- Telugu News Photo Gallery Cricket photos India vs australia team india 16th consecutive test series win at home check here india test records and stats
Team India: మమ్మల్ని ఎవడ్రా ఆపేది.. వరుసగా 16 టెస్ట్ సిరీస్‌లు.. స్వదేశంలో తగ్గేదేలే అంటోన్న టీమిండియా..
IND vs AUS: 2013 నుంచి స్వదేశంలో భారత్ అజేయంగా నిలిచింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ కూడా భారత జట్టు ప్రయాణాన్ని ఆపేందుకు ప్రయత్నించినా.. విఫలమయ్యాయి.
Updated on: Mar 15, 2023 | 12:51 PM

స్వదేశంలో భారత్‌ను ఓడించడం కష్టం మాత్రమే కాదు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా ఇలాంటి పెద్ద జట్లు ప్రయత్నించినా.. సఫలం కాలేదు.

2013 నుంచి స్వదేశంలో భారత జట్టు అజేయంగా నిలిచింది. 2013 నుంచి స్వదేశంలో టెస్టు సిరీస్‌లో ఏ జట్టు కూడా భారత్‌ను ఓడించలేకపోయింది. ఆ తర్వాత స్వదేశంలో భారత్ వరుసగా 16 టెస్టు సిరీస్‌లను గెలుచుకుంది.

2013 నుంచి స్వదేశంలో టెస్టు క్రికెట్‌లో భారత్ 8 జట్లను ఓడించింది. ఆస్ట్రేలియాను అత్యధిక సార్లు ఓడించింది. 2013లో ఈ జట్టుపై భారత్ అజేయమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్ట్ సిరీస్‌ను కూడా భారత్ గెలుచుకుంది.

11 ఏళ్లలో 16 టెస్టు సిరీస్‌ల్లో మొత్తం 36 మ్యాచ్‌లు గెలిచిన భారత్.. 3 మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడిపోయింది.

2013లో ఆస్ట్రేలియాను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. 2013 నుంచి 2017 మధ్య జరిగిన ఒకే ఒక్క మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

2018 నుంచి మార్చి 2023 వరకు.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో భారత్ ఒక్కో మ్యాచ్‌లో ఓడిపోయింది. కానీ, భారత్ సిరీస్‌ను గెలుచుకుంది.




