IND vs AUS: హిట్‌మ్యాన్ ఖాతాలో చేరిన మరో మైలురాయి.. ఆ లిస్టులో ఏడో స్థానం.. అగ్రస్థానంలో ఎవరున్నారంటే?

IND vs AUS 4th Test: అహ్మదాబాద్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో రోహిత్ శర్మ భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 35 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఈ సమయంలో తన కెరీర్‌లో మరో మైలురాయిని తాకాడు.

IND vs AUS: హిట్‌మ్యాన్ ఖాతాలో చేరిన మరో మైలురాయి.. ఆ లిస్టులో ఏడో స్థానం.. అగ్రస్థానంలో ఎవరున్నారంటే?
Rohit Sharma
Follow us

|

Updated on: Mar 11, 2023 | 1:39 PM

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య అహ్మదాబాద్‌లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ మరో మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మూడో రోజు తన ఇన్నింగ్స్‌లో 22వ పరుగు పూర్తి చేసిన వెంటనే అంతర్జాతీయ క్రికెట్‌లో 17000 పరుగులు పూర్తి చేశాడు. భారత్‌ తరఫున ఈ ఘనత సాధించిన 7వ బ్యాట్స్‌మెన్‌‌గా నిలిచాడు.

రోహిత్ శర్మ 438 మ్యాచ్‌ల్లో 457 ఇన్నింగ్స్‌లు ఆడి ఈ రికార్డును సాధించాడు. అతని అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 43 సెంచరీలు, 91 హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. అతని బ్యాటింగ్ సగటు కూడా 42 కంటే ఎక్కువగా ఉంది. ఈ సమయంలో రోహిత్ టెస్టుల్లో 3379 పరుగులు, వన్డేల్లో 9782 పరుగులు, టీ20ల్లో 3853 పరుగులు చేశాడు. టెస్టు క్రికెట్‌లో అతని బ్యాటింగ్ సగటు 45.80గా నిలిచింది. అదే సమయంలో అతను వన్డేలో 48.91 సగటుతో పరుగులు చేశాడు. అలాగే టీ20 ఇంటర్నేషనల్‌లో రోహిత్ బ్యాటింగ్ సగటు 31.32గా ఉంది.

17000+ పరుగులు చేసిన భారత ప్లేయర్లు..

1: భారత్ తరపున అత్యధిక అంతర్జాతీయ పరుగులు చేసిన రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట నమోదైంది. సచిన్ 664 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 782 ఇన్నింగ్స్‌లలో 34357 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి

2: భారత్ తరపున అత్యధిక అంతర్జాతీయ పరుగులు చేసిన రెండో ఆటగాడు విరాట్ కోహ్లీ నిలిచాడు. ఈ మాజీ సారథి 493 మ్యాచ్‌లలో 551 ఇన్నింగ్స్‌లలో 25 వేలకు పైగా పరుగులు చేశాడు.

3: ఇక్కడ రాహుల్ ద్రవిడ్ మూడో స్థానంలో ఉన్నాడు. ద్రవిడ్ 24208 పరుగులు చేశాడు.

4: ఈ జాబితాలో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నాలుగో స్థానంలో ఉన్నాడు. సౌరవ్ గంగూలీ పేరిట 18575 పరుగులు ఉన్నాయి.

5: భారత అత్యంత విజయవంతమైన కెప్టెన్ ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్‌లో 17266 పరుగులు చేశాడు.

6: మాజీ పేలుడు బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ తన పేరిట 17253 అంతర్జాతీయ పరుగులు చేశాడు.

7: ప్రస్తుత భారత కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో 17014 పరుగులు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ముగ్గురు యువకులను తొక్కుతుంటూ వెళ్లిన కారు.. భయానక దృశ్యాలు వైరల్
ముగ్గురు యువకులను తొక్కుతుంటూ వెళ్లిన కారు.. భయానక దృశ్యాలు వైరల్
అదృష్టమంటే ఇదే.. గోడకు వేలాడదీసిన పెయింటింగ్‌ విలువ రూ.55 కోట్లు
అదృష్టమంటే ఇదే.. గోడకు వేలాడదీసిన పెయింటింగ్‌ విలువ రూ.55 కోట్లు
ఫ్లైట్‌లో టిప్‌టాప్‌గా వచ్చిన మహిళ.. అనుమానంతో బ్యాగ్‌ తెరువగా !!
ఫ్లైట్‌లో టిప్‌టాప్‌గా వచ్చిన మహిళ.. అనుమానంతో బ్యాగ్‌ తెరువగా !!
పక్షుల రాకుండా వల ఏర్పాటు చేస్తే.. అందులో ఏం చిక్కిందో చూడండి !!
పక్షుల రాకుండా వల ఏర్పాటు చేస్తే.. అందులో ఏం చిక్కిందో చూడండి !!
రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళకు ఊహించని షాక్‌ !!
రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళకు ఊహించని షాక్‌ !!
హైదరాబాద్‌ పరిధిలో డీజేలపై నిషేధం.. గీత దాటితే.. తప్పదు జైలుశిక్ష
హైదరాబాద్‌ పరిధిలో డీజేలపై నిషేధం.. గీత దాటితే.. తప్పదు జైలుశిక్ష
ఆహారం అందిస్తుండగా సింహం దాడి.. చివరకు ??
ఆహారం అందిస్తుండగా సింహం దాడి.. చివరకు ??
వామ్మో.. గర్ల్స్‌ హాస్టల్‌‌లో.. రాత్రి వేళ సీన్ ఇలా ఉంటుందా !!
వామ్మో.. గర్ల్స్‌ హాస్టల్‌‌లో.. రాత్రి వేళ సీన్ ఇలా ఉంటుందా !!
అది ఓడనా ?? లేక ఆర్టీసీ బస్సా ?? అతనేం చేసాడో చూస్తే నవ్వాగదు
అది ఓడనా ?? లేక ఆర్టీసీ బస్సా ?? అతనేం చేసాడో చూస్తే నవ్వాగదు
క్యాష్ ఆన్ డెలివరీపై ఐఫోన్‌ ఆర్డర్‌.. డెలివరీ ఏజెంట్ ఇంటికొచ్చాక
క్యాష్ ఆన్ డెలివరీపై ఐఫోన్‌ ఆర్డర్‌.. డెలివరీ ఏజెంట్ ఇంటికొచ్చాక