కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డిని సోమవారం ప్రపంచ బ్యాంకు కంట్రీ డైరెక్టర్ అగస్తే కువామే నేతృత్వంలోని అధికారుల బృందం కలిసింది. ఈ సందర్భంగా ప్రపంచబ్యాంకు ఆధ్వర్యంలో నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో జరుగుతున్న సమగ్రాభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష జరిగింది. అనంతరం మాట్లాడిన కిషన్ రెడ్డి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి వరల్డ్ బ్యాంకు ద్వారా జరుగుతున్న సహాయ కార్యక్రమాలను అభినందించారు. అలాగే ఇకపైనా కూడా వరల్డ్ బ్యాంక్ సహాయసేవలను కొనసాగించాలన్నారు. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో ఈశాన్య రాష్ట్రాల పురోగతికోసం కేంద్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్తోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి నెలకొల్పడంతోపాటు, అనుసంధానతకోసం జరుగుతున్న కృషిని ఈ సందర్భంగా ఆయన వివరించారు.
Had a positive discussion with @worldbank delegation led by country director Mr Auguste Kouame
Various avenues of collaboration to ensure development reaches the last mile & creating sustainable livelihood opportunities for the people of NorthEast were deliberated in the meeting pic.twitter.com/xDa5SwW7sD
అనంతరం వరల్డ్ బ్యాంకు కంట్రీ డైరెక్టర్ శ్రీ అగస్తే కువామే మాట్లాడుతూ.. కేంద్రం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో సానుకూల మార్పులు క్షేత్రస్థాయిలో కనబడుతున్నాయని అన్నారు. అనుసంధానత విషయంలో ప్రత్యేకంగా తీసుకుంటున్న చర్యల కారణంగా అన్ని వర్గాల వారికి ఎంతో ప్రయోజనం చేకూరుతోందన్నారు. ఈశాన్య రాష్ట్రాల పురోగతిలో ప్రపంచబ్యాంకు సహకారం ఇకపైనా కొనసాగుతుందని ఆయన వెల్లడించారు.