AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: ధోని టీమ్‌మేట్‌కు డబ్బుపై అత్యాశ.. కట్ చేస్తే.. ఐపీఎల్ నుంచి బ్యాన్.. ఎవరంటే?

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకున్న క్రేజ్ గురించి చెప్పనక్కర్లేదు. అతిపెద్ద సూపర్ స్టార్‌లు ఈ జట్టులో ఉన్నారు..

IPL 2023: ధోని టీమ్‌మేట్‌కు డబ్బుపై అత్యాశ.. కట్ చేస్తే.. ఐపీఎల్ నుంచి బ్యాన్.. ఎవరంటే?
Csk Ipl 2023
Ravi Kiran
|

Updated on: Mar 11, 2023 | 1:20 PM

Share

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకున్న క్రేజ్ గురించి చెప్పనక్కర్లేదు. ధోని, సురేష్ రైనా, జడేజాలు ఈ లీగ్‌లో అతిపెద్ద సూపర్‌స్టార్‌లలో ఒకరని చెప్పొచ్చు. ఇక మేము ఇప్పుడు మన ఇండియన్ ఆల్‌రౌండర్ ఉరఫ్ రవీంద్ర జడేజా గురించి చెప్పబోతున్నాం. దాదాపు ఒక దశాబ్దం పాటు చెన్నై సూపర్ కింగ్స్‌తో అనుబంధం కలిగి ఉన్న ఈ ప్లేయర్ డబ్బు విషయంలో మోసం చేసి ఐపీఎల్ నుంచి నిషేధించబడ్డాడు. అది ఎప్పుడు.? ఏ సీజన్.? అనేది ఇప్పుడు తెలుసుకుందామా..

2008 తొలి ఐపీఎల్ సీజన్‌ వేలంలో రవీంద్ర జడేజాను రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. ఆ ఏడాది అండర్-19 ప్రపంచకప్ గెలిచిన జట్టులో జడేజా సభ్యుడు. తొలి రెండు సీజన్లలో రాజస్థాన్ తరఫున జడేజా మంచి ఆటతీరు కనబరిచాడు. ఈ కారణంగా 2010లో కూడా అతడిని తమతో ఉంచుకోవాలని రాజస్థాన్ భావించింది. అయితే ఆ సమయంలో జడేజా ప్లాన్ మరోలా ఉంది. అతడు రాజస్థాన్ రాయల్స్‌ను వదిలి ముంబై ఇండియన్స్‌లో చేరాలని నిర్ణయించుకున్నాడు.

అంతేకాకుండా తానే స్వయంగా ఫ్రాంచైజీతో చర్చలు కూడా జరిపాడు. బేరసారాలు ఏవి ఫైనల్ కాకపోవడంతో.. ఈ విషయం కాస్తా గుప్పుమన్నది. దీంతో జట్టుకు వ్యతిరేకంగా కార్యకలాపాలు జరిపాడని రాజస్థాన్ రాయల్స్.. జడేజాపై తీవ్ర ఆరోపణలు చేసింది. దీంతో క్రమశిక్షణారాహిత్యం కింద 2010లో ఐపీఎల్ ఆడకుండా జడేజాపై బ్యాన్ విధించింది బీసీసీఐ. ఇక 2011లో జడేజాను కొచ్చి టస్కర్స్ వేలంలో చేజిక్కించుకుంది. ఆ తర్వాత ఈ జట్టు ఐపీఎల్ నుంచి వైదొలగడంతో.. 2012లో చెన్నై సూపర్ కింగ్స్.. జడేజాను తన జట్టులోకి తీసుకుంది. అప్పటి నుంచి ఇప్పటివరకు రవీంద్ర జడేజా సీఎస్‌కేలో కీలక భాగస్వామిగా ఎదుగుతూ వచ్చాడు.

రాజధాని అమరావతి పునర్నిర్మాణంలో మరో కీలక అడుగు
రాజధాని అమరావతి పునర్నిర్మాణంలో మరో కీలక అడుగు
స్టార్ హీరోలు భయపడుతుంటే.. కాజల్‌ ఒక్కతే ధైర్యంగా కామెంట్ చేసింది
స్టార్ హీరోలు భయపడుతుంటే.. కాజల్‌ ఒక్కతే ధైర్యంగా కామెంట్ చేసింది
దేశవ్యాప్తంగా స్విగ్గీ, జొమాటో డెలివరీ సేవలు బంద్..
దేశవ్యాప్తంగా స్విగ్గీ, జొమాటో డెలివరీ సేవలు బంద్..
చడీచప్పుడు కాకుండా కూతురి పెళ్లి చేసిన జగపతి బాబు వీడియో
చడీచప్పుడు కాకుండా కూతురి పెళ్లి చేసిన జగపతి బాబు వీడియో
భారీగా ఆశ చూపినా.. బిగ్ బాస్‌కు నో చెప్పిన రిషి సార్ వీడియో
భారీగా ఆశ చూపినా.. బిగ్ బాస్‌కు నో చెప్పిన రిషి సార్ వీడియో
ఇద్దరు కొడుకులతో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన హృతిక్..
ఇద్దరు కొడుకులతో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన హృతిక్..
గేదెలు మేపుతున్న మహిళ వద్దకు వచ్చాడు.. ఆపై వెంటనే..
గేదెలు మేపుతున్న మహిళ వద్దకు వచ్చాడు.. ఆపై వెంటనే..
పాత ఇంటిని రిపేర్ చేస్తుండగా బయటపడ్డ భయంకర నిజాలు!ఆ జంటకు చుక్కలే
పాత ఇంటిని రిపేర్ చేస్తుండగా బయటపడ్డ భయంకర నిజాలు!ఆ జంటకు చుక్కలే
"వడపావ్ తింటావా రోహిత్?".. హిట్‌మ్యాన్ రియాక్షన్ ఏంటంటే..?
నిందితుడు లొంగిపోవడంతో గరం అయిన పోలీసులు.. అసలు విషయం ఏంటంటే..?
నిందితుడు లొంగిపోవడంతో గరం అయిన పోలీసులు.. అసలు విషయం ఏంటంటే..?