AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chapatis at Night: రాత్రి పూట చపాతీలు తింటున్నారా..? అయితే మీరు తెలుసుకోవలసిన విషయాలివే..

ఎన్నో రోజులుగా ఉన్న అన్నం తినే అలవాటును ఉన్నఫళంగా మార్చడం సరికాదంటున్నారు వైద్యులు. ప్రతి రోజు చపాతీలనే తినే అలవాటును

Chapatis at Night: రాత్రి పూట చపాతీలు తింటున్నారా..? అయితే మీరు తెలుసుకోవలసిన విషయాలివే..
Chapathi
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 13, 2023 | 8:28 PM

Share

ఇటీవలి కాలంలో చాలామంది బరువు తగ్గడానికి, బాడీని ఫిట్‌గా ఉంచడానికి రాత్రి సమయంలో అన్నం మానేసి చపాతీ తింటున్నారు.  అయితే ఎన్నో రోజులుగా ఉన్న అన్నం తినే అలవాటును ఉన్నఫళంగా మార్చడం సరికాదంటున్నారు వైద్యులు. ప్రతి రోజు చపాతీలనే తినే అలవాటును చేసుకునే ముందుగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే లేనిపోని కొత్త ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముందట. అందువల్ల రాత్రిపూట పూర్తిగా అన్నం మానేసి దాని స్థానంలో చపాతీ తినే బదులు.. అన్నం తక్కువ తిని మిగతా భాగం చపాతీలు తినమని సూచిస్తున్నారు వైద్యులు. అంతేకాదు అప్పటికప్పుడు వేడివేడిగా చేసుకొని తినే చపాతీల కంటే మధ్యాహ్నం చేసుకొని రాత్రికి తినడం ఉత్తమం అంటున్నారు. ఇంకా చపాతీల్లో నూనె కూడా తక్కువ ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. మామూలుగా అయితే.. ఏదైనా ఆహారం ఎక్కువ సేపు నిల్వ ఉంచితే అందులోని పోషకాలు నిర్వీర్యమైపోతాయి. అయితే చపాతీలు, రోటీలు ఎంత ఎక్కువ సేపు నిల్వ ఉంటే ఆరోగ్యానికి అంత మంచిదట. మరి ఆ క్రమంలో చపాతీలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

చపాతీ ప్రయోజనాలు:

  • నిద్ర పోయేప్పుడు శక్తి నామమాత్రంగానే ఖర్చవుతుంది. మనలోని క్యాలరీలు ఏమాత్రం తగ్గవు. అందుకే రాత్రి సమయంలో అన్నం తినడం వల్ల అది ఖర్చు కాక పోవడంతో కొవ్వుగా మిగిలి పోయి, మనిషి లావు అయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల రాత్రి వేళ చపాతీలు తినడం ఉత్తమమైన ఎంపిక.
  • రాత్రి భోజనం చేసి, వెంటనే పడుకోవడం మరింత ఆరోగ్యానికి హానికరం. అందుకే రాత్రి సమయంలో భోజనంకు బదులుగా చపాతి తింటే బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు.
  • ప్లేట్‌ నిండుగా భోజనం చేసినా 2, 3 చపాతీలు తిన్నా ఒక్కటేనని డాక్టర్లు అంటున్నారు. అన్నం కంటే చపాతీలు శరీరానికి అధిక శక్తిని ఇస్తాయి.
  • చపాతీకి ఉపయోగించే గోధుమల్లో ఎలాంటి కొవ్వు పదార్థాలు ఉండవు. పైగా విటమిన్‌ బి, ఇ, కాపర్‌, అయోడిన్‌, జింక్‌, మాంగనీస్‌, సిలికాన్‌, మెగ్నీషియం, కాల్షియం వంటి ఎన్నో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
  • గోదుమల్లో ‘ఐరన్‌’ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచుతుంది.
  • చపాతిని చాలా తక్కువ నూనెతో కాల్చడం వల్ల ఉపయోగాలు మరింత ఎక్కువగా ఉంటాయి. అసలు నూనె వేయకుంటే మరింత మంచిది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..