AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఏంది బాసూ ఈ ఊరమాస్ బాదుడు.. భారీ బౌండరీలతో రెచ్చిపోయిన ధోని.. ఇక బౌలర్లకు చుక్కలే..

Chennai Super Kings: చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ రాబోయే సీజన్ కోసం కసరత్తులు మొదలుపెట్టాడు. టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసేందుకు సిద్ధమవుతున్నాడు.

Watch Video: ఏంది బాసూ ఈ ఊరమాస్ బాదుడు.. భారీ బౌండరీలతో రెచ్చిపోయిన ధోని.. ఇక బౌలర్లకు చుక్కలే..
Dhoni Viral Video
Follow us
Venkata Chari

|

Updated on: Mar 11, 2023 | 11:42 AM

చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ రాబోయే సీజన్ కోసం కసరత్తులు మొదలుపెట్టాడు. టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసేందుకు సిద్ధమవుతున్నాడు. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చిన 41 ఏళ్ల ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ కావచ్చని భావిస్తున్నారు. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉండడు. అయినా, ధోని వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంటాయి. తాజాగా ఇలాంటిదే ఓ వీడియో నెట్టింట్లో వైరలవుతోంది.

సీఎస్‌కేను నాలుగుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన ధోని.. ప్రాక్టీస్ సమయంలో భారీ షాట్‌లు బాదేశాడు. ఈ వీడియోను సీఎస్‌కే సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రతీ బంతిని బౌండరీ బాదాడు. సిక్సర్లు, ఫోర్లతో బౌలర్లపై విరుచుకపడ్డాడు. దీంతో నెటిజన్లు కూడా ఈ వీడియోను తెగ ఇష్టపడుతున్నారు. తలా ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈసారి ట్రోపీ చెన్నైదే అంటూ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు: మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్), రవీంద్ర జడేజా, డెవాన్ కాన్వే, రిరుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, శుభ్రాంశు సేనాపతి, మొయిన్ అలీ, శివమ్ దూబే, రాజవర్ధన్ హంగర్‌గేకర్, డ్వేన్ ప్రిటోరియస్, మిచెల్ సాన్ట్నర్, సి. , మతిషా పతిరన, సిమర్జిత్ సింగ్, ప్రశాంత్ సోలంకి, మహిష్ తిక్ష్ణ, అజింక్య రహానే, బెన్ స్టోక్స్, షేక్ రషీద్, నిషాంత్ సింధు, అజయ్ మండల్, భగత్ వర్మ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..