Cracked Feet: పగిలిన పాదాలతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఈ 7 చిట్కాలు మీ కోసమే..!

మెరిసే చ‌ర్మం, నల్లని జట్టు కోసం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న క్రీములు, లోష‌న్‌లు, షాంపూలు విరివిగా రుద్దుతుంటారు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ పాదాల సంర‌క్షణ‌ను

Cracked Feet: పగిలిన పాదాలతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఈ 7 చిట్కాలు మీ కోసమే..!
Foot Cracks
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 13, 2023 | 3:12 PM

అందరిలోనూ తాము అందంగా క‌నిపించాలనే భావనతో చాలా మంది ఎన్నో ప్రయ‌త్నాలు చేస్తుంటారు. మెరిసే చ‌ర్మం, నల్లని జట్టు కోసం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న క్రీములు, లోష‌న్‌లు, షాంపూలు విరివిగా రుద్దుతుంటారు. హెయిర్ క‌టింగ్‌లో, వస్త్రధార‌ణ‌లో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ పాదాల సంర‌క్షణ‌ను మాత్రం గాలికి వ‌దిలేస్తుంటారు. అయితే సుతిమెత్తగా ఉండాల్సిన పాదాలలో పగుళ్లు వ‌స్తే తీవ్రంగా బాధిస్తాయి. ఆ పగుళ్లతో నలుగురిలోకి వెళ్లాలన్నా కూడా చిన్నతనంగా ఫీలవుతుంటారు కొందరు. ఈ క్రమంలో కొన్ని చిన్నచిన్న చిట్కాలు పాటించ‌డం ద్వారా స‌మ‌స్య నుంచి సులువుగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

నోటి శుభ్రత కోసం ఉపయోగించే మౌత్‌వాష్ పౌడ‌ర్‌ చర్మానికి తేమను అందిస్తుంది. ఒక వెడల్పాటి బకెట్‌లో కొంచెం మౌత్‌వాష్ పౌడ‌ర్‌, నీళ్లు క‌లిపి అందులో పాదాలను 15 నిమిషాలపాటు ఉంచాలి. తర్వాత‌ వేరే నీళ్లతో పాదాలను శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

యాంటీ మైక్రోబయల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలున్న తేనె పగిలిన పాదాలకు చక్కని మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. పాదాలకు పగుళ్లు ఉన్నచోట కొద్దిగా తేనె రాసుకొని అరగంట తర్వాత‌ శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తే పాదాలకు నిగారింపు వస్తుంది.

ఇవి కూడా చదవండి

మీ చీలమండల పగుళ్లను సరిచేయడానికి పాదాలను గోరువెచ్చని నీటిలో సుమారు 20 నిమిషాలు ముంచి, మడమలను స్క్రబ్బర్‌తో రుద్దాలి. దానిలో ఉన్న డెడ్ స్కిన్‌ను తొలగించాలి. తర్వాత పాదాలపై ఆవాల నూనెను అప్లై చేసి ఆపై సాక్స్ ధరించండి. మీ మడమలు కొన్ని రోజుల్లో మునుపటిలా మారుతాయి.

అరటిపండు మీ చర్మాన్ని పొడిబారకుండా కాపాడుతుంది. 2 పండిన అరటిపండ్లను గుజ్జులా చేసి పేస్ట్‌లా చేసి పాదాల మడమల మీద 20 నిమిషాల పాటు అప్లై చేసి ఆ తర్వాత బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. దీంతో మడమలు 2 వారాల్లో మునుపటిలా మారుతాయి.

కొబ్బరి నూనె కూడా పొడి చర్మానికి తేమను అందించి తాజాగా మారుస్తుంది. రాత్రిపూట నిద్రపోయే ముందు పాదాలకు కొబ్బరి నూనె రాసుకుంటే పగుళ్ల బాధ తగ్గుతుంది.

సాధార‌ణంగా ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ల వల్ల కూడా పాదాల్లో పగుళ్లు వస్తాయి. అలాంటప్పుడు వెనిగర్‌ కలిపిన నీటిలో పాదాలను కొద్దిసేపు ఉంచితే పగుళ్లు తగ్గి ఉపశమనం లభిస్తుంది.

పగిలిన‌ పాదాలకు ఓట్‌మీల్‌, పాల మిశ్రమం కూడా మంచి ఔషధంగా పనిచేస్తుంది. ప్రతివారం ఈ మిశ్రమాన్ని పాదాలకు రాసుకుంటే పగుళ్లు మాయమవుతాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..