Fielding Mistake: ఇదేం డెడికేషన్‌రా బాబు..! నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్.. మళ్లీ చూడాలనిపించే వీడియో..

అంతర్జాతీయ క్రికెట్‌ స్థాయిలో ఆడుతున్న క్రికెటర్లు సైతం ఫీల్డింగ్ విషయంలో తప్పులు చేస్తుంటారు. ఫీల్డింగ్‌లో చేసే తప్పులే మ్యాచ్ ఫలితాలను..

Fielding Mistake: ఇదేం డెడికేషన్‌రా బాబు..! నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్.. మళ్లీ చూడాలనిపించే వీడియో..
Fileding Mistake
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 13, 2023 | 9:22 PM

క్రికెట్ మ్యాచ్ అన్నాక ఫీల్డింగ్‌లో కొన్ని కొన్ని సార్లు తప్పిదాలు జరుగుతాయి. అంతర్జాతీయ క్రికెట్‌ స్థాయిలో ఆడుతున్న క్రికెటర్లు సైతం ఫీల్డింగ్ విషయంలో తప్పులు చేస్తుంటారు. ఫీల్డింగ్‌లో చేసే తప్పులే మ్యాచ్ ఫలితాలను కూడా మార్చేస్తాయి. అయితే అలాంటి ఫీల్డింగ్ తప్పు గుర్తు చేస్తూ ‘ముంబై ఇండియన్స్’ తన ఇన్స్‌స్టా ఖాతా నుంచి పోస్ట్ చేసింది. అసలు ఆ వీడియోలో ఏముందంటే.. ప్రత్యర్థి బ్యాటర్ కొట్టిన షాట్‌ను కష్టపడి పట్టుకున్నాడు ఓ ఫీల్డర్. అయితే చివరికి అది వికెట్లకు వేయబోయి బౌండరీ అవతలకు విసిరాడు. దీంతో ఆ షాట్ నాలుగు పరుగులను పొందింది. విశేషమేమంటే.. నాలుగు పరుగులు సాధించే అంతటి గట్టి షాట్ కాదు అది. ఇక దీనికి సంబంధించిన వీడియో నెట్టింట ప్రత్యక్షం కావడంతో.. వీడియోను చూసిన నెటిజన్లు పడి పడి నవ్వేసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Mumbai Indians (@mumbaiindians)

కాగా, ఈ వీడియోను ముంబై ఇండియన్ తన ఇన్స్‌స్టా ఖాతా నుంచి ఈ రోజు అంటే ఫిబ్రవరి 13న సాయంత్రం షేర్ చేసింది. ఆ వీడియోలోని ఫీల్డర్ బంతిని ఆపడానికి పడిన కష్టాన్ని చూపిస్తూ.. ‘కృషి, సంకల్సం ఉన్నా కొన్ని సందర్భాలు మనవి కాదు’ అని వ్యాఖ్యానించింది. ఇక దీనికి సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు వారి వారి స్పందనలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ ‘పాకిస్థాన్ ఆటగాళ్లను చూసి ఫీల్డింగ్ నేర్చుకున్నాడేమో..’ అంటు కామెంట్ చేయగా.. మరో నెటిజన్ ‘సుప్లా షాట్ కంటే ఈ ఫీల్డర్ ఫేమస్ అవుతాడు’ అని రాసుకొచ్చాడు. ఇలా వీడియోను చూసిన నెటిజన్లు వారి వారి అభిప్రాయాలను కామెంట్ల ద్వారా వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..