IND vs AUS: ఆస్ట్రేలియాపై రికార్డుల మోత.. కట్‌చేస్తే.. ఐసీసీ ర్యాకింగ్స్‌లో అగ్రస్థానం..

R Ashwin: భారత జట్టు వెటరన్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ రికార్డుల మోత మోగించాడు. భారత్ నుంచి అత్యధికంగా ఐదు వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు.

IND vs AUS: ఆస్ట్రేలియాపై రికార్డుల మోత.. కట్‌చేస్తే.. ఐసీసీ ర్యాకింగ్స్‌లో అగ్రస్థానం..
R Ashwin Ind Vs Aus
Follow us
Venkata Chari

|

Updated on: Mar 11, 2023 | 9:40 AM

IND vs AUS 4th test, R Ashwin: భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టుల సిరీస్‌లో చివరి మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరుగుతోంది. మ్యాచ్ రెండో రోజు శుక్రవారం ఆస్ట్రేలియా 480 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్ వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. భారత వెటరన్ స్పిన్నర్ ఆర్ అశ్విన్‌కు ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ చాలా ప్రత్యేకంగా నిలిచింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ 6 వికెట్లు తీశాడు. ఈ వికెట్లతో అశ్విన్ ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

అత్యధిక వికెట్లు సాధించిన రెండో భారత బౌలర్‌గా గుర్తింపు పొందాడు. అశ్విన్‌ శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో తన కెరీర్‌లో 32వ వికెట్‌ను పడగొట్టి, ఇంగ్లండ్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్‌ను సమం చేశాడు. నాలుగో టెస్టులో ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ, మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, టాడ్ మర్ఫీలను అశ్విన్ అవుట్ చేశాడు. మరోవైపు, అశ్విన్ కంటే ముందు భారత వెటరన్ స్పిన్నర్ అయిన అనిల్ కుంబ్లే తన కెరీర్‌లో 35 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో అశ్విన్ ప్రస్తుతం ICC టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో 859 రేటింగ్ పాయింట్లతో జేమ్స్ ఆండర్సన్‌తో కలిసి మొదటి స్థానంలో ఉన్నాడు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో అద్భుత బౌలింగ్‌ తర్వాత ఇప్పుడు అండర్సన్‌ను వెనక్కి నెట్టి నంబర్ వన్ కిరీటం ఆక్రమించాడు.

ఆస్ట్రేలియా జట్టుతో నాలుగో టెస్టు మ్యాచ్‌తో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అశ్విన్ మళ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. నాల్గవ టెస్ట్ ప్రారంభానికి ముందు, జేమ్స్ ఆండర్సన్, ఆర్. అశ్విన్ ఇద్దరూ 859 పాయింట్లతో మొదటి స్థానాన్ని పంచుకున్నారు. నాలుగో టెస్టులో ఆరు వికెట్లు తీసిన ఆర్. అశ్విన్ ఇప్పుడు జేమ్స్ అండర్సన్‌ను అధిగమించాడు. వీరితో పాటు ఐసీసీ టెస్ట్ బౌలర్ ర్యాంకింగ్స్‌లో అశ్విన్ మొదటి స్థానంలో, జేమ్స్ అండర్సన్ రెండో స్థానంలో, పాట్ కమిన్స్ మూడో స్థానంలో, కగిసో రబడ నాలుగో స్థానంలో, షాహీన్ అఫ్రిది ఐదో స్థానంలో నిలిచారు.

ఇవి కూడా చదవండి

భారత్‌లో అనిల్ కుంబ్లే 63 టెస్టు మ్యాచ్‌ల్లో 115 ఇన్నింగ్స్‌ల్లో 350 వికెట్లు పడగొట్టాడు. చాలా కాలంగా భారత మైదానాల్లో అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. తాజాగా ఈ రికార్డును కూడా బద్దలు కొట్టేందుకు అశ్విన్ చేరువయ్యాడు. అశ్విన్ స్వదేశంలో 55 మ్యాచ్‌లు ఆడి 106 ఇన్నింగ్స్‌ల్లో 336 వికెట్లు పడొట్టాడు. అంటే ఇక్కడ కుంబ్లేను ఓడించాలంటే భారత మైదానంలో మరో 15 వికెట్లు మాత్రమే తీయాల్సి ఉంది. మొత్తం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అశ్విన్ అనూహ్యంగా బౌలింగ్ చేస్తూ, ఆకట్టుకుంటున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..