AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

High Fiber Problems : అతి ఎప్పటికీ అనర్థమే.. ఆరోగ్యానికి మంచిదని ఫైబర్ ఎక్కువ తింటున్నారా? అయితే మీకు ఈ సమస్యలు గ్యారెంటీ..

ముఖ్యంగా శరీరానికి మంచిదని ఎక్కువ ఫైబర్ ఉన్న ఆహారాన్ని తీసుకుంటే మల బద్ధకం, కడుపు ఉబ్బరం, తక్కువ పోషకాహార శోషణ వంటి సమస్యలకు గురి కావచ్చు. డైటరీ ఫైబర్ పేగు కదలికలను నార్మల్ చేయడంతో పాటు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సాయం చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంతో పాటు ఆరోగ్యకరమైన బరువు నిర్వహణలోనూ సాయం చేస్తుంది.

High Fiber Problems : అతి ఎప్పటికీ అనర్థమే.. ఆరోగ్యానికి మంచిదని ఫైబర్ ఎక్కువ తింటున్నారా? అయితే మీకు ఈ సమస్యలు గ్యారెంటీ..
Foods For Fiber
Nikhil
|

Updated on: Mar 13, 2023 | 2:30 PM

Share

అతి ఎప్పటికీ అనర్థమే అని మన పెద్దల చెప్పే మాట. మంచి విషయం కొన్ని సందర్భాల్లో చెడుగా మారవచ్చు. అధిక పరిమాణంలో మంచి ఆహారం తీసుకుంటే మన శరీరానికి ఎక్కువ మంచి చేస్తుందని అనుకుంటూ ఉంటాం కానీ, అది మంచి కంటే చెడే ఎక్కువ చేస్తుంది. ముఖ్యంగా శరీరానికి మంచిదని ఎక్కువ ఫైబర్ ఉన్న ఆహారాన్ని తీసుకుంటే మల బద్ధకం, కడుపు ఉబ్బరం, తక్కువ పోషకాహార శోషణ వంటి సమస్యలకు గురి కావచ్చు. డైటరీ ఫైబర్ పేగు కదలికలను నార్మల్ చేయడంతో పాటు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సాయం చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంతో పాటు ఆరోగ్యకరమైన బరువు నిర్వహణలోనూ సాయం చేస్తుంది. బీన్స్, చిక్కుళ్లు, తృణధాన్యాలు, పండ్లు అన్ని ఫైబర్‌కు మంచి వనరులు. మహిళల రోజుకు 21 నుంచి 25 గ్రాములు, పురుషులు 30 నుండి 38 గ్రాములు ఫైబర్ తీసుకోవచ్చు. అయితే ఒకేసారి ఎక్కువ ఫైబర్ తినడానికి బదులుగా విడతల వారీగా తినడం ఉత్తమం. ఒకేసారి ఎక్కువ ఫైబర్ తింటే అనేక రకాల జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. మీరు ఫైబర్‌ను అధిక మోతాదులో తీసుకున్నారని భావిస్తే, మీ పేగు కార్యకలాపాలను పెంచడానికి ఎక్కువ నీటిని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. రోజూ ఎక్కువ ఫైబర్ తీసుకోవడం వల్ల దీర్ఘకాలికంగా మీ ఆరోగ్యంపై కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. అధిక ఫైబర్ తీసుకోవడం వల్ల కలిగే అనర్థాలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

జీర్ణ సమస్యలు

అధికంగా ఫైబర్ తింటే కడుపు నొప్పి నుంచి ఉబ్బరంతో గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారం తింటే అది జీర్ణం కావడానికి చాలా సమయం తీసుకుంటుంది. అయితే ఈ సమయంలో మీ కడుపు ఉబ్బినట్లు లేదా ఒక్కొసారి కడుపు నొప్పి సమస్య వేధిస్తుంది. కాబట్టి అధిక ఫైబర్ మొత్త జీర్ణ వ్యవస్థకు అంతరాయం కలిగిస్తుంది. 

పోషకాల లోపం

మన శరీరానికి ఫైబర్ మాత్రమే కాకుండా ఖనిజాలు, విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు. ఆరోగ్యకరమైన పోషకాల శ్రేణి అవసరం. అధికంగా ఫైబర్ తీసుకుంటే +మన శరీరానికి అవసరమైన పోషకాలు, ఖనిజాల సరైన శోషణను అడ్డుకుంటుంది. కాల్షియం, జింక్, ఐరన్ కొన్ని ఖనిజాలు ఎక్కువగా ఫైబర్ తీసుకోవడం వల్ల తీవ్రంగా ప్రభావితమవుతాయి. కాబట్టి మీరు మీ రోజువారీ భోజనంలో సరైన నిష్పత్తిలో ఫైబర్ ఉండేలా చూసుకోవాలి.

ఇవి కూడా చదవండి

అతిసారం

మీరు అకస్మాత్తుగా అధిక మొత్తంలో ఫైబర్‌ను తీసుకున్నప్పుడు, అది విరేచనాలు లేదా వదులుగా ఉండే మోషన్‌కు దారితీస్తుంది. అరటిపండ్లు, యాపిల్స్, వోట్స్, బచ్చలికూర, టొమాటోలు, మరెన్నో అధిక ఫైబర్ ఆహారాలు తిన్న తర్వాత ప్రజలు తరచుగా కడుపు నొప్పిని ఎదుర్కొంటారు.

పేగు సంబంధిత సమస్యలు

మీ శరీరం మొత్తం ఫైబర్‌ను సరిగ్గా జీర్ణం చేయడానికి చాలా సమయం పడుతుంది. అధిక ఫైబర్ పేగులకు అంతరాయం కలిగించవచ్చు, అలాగే పేగులను అడ్డంకిని కలిగిస్తుంది. ముఖ్యంగా, శరీరానికి తగినంత నీరు అందనప్పుడు ఫైబర్ జీర్ణం కావడం కష్టమవుతుంది. వీలైనంత జాగ్రత్తలు తీసుకోకపోతే ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి అధిక ఫైబర్‌ను తీసుకుంటే తగినంత నీరు తీసుకోవడం ఉత్తమం.

మలబద్ధకం

అధిక ఫైబర్ అతిసారం లేదా మలబద్ధకానికి దారితీస్తుంది. ఫైబర్‌లో కరిగే, కరగని అనే రెండు రకాల ఫైబర్‌లు ఉంటాయి. కరిగే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇది అధిక మొత్తంలో మీ జీర్ణవ్యవస్థకు ఆటంకం కలిగిస్తుంది. తద్వారా మలబద్ధకానికి దారితీస్తుంది. మీరు ఫైబర్ అధికంగా తీసుకుంటే సరైన ద్రవ ఆహారంత తీసుకోవడం ఉత్తమం.

నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..