Immunity Damage: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? తస్మాత్ జాగ్రత్త.. ఇమ్యూనిటీ దెబ్బతిన్నట్లే..!

శరీరానికి కావలసిన పోషకాలు అందకపోతే కొన్ని కొన్ని సందర్భాలలో ఇమ్యూనిటీ సిస్టమ్‌ బలహీనపడుతుంది. ఫలితంగా శరీరం అనేక వ్యాధులు, ఆరోగ్య సమస్యల బారిన పడడం..

Immunity Damage: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? తస్మాత్ జాగ్రత్త.. ఇమ్యూనిటీ దెబ్బతిన్నట్లే..!
Autoimmune Diseases
Follow us

|

Updated on: Mar 13, 2023 | 3:11 PM

గాలిలో ఉండే వైరస్‌ల కారణంగా, మారుతున్న వాతావరణం కారణంగా మానవ శరీరం అనేక ఆరోగ్య సమస్యల బారిన పడుతుంది. ఈ క్రమంలో రోగనిరోధక వ్యవస్థ శరీరాన్ని ఆయా వ్యాధులు లేదా ఆరోగ్య సమస్యల నుంచి రక్షించడానికి పనిచేస్తుంది. అయితే ఈ వ్యాధినిరోధక శక్తిని పటిష్టంగా ఉంచుకోవడానికి కొన్ని రకాల పోషకాలు అవసరమవుతుంటాయి. ఆ పోషకాలు అందకపోతే కొన్ని కొన్ని సందర్భాలలో ఈ ఇమ్యూనిటీ సిస్టమ్‌ బలహీనపడుతుంది. ఫలితంగా శరీరం అనేక వ్యాధులు, ఆరోగ్య సమస్యల బారిన పడడం ప్రారంభిస్తుంది. దీనినే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు. అయితే కొన్ని లక్షణాల ద్వారా రోగనిరోధక శక్తి బలహీనపడిందని ముందుగానే గుర్తించవచ్చు. రోగనిరోధక శక్తి బలహీనపడినట్లయితే.. కొన్ని రకాల పండ్లు, కూరగాయలను తీసుకోవడంతో పాటు సరైన చికిత్స తీసుకుంటే సమస్య నయం అవుతుంది. మరి ఈ క్రమంలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నప్పుడు శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

పొడి కళ్లు: రోగనిరోధక వ్యవస్థ బలహీనమైనప్పుడు కళ్లు పొడిగా మారుతాయి. కళ్లలో ఇసుక పడినట్లు అనిపిస్తుంది. అస్పష్టమైన దృష్టి ఏర్పడుతుంది. కళ్లని తేమగా ఉంచే కన్నీళ్లు ఈ స్థితిలో తక్కువగా ఉంటాయి.

డిప్రెషన్: డిప్రెషన్ రోగనిరోధక వ్యాధి లక్షణం అవుతుంది. ఎందుకంటే ఈ స్థితిలో రోగనిరోధక వ్యవస్థ మెదడుకు తాపజనక కణాలను పంపుతుంది. దీనివల్ల సమస్య మరింత ముదురుతుంది.

ఇవి కూడా చదవండి

దద్దుర్లు: చర్మంపై దద్దుర్లు, తామర ఏర్పడినట్లయితే రోగనిరోధక వ్యాధి లక్షణం కావచ్చు. ఈ పరిస్థితిలో మీకు సోరియాసిస్ కూడా సోకే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి వాటిపై చాలా అప్రమత్తంగా ఉండాలి. వెంటనే వైద్యుడి దగ్గరికి వెళ్లాలి.

కడుపు సమస్యలు: మీరు గ్యాస్, అపానవాయువు, కారణం లేకుండా బరువు తగ్గడం వంటి జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే అది ఉదరకుహర వ్యాధి లక్షణం అవుతుంది. రోగనిరోధక వ్యవస్థ తక్కువైనపుడు ఈ సమస్య ఎదురవుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..