AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: ‘కోహ్లీ భయ్యా.. నువ్వు సూపర్‌’.. ఇప్పుడు ఆస్ట్రేలియన్ క్రికెటర్లు అంటున్న మాట ఇదే

బోర్డర్‌- గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన చివరి నాలుగో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో టీమిండియా 2-1తో సిరీస్‌ను కైవం చేసుకుంది.

Virat Kohli: 'కోహ్లీ భయ్యా.. నువ్వు సూపర్‌'.. ఇప్పుడు ఆస్ట్రేలియన్ క్రికెటర్లు అంటున్న మాట ఇదే
Virat Kohli
Basha Shek
|

Updated on: Mar 14, 2023 | 6:57 PM

Share

బోర్డర్‌- గవాస్కర్‌ ట్రోఫీలో భాగగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన చివరి నాలుగో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో టీమిండియా 2-1తో సిరీస్‌ను కైవం చేసుకుంది. అలాగే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్‌లో 186 పరుగులు చేసిన విరాట్‌ కోహ్లికి ప్లేయర్‌ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. అలాగే స్పిన్‌ ద్వయం రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌లకు ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ పురస్కారం లభించింది. ఇదిలా ఉంటే మ్యాచ్ అనంతరం ఆసీస్ ఆటగాళ్లతో కోహ్లీ వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ తన ఆటోగ్రాఫ్‌తో ఉన్న జెర్సీని ఇద్దరు ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఉస్మాన్ ఖవాజా, వికెట్ కీపర్ అండ్‌ కీపర్‌ అలెక్స్ కారీకి బహుమతిగా ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. వీడియోలో, విరాట్ కోహ్లీ ఆసీస్ ఆటగాళ్లతో కరచాలనం చేయడం, వారికి జెర్సీలు మనం ఇవ్వడం చూడవచ్చు.

కాగా మూడేళ్ల మూడు నెలల తర్వాత టెస్టు క్రికెట్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. మొత్తం 364 బంతుల్లో 15 ఫోర్లతో 186 పరుగులు చేశాడు విరాట్‌. ఇది కోహ్లీ టెస్టు కెరీర్‌లో 28వ సెంచరీ. అలాగే ఓవరాల్‌ కెరీర్‌లో 75వ సెంచరీ. 2019లో బంగ్లాదేశ్‌పై చివరి టెస్టు సెంచరీ సాధించాడు. 41 ఇన్నింగ్స్‌ల సుదీర్ఘ వ్యవధిలో కోహ్లి ఈ సెంచరీ సాధించడం విశేషం. కాగా టెస్టు సిరీస్ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి భారత్- ఆసీస్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌పైనే ఉంది. మొదటి మ్యాచ్‌ ఈనెల 17న జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..