AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: అరె బాబూ.. ఇది ఫోన్ కాదు.. దంచికొట్టే బ్యాట్.. ఊరమాస్ స్టెప్పులతో అదరగొట్టిన కోహ్లీ.. వీడియో

Virat Kohli Dance Video: ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో విరాట్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఆ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ సాధించాడు. దీంతో భారత మాజీ కెప్టెన్ మంచి మూడ్‌లో కనిపిస్తున్నాడు.

Video: అరె బాబూ.. ఇది ఫోన్ కాదు.. దంచికొట్టే బ్యాట్.. ఊరమాస్ స్టెప్పులతో అదరగొట్టిన కోహ్లీ.. వీడియో
Virat Kohli Viral Dance
Venkata Chari
|

Updated on: Mar 15, 2023 | 12:04 PM

Share

ఛాన్స్ పే డాన్స్! చాలా మంది అవకాశం దొరికినప్పుడల్లా డ్యాన్స్ చేస్తూ తమ ఆనందాన్ని సెలబ్రేట్ చేస్తుంటారు. తాజాగా ఈ జాబితాలో కింగ్ కోహ్లీ కూడా చేరాడు. మైదానంలో తన డ్యాన్స్‌తో ఎన్నోసార్లు నెట్టింట్లో సందడి చేసిన కోహ్లీ.. తాజాగా మరోసారి అలాంటి ఓ వీడియోను పోస్ట్ చేశాడు. మూడేళ్ల తర్వాత టెస్టు క్రికెట్‌లో కోహ్లీ సెంచరీ సాధించాడు. ఇటీవల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని కూడా భారత్ గెలుచుకుంది. అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో విరాట్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఆ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ సాధించాడు. దీంతో భారత మాజీ కెప్టెన్ మంచి మూడ్‌లో ఉన్నాడు. ఈసారి కోహ్లీ నార్వేకు చెందిన ప్రముఖ డ్యాన్స్ గ్రూప్ క్విక్ స్టైల్‌తో కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. అయితే డ్యాన్స్ చేస్తున్నా విరాట్ బ్యాట్ వదలకపోవడం గమనార్హం. కోహ్లి డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మంగళవారం, మార్చి 14న విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫొటో, వీడియోను పోస్ట్ చేశాడు. నార్వేకు చెందిన ఫేమస్ డ్యాన్స్ గ్రూప్ క్విక్ స్టైల్ సభ్యులతో కోహ్లీ అక్కడ కనిపించాడు. ఈ ఫొటోకు కోహ్లీ ‘ఈరోజు ముంబైలో నేను ఎవరిని కలిశాను? అంటూ ‘క్విక్ స్టైల్’ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ట్యాగ్ చేస్తూ.. క్యాఫ్షన్ అందించాడు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Quick Style (@thequickstyle)

కోహ్లీ పోస్ట్ చేసిన డ్యాన్స్ వీడియోలో క్రికెట్ బ్యాట్ పట్టుకుని కనిపించాడు. ప్రముఖ నార్వేజియన్ డ్యాన్స్ గ్రూప్ క్విక్ స్టైల్ సభ్యులతో కలిసి ‘స్టీరియో నేషన్’లోని ‘ఇష్క్’ పాటకు విరాట్ డ్యాన్స్ చేశాడు.

View this post on Instagram

A post shared by Virat Kohli (@virat.kohli)

కోహ్లి డ్యాన్స్‌ని చూసి అతని భార్య బాలీవుడ్ సూపర్‌స్టార్ అనుష్క శర్మ ఫైర్ ఎమోజీ అందించింది. ఈ డ్యాన్స్ వీడియోను 21.3 మిలియన్ల మంది వీక్షించారు.

టెస్టు క్రికెట్‌లో 125 రోజుల తర్వాత సెంచరీ చేయడం ద్వారా విరాట్ కోహ్లీ తన పాత ఫామ్‌లోకి వచ్చాడు. ప్రస్తుతం కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో 75 సెంచరీలు పూర్తి చేశాడు. భారత్-ఆస్ట్రేలియా మధ్య 3 వన్డేల సిరీస్ మార్చి 17 నుంచి ప్రారంభం కానుంది. ఇక ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో కోహ్లీ ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..