AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MI vs GG-WPL 2023: ప్రతీకారమా..? పరాజయమా..? ముంబైపై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్.. తుది జట్టు వివరాలివే..

టాస్ గెలిచిన గుజరాత్ సారథి స్నేహ్ రాణా మొదటిగా బౌలింగ్ ఎంచుకుంది. ఆ సందర్భంగా అమె మాట్లాడుతూ వాతావరణంలో కాస్త తేమ..

MI vs GG-WPL 2023: ప్రతీకారమా..? పరాజయమా..? ముంబైపై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్.. తుది జట్టు వివరాలివే..
Mi Vs Gg Wpl 2023
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 14, 2023 | 7:35 PM

Share

ఉమెన్స్ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా జరుగుతున్న 12వ మ్యాచ్‌‌లో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. మరి కొద్ది నిముషాలలో మ్యాచ్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో టాస్ వేయగా.. టాస్ గెలిచిన గుజరాత్ సారథి స్నేహ్ రాణా మొదటిగా బౌలింగ్ ఎంచుకుంది. ఆ సందర్భంగా అమె మాట్లాడుతూ వాతావరణంలో కాస్త తేమ ఉందని, ఎక్కువగా గాలి వీస్తోందని.. ఇది పేసర్లకు ఉపయోగపడుతుందని తెలిపింది. ఈ క్రమంలోనే తమ జట్టులో రెండు మార్పులు చేశామని.. లారా, జార్జీయా స్థానాల్లో సోఫీ డంక్లీ, బెల్‌ వస్తున్నారని పేర్కొంది.

అయితే గుజరాత్, ముంబై జట్లు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మొదటి మ్యాచ్‌లో కూడా తలపడ్డాయి. అంటే నేడు జరుగుతున్న మ్యాచ్ ఈ రెండు జట్లకు మధ్య రెండో మ్యాచ్. ఇక అంతకముందు జరిగిన మ్యాచ్‌లో హర్మన్ నేతృత్వంలోని ముంబై విజయం సాధించింది. ఇక ఆ మ్యాచ్ నుంచి టోర్నీలో భాగంగా ఆడిన 4 మ్యాచ్‌లలోనూ గెలిచిన హర్మన్ సేన.. ఈ ఆటలో కూడా విజయం సాధించి తన విజయ పరంపరను కొనసాగించాలని చూస్తోంది. మరోవైపు గుజరాత్ జట్టు తన రెండో మ్యాచ్ మినహా అన్ని మ్యాచ్‌లలోనూ ఓటమినే చవిచూసింది. ఈ నేపథ్యంలో ఎలాగైనా ముంబైని మట్టికరిపించి మొదటి మ్యాచ్ విషయంలో ప్రతీకారం తీర్చుకోవాలని స్నేహ్ రాణా జట్టు చూస్తోంది.

ఇవి కూడా చదవండి

ముంబై ఇండియన్స్: యస్తికా భాటియా,  హేలీ మాథ్యూస్, నటాలి సీవర్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), దహర్ గుజ్జర్,  అమెలియా కెర్, ఇస్సీ వాంగ్, అమన్‌జ్యోత్ కౌర్, హుమారియా కాజి,  జింతమని కలిత, సైకా ఇషాక్

గుజరాత్ జెయింట్స్: సబ్బినేని మేఘన, సోఫీ డంక్లీ, హర్లీన్ డియోల్, ఆష్లే గార్డ్‌నర్, అన్నాబెల్ , సుష్మా వర్మ, దయాలన్ హేమలత,  స్నేహ్ రాణా(కెప్టెన్), కిమ్ గార్త్, మాన్సి జోషి,  తనూజా కన్వర్

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..