AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: నా జీవితం ఆమె వల్లే మారింది.. లేదంటే..: విరాట్ కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Viral Video: గత కొన్నేళ్లుగా క్రికెట్‌లో విరాట్ కోహ్లీ స్థాయి బాగా పెరిగింది. గడ్డుకాలం నుంచి బయటకి వచ్చిన తరువాత, అద్భుతమైన ఫాంతో దూసుకపోతున్నాడు. ఇటీవల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోడ్‌కాస్ట్‌లో కోహ్లీ తన ప్రయాణం గురించి మాట్లాడాడు.

Watch Video: నా జీవితం ఆమె వల్లే మారింది.. లేదంటే..: విరాట్ కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
virat kohli
Venkata Chari
|

Updated on: Mar 11, 2023 | 1:10 PM

Share

గత కొన్నేళ్లుగా క్రికెట్‌లో విరాట్ కోహ్లీ స్థాయి బాగా పెరిగింది. గడ్డుకాలం నుంచి బయటకి వచ్చిన తరువాత, అద్భుతమైన ఫాంతో దూసుకపోతున్నాడు. ఇటీవల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోడ్‌కాస్ట్‌లో కోహ్లీ తన ప్రయాణం గురించి మాట్లాడాడు. ఈ క్రమంలో ఎన్నో విషయాలు పంచుకున్నాడు. ఈ మేరకు తాజాగా ఆర్‌సీబీ ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. ఇందులో మాట్లాడుతూ.. నా ఫిట్‌నెస్‌పై పనిచేశాను. కెరీర్‌లో చాలా దశలను చూశాను. కానీ అది అతని జీవితాన్ని మార్చలేదు. అనుష్క శర్మను కలవడంతో నా లైఫ్ జీవితాన్ని మారిపోయిందంటూ చెప్పుకొచ్చాడు. జీవితంలోని ముఖ్యమైన క్షణాల గురించి మాట్లాడుతూ.. తన తండ్రి మరణానంతరం ఎన్నో విషయాలపై తన దృక్పథం మారిపోయిందని, అయితే తన జీవితంలో మాత్రం మార్పు రాలేదని భారత మాజీ కెప్టెన్ పేర్కొన్నాడు.

‘మా నాన్న చనిపోయాక చూసే దృక్పథం మారిపోయింది. నా జీవితంలో మాత్రం మార్పు లేదు. మునుపటిలాగే ఉంది. జీవితంలో ఏం చేయాలనుకుంటున్నానో దానిపై దృష్టి మరింత బలపడింది. కలను నెరవేర్చుకోవడానికి ప్రేరణగా మిగిలింది. కానీ, అది నా జీవితాన్ని మార్చలేదు. నా చుట్టూ ఉన్న వాతావరణం ఏమాత్రం మారలేదు’ అంటూ తెలిపాడు.

ఇవి కూడా చదవండి

ఆమె పరిచయంతో కీలక మార్పు..

జీవితాన్ని మార్చిన క్షణాల గురించి కోహ్లీ మాట్లాడుతూ, అనుష్కను కలిసిన తర్వాత, జీవితాన్ని పూర్తి భిన్నంగా చూడటం ప్రారంభించానని చెప్పుకొచ్చాడు. నేను జీవితంలో భిన్నమైన కోణాన్ని చూశాను. కాబట్టి నేను అనుష్కను కలవడం జీవితాన్ని మార్చే క్షణం అని పిలుస్తానని ఈ మాజీ సారథి చెప్పుకొచ్చాడు.

ప్రేమ అంతా మార్చేసింది..

‘ఇది నా జీవితాన్ని మార్చే క్షణమని, ఎందుకంటే ప్రేమలో ఉన్నప్పుడు, మీలో మార్పులు మొదలవుతాయి. ప్రేమించిన వారితో కలిసి ముందుకు సాగాలని కోరుకుంటాం. మీరు చాలా విషయాలను అంగీకరించాలి. అందుకే ఈ క్షణం నాకు జీవితాన్ని మార్చే క్షణం’ అంటూ కోహ్లీ పేర్కొన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్