- Telugu News Photo Gallery Cricket photos Team India Captain Rohit Sharma will be attending his brother in laws marriage during 1st ODI against Australia
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంట పెళ్లి బాజాలు.. అందుకు ఆసీస్‌తో మొదటి వన్డేకు దూరమయ్యాడా?
భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే పోరుకు కౌంట్ డౌన్ మొదలైంది. 3 వన్డేల సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్ ముంబై వేదికగా శుక్రవారం జరగనుంది. అయితే రోహిత్ శర్మ ఇందులో ఆడడంలేదు.
Updated on: Mar 15, 2023 | 9:46 PM

భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే పోరుకు కౌంట్ డౌన్ మొదలైంది. 3 వన్డేల సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్ ముంబై వేదికగా శుక్రవారం జరగనుంది. అయితే రోహిత్ శర్మ ఇందులో ఆడడం లేదు.

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు టీమ్‌ఇండియాను ప్రకటించిన సమయంలో.. కెప్టెన్ రోహిత్ శర్మ తొలి వన్డేలో ఆడడని సెలక్టర్లు స్పష్టం చేశారు. అదే సమయంలో అతని స్థానంలో తొలి వన్డేకు హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అయితే ఈ నిర్ణయం వెనుక గల కారణాలను మాత్రం అప్పుడు వెల్లడించలేదు సెలెక్టర్లు.

కాగా రోహిత్ శర్మ మొదటి వన్డే ఆడకపోవడానికి గల కారణం.. అతని ఇంట్లో వివాహ వేడుక ఉండడమేనని తెలుస్తోంది. తన బావగారి వివాహానికి హాజరయ్యేందుకు మొదటి వన్డేకి దూరమయ్యాడట హిట్ మ్యాన్.

రోహిత్ శర్మ ఇటీవల శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి తన సహచరుడు శార్దూల్ ఠాకూర్ వివాహానికి హాజరయ్యాడు. శార్దూల్ వివాహానికి హాజరైన తర్వాత అతను సిరీస్‌లో నాలుగో మరియు చివరి టెస్టు ఆడేందుకు అహ్మదాబాద్ వెళ్లాడు.

రోహిత్ శర్మ ఇటీవల శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి తన సహచరుడు శార్దూల్ ఠాకూర్ వివాహానికి హాజరయ్యాడు. శార్దూల్ వివాహానికి హాజరైన తర్వాత అతను సిరీస్‌లో నాలుగో మరియు చివరి టెస్టు ఆడేందుకు అహ్మదాబాద్ వెళ్లాడు.




