Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

15 ఏళ్ల క్రితం రిటైరయిన ఈ ఆటగాడి సంపాదన రూ. 3100 కోట్లు.. విరాట్, సచిన్‌నే వెనక్కి నెట్టాడు.. ఎవరో తెలుసా?

ఈ ప్లేయర్ విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, ధోనిలనే వెనక్కి నెట్టేశాడు. 15 సంవత్సరాల క్రితం క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన..

15 ఏళ్ల క్రితం రిటైరయిన ఈ ఆటగాడి సంపాదన రూ. 3100 కోట్లు.. విరాట్, సచిన్‌నే వెనక్కి నెట్టాడు.. ఎవరో తెలుసా?
Cricket
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 14, 2023 | 6:52 PM

ఈ ప్లేయర్ విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, ధోనిలనే వెనక్కి నెట్టేశాడు. 15 సంవత్సరాల క్రితం క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్.. అందరి కంటే ఎక్కువ సంపాదన ఆర్జిస్తూ.. ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన క్రికెటర్‌గా నిలిచాడు. అతడెవరో కాదు.. ఆడమ్ గిల్‌క్రిస్ట్. ఈ విధ్వంసకర ఓపెనర్ రిటైర్ అయ్యి ఏళ్లు గడుస్తున్నా.. బోలెడంత డబ్బు సంపాదిస్తున్నాడు. గిల్‌క్రిస్ట్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెటర్. ఈ లిస్టులో సచిన్ టెండూల్కర్ రెండో స్థానంలో నిలిచాడు.

2023లో గిల్‌క్రిస్ట్ అత్యంత ధనిక క్రికెటర్. అతడి నికర విలువ దాదాపు 31 బిలియన్ డాలర్లు.. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపుగా రూ. 3100 కోట్లు. ఇక రెండో స్థానంలో నిలిచిన సచిన్ టెండూల్కర్ నికర విలువ రూ.14 బిలియన్ డాలర్లు.. అంటే రూ.1400 కోట్లు. విరాట్ కోహ్లీ దాదాపు 11 బిలియన్ డాలర్ల నికర సంపదతో ప్రపంచంలోని అత్యంత సంపన్న క్రికెటర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. మరోవైపు గిల్‌క్రిస్ట్ 2008లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే రిటైర్‌మెంట్ తర్వాత నుంచి అతడి ఆస్తి నికర విలువ పెరుగుతూపోతోంది. ఈ క్రమంలోనే అతడు నెలవారీ సంపాదన దాదాపు రూ.5.50 కోట్లు.

ఏడాది నికర సంపాదన (రూపాయిల్లో)
2018 20 బిలియన్
2019 23 బిలియన్
2020 27 బిలియన్
2021 29 బిలియన్
2022 31 బిలియన్
2023 31 బిలియన్

ఐపీఎల్ నుంచి కూడా..

గిల్‌క్రిస్ట్ నికర విలువలో ఎక్కువ భాగం IPL సంపాదన ద్వారా వచ్చింది. అతడు 2 ఫ్రాంచైజీలలో భాగమయ్యాడు. మొత్తం IPL కెరీర్‌లో రూ. 22 కోట్ల 94 లక్షల 85 వేలు సంపాదించాడు. కాగా, గిల్‌క్రిస్ట్‌కు ఆస్ట్రేలియాలో లగ్జరీ డిజైన్ హౌస్ ఉంది. రేంజ్ రోవర్‌తో పాటు ఎన్నో లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. అటు గిల్‌క్రిస్ట్ నికర విలువను పెంచడంలో రియల్ ఎస్టేట్ అతిపెద్ద పాత్రను పోషించింది. అతడికి ఆస్ట్రేలియాలోని వివిధ ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నాయి.

ఏడాది జట్టు శాలరీ(రూపాయిలు)
2008 డెక్కన్ ఛార్జెస్ 28,112,000
2009 డెక్కన్ ఛార్జెస్ 34,384,000
2010 డెక్కన్ ఛార్జెస్ 32,403,000
2011 కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 41,400,000
2012 కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 45,243,000
2013 కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 47,943,000