AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cucumber Benefits: హాట్ సమ్మర్‪లో చిల్ అవ్వాలంటే దీనిని రుచి చూడాల్సిందే! వెంటనే డైట్‪లో చేర్చేసుకోండి..

ఈ వేసవిలో మీ ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలలో కీరదోస ఒకటి. దీనిలో విటమిన్ కే, విటమిన్ ఏ, విటమిన్ సీ లభిస్తుంది. కీరదోసను జ్యూస్ చేసుకుని తాగినా ప్రయోజనం ఉంటుంది. ఇది లోపల నుండి మిమ్మల్ని చల్లగా ఉంచుతుంది

Cucumber Benefits: హాట్ సమ్మర్‪లో చిల్ అవ్వాలంటే దీనిని రుచి చూడాల్సిందే! వెంటనే డైట్‪లో చేర్చేసుకోండి..
Cucumber
Madhu
|

Updated on: Mar 13, 2023 | 4:19 PM

Share

ఎండాకాలం వచ్చేసింది. అప్పుడే కొన్ని చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడిగాలులు విజృంభిస్తున్నాయి. ఈ క్రమలో ప్రజలు ఉక్కపోత, చెమటతో ఇబ్బందులు పడే రోజులు ముందుముందు ఉన్నాయి. ఈ సమయంలో ప్రజలు ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. చెమట రూపంలో శరీరం నుంచి ఎక్కువ మోతాదులో నీరు కోల్పోతుంది. ఈ సమయంలో ద్రవ పదార్థాలు ఎక్కువగా లోపలికి తీసుకోవాలి. అలాగే తీసుకొనే ఆహార పదార్థాల విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. ఈ వేసవిలో మీ ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలలో కీరదోస ఒకటి. కీరదోసలో విటమిన్ కె, విటమిన్ ఏ, విటమిన్ సి లభిస్తుంది. కీరదోసను జ్యూస్ చేసుకుని తాగినా ప్రయోజనం ఉంటుంది. లోపల నుండి మిమ్మల్ని చల్లగా ఉంచుతుంది. అలాగే మీ చర్మాన్ని ఆరోగ్యంగా రిఫ్రెష్‌గా ఉంచుతుంది. దీని ద్వారా మరిన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రముఖ పోషకాహార నిపుణుడు లోవనీత్ బాత్రా పంచుకున్నారు. ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో వేసవిలో కీరదోసకాయను ఎందుకు తప్పనిసరిగా మన డైట్లో చేర్చుకోవాలలో వివరించారు. ఆ విషయాలు చూద్దాం..

  • కీర దోసలో 95% నీరు ఉంటుంది. ఇవి టాక్సిన్స్‌ని తొలగించడం ద్వారా శరీరాన్ని బాగా హైడ్రేట్‌గా ఉంచుతుంది. వీటిలో నీటి శాతం ఉండటం వల్ల శరీరాన్ని లోపలి నుంచి శుభ్రపరుస్తుంది. అలాగే శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది.
  • కుకుర్బిటాసిన్ బీ అనేది కీరదోసకాయలలో ఎక్కువగా ఉండే ఒక సహజ పదార్థం. దీనిలో అపోప్టోసిస్-ఇండక్షన్ జరిగి దాని ద్వారా క్యాన్సర్ నిరోధక సామర్థ్యాన్ని మానవ కణాలకు అందిస్తాయి. అలాగే, కీరదోస తొక్కలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
  • కీరదోసలో ఫైబర్, పొటాషియం మెగ్నీషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు రక్తపోటును తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.. ఇంకా, అధిక పొటాషియం, నీటి కంటెంట్ రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడతాయి.
  • కీరదోస శరీరం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడటమే కాకుండా.. మనిషిని అందంగా కూడా ఉంచుతుంది. ఇది చర్మానికి సహజ టోనర్‌గా పనిచేస్తుంది. కంటి కింద నల్లటి వలయాలను తగ్గిస్తుంది, వేసవికాలంలో సాధారణంగా చర్మం పలు ఇబ్బందులకు గురవుతుంది. ఫలితంగా చికాకు, ఎరుపు, మంట వస్తుంది. కీర దోస వాటి నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.
  • కీరదోసలో సిలికా ఉంటుంది, ఇది జుట్టు, గోళ్ల సంరక్షణకు బాగా ఉపయోగపడుతుంది. కీరదోస జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేస్తంది. పేగుల సాధారణ కదలిలకలను ప్రోత్సహిస్తుంది. ఫలితంగా మలబద్ధకాన్ని తొలగిస్తుంది.
  • కీరదోసలో విటమిన్ సి, కెఫిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వల్ల చికాకు పడిన చర్మం లేదా టాన్డ్ స్కిన్‌కు ఉపశమనం కలిగిస్తుంది. అలాగే వాపును తగ్గిస్తుంది. దోసకాయలో ఉండే ఆస్ట్రింజెంట్ ప్రాపర్టీ స్కిన్ ట్యాన్‌ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..