Virat Kohli: క్రికెట్‌ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎవరికీ సాధ్యం కాని ఘనత అందుకున్న కోహ్లీ..

భారత్‌, ఆస్ట్రేలియా మధ్య డ్రాగా ముగిసిన నాలుగో టెస్ట్‌‌లో.. 186 పరుగులు చేసిన కింగ్ కోహ్లీకి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. దీంతో కోహ్లీ

Virat Kohli: క్రికెట్‌ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎవరికీ సాధ్యం కాని ఘనత అందుకున్న కోహ్లీ..
Virat Kohli
Follow us

|

Updated on: Mar 14, 2023 | 9:01 PM

ప్రపంచ క్రికెట్ చరిత్రలో సచిన్ టెండూల్కర్ సహా ఏ క్రికెటర్‌కు సాధ్యం కాని ఘనతను విరాట్ కోహ్లీ తన సొంతం చేసుకున్నాడు. అవును, బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌, ఆస్ట్రేలియా మధ్య డ్రాగా ముగిసిన నాలుగో టెస్ట్‌‌లో.. 186 పరుగులు చేసిన కింగ్ కోహ్లీకి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. దీంతో కోహ్లీ ప్రపంచ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలోనూ కనీసం 10 మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఒకే ఒక్క క్రికెటర్‌గా అవతరించాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందిన కోహ్లీకి ఇది ఈ ఫార్మాట్‌లో 10వ అవార్డు. దీంతో కోహ్లీ ఖాతాలోకి 10 ప్లేయర్ ఆఫ్ ది టెస్టు మ్యాచ్ అవార్డ్స్, 15 మ్యాన్ ఆఫ్ ది టీ20 మ్యాచ్ అవార్డులు, 38 మ్యాన్ ఆఫ్ ది వన్డే మ్యాచ్ అవార్డులు చేరాయి. ఇక ఈ ఘనత కోహ్లీ మినహా ఏ క్రికెటర్ కూడా సాధించలేదు. సాధించేందుకు దగ్గరిలో కూడా ఎవరూ లేరు.

అయితే భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగో టెస్ట్‌‌ ఐదు రోజుల పాటు సాగింది. చివరి రోజు కూడా ఫలితం రాదని స్పష్టం అవడంతో డ్రాకు ఇరు జట్ల సారథులు అంగకరించారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 480 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ 571 పరుగులకు ఆలౌట్‌ అయింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆసీస్‌ 2 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఈ టెస్టులో ఈ టెస్టులో ఆసీస్ తరఫున ఉస్మాన్ ఖవాజా(180), కామెరూన్ గ్రీన్(114) సెంచరీలు సాధించగా.. భారత్ తరఫున కూడా శుభమాన్ గిల్(128), కింగ్ కోహ్లీ(186) శతకాలతో రాణించారు.

నాలుగో మ్యాచ్‌ డ్రాగా ముగిసినప్పటికీ.. నాలుగు టెస్టుల బోర్డర్‌–గవాస్కర్‌ ట్రోఫీని టీమిండియా 2-1 తేడాతో గెలుచుకుంది. తొలి రెండు టెస్టుల్లో భారత్‌ విజయం సాధించగా.. మూడో టెస్టును ఆసీస్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఆస్ట్రేలియాపై భారత్‌కు ఇది వరుసగా నాలుగో టెస్ట్ సిరీస్‌ విజయం. అలాగే సొంతగడ్డపై టీమిండియాకు ఇది వరుసగా 16వ టెస్టు సిరీస్‌ విజయం. మరోవైపు టీమిండియాకు వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌‌కు చేరుకుంది. టీమిండియా కంటే ముందే ఫైనల్ చేరుకున్న ఆస్ట్రేలియాతో టెస్ట్ చాంపియన్‌షిప్ కోసం భారత్‌ ఈ ఏడాది జూన్‌ 7న లండన్‌లో తలపడనుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..