు మిగిలి ఉండగానే చేధించింది. ఇలా వరుసగా ఐదు మ్యాచ్‌లలో ఓడిపోయిన ఆర్‌సీబీ.. అస్సలు ప్లే-ఆఫ్స్‌కు చేరుతుందా.. లేదో.. ఇప్పుడు తెలుసుకుందామా..?
అసలు ప్లే-ఆఫ్స్‌కు ఎలా చేరుతుంది..!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మరో మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ ఈ జట్టు భారీ తేడాతో గెలవాలి. అదే కాదు గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్‌తో జరిగే మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు గెలవడంతో పాటు. అలాగే యూపీ వారియర్స్‌ను గుజరాత్ జట్టు ఓడిస్తే ఆర్సీబీకి ప్లే-ఆఫ్స్ అవకాశం దక్కొచ్చు.
డబ్ల్యూపీఎల్ పాయింట్ల పట్టిక ఇలా..
పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ జట్టు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. ఢిల్లీ జట్టు 5 మ్యాచ్‌ల్లో 4 గెలిచి రెండో స్థానంలో నిలిచింది. యూపీ వారియర్స్ 4 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, 2 ఓటములతో మూడో స్థానంలో ఉంది. గుజరాత్ జెయింట్స్ 4 మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది. ఇక ఆర్‌సీబీ ఒక్క మ్యాచ్‌లోనూ గెలవకుండా చిట్టచివరి స్థానంలో నిలిచింది.