IND vs AUS 4th Test: డ్రాగా ముగిసిన నాలుగో టెస్టు.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీమిండియా.. పూర్తి వివరాలివే..
నాలుగు టెస్టుల బోర్డర్ - గావస్కర్ ట్రోఫీని టీమిండియా 2-1తో గెలుచుకుంది. తొలి రెండు టెస్టుల్లో భారత్ విజయం సాధించగా.. మూడో టెస్టును ఆసీస్ సొంతం చేసుకున్న..
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్, టీమిండియా మధ్య జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. ఫలితం తేలే అవకాశం లేకుండా ఐదు రోెజుల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల కెప్టెన్లు నిర్ణయం తీసుకుని నిర్ణీత సమయం కంటే ముందుగానే ముగించేశారు. దీంతో అంపైర్లు ఈ టెస్టు డ్రా అయినట్లు ప్రకటించారు. ఫలితంగా నాలుగు టెస్టుల బోర్డర్ – గావస్కర్ ట్రోఫీని టీమిండియా 2-1తో గెలుచుకుంది. తొలి రెండు టెస్టుల్లో భారత్ విజయం సాధించగా.. మూడో టెస్టును ఆసీస్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఫలితంగా సిరీస్ 2-1 తేడాతో ఉంది. అనంతరం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ నాలుగో టెస్టు డ్రాగా ముగియడంతో సిరీస్ భారత్ సొంతం అయింది.
అయితే ఈ మ్యాచ్‌లో చివరి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్(90) రాణించగా.. లబుషేన్(63*), స్మిత్(10*) చివరి వరకు కూడా క్రీజులో ఉన్నారు. అలాగే భారత బౌలర్లలో అశ్విన్ , అక్షర్ పటేల్ చెరో వికెట్ తీసుకున్నారు. అలాగే అంతకముందు ఆసీస్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 480-10 పరుగులు చేయగా.. టీమిండియా కూడా తనదైన శైలిలో 571-10 పరుగులు చేసి 91 పరుగుల అధిక్యంతో తన తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. కాగా, ఈ టెస్టులో ఆసీస్ తరఫున ఉస్మాన్ ఖవాజా(180), కామెరూన్ గ్రీన్(114) సెంచరీలు సాధించగా.. భారత్ తరఫున కూడా శుభమాన్ గిల్(128), కింగ్ కోహ్లీ(186) శతకాలతో రాణించారు.
#BorderGavaskarTrophy2023?: India (571) draw with Australia (480 and 175/2) in 4th Test at Ahmedabad, win series 2-1.
India qualified for ICC World Test Championship Final for the second time in a row.#INDvAUS #INDvsAUS pic.twitter.com/LdLZ2Qu5HO
— All India Radio News (@airnewsalerts) March 13, 2023
కాగా, ఈ సిరీస్‌ను భారత్ 3-1 తేడాతో ముగిస్తేనే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకుంటుంది. అయితే ఈ మ్యాచ్ డ్రాగా ముగిసినప్పటికీ.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్ ఫలితం తేలకముందే.. న్యూజిలాండ్ చేతిలో లంక ఓటమితో రోహిత్ సేన ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లోకి చేరింది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా 66.67 శాతం, భారత్ 58.80 శాతంతో వరుసగా రెండుస్థానాల్లో నిలిచాయి. దీంతో అటు టీమిండియా ఆటగాళ్లు, ఇటు భారత్‌లోని క్రికెట్ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.