Fiber Foods: బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారా? అయితే, ఈ 5 ఫైబర్ ఫుడ్స్‌కి దూరంగా ఉండండి..

Fiber Foods: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరి జీవితం ఉరుకులు పరుగులుగా సాగుతోంది. ఈ క్రమంలో సమయానికి ఆహారం తినకపోవడం, వ్యాయామం చేయకపోవడం,

Fiber Foods: బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారా? అయితే, ఈ 5 ఫైబర్ ఫుడ్స్‌కి దూరంగా ఉండండి..
Fiber Food
Shiva Prajapati

|

Nov 19, 2021 | 10:14 PM

Fiber Foods: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరి జీవితం ఉరుకులు పరుగులుగా సాగుతోంది. ఈ క్రమంలో సమయానికి ఆహారం తినకపోవడం, వ్యాయామం చేయకపోవడం, శారీరక శ్రమ సైతం లేకపోవడంతో ఊబకాయం బారిన పడుతున్నారు. ఫలితంగా భారీగా లావు పెరుగుతున్నారు. అయితే, అధిక బరువు ప్రమాదం అని తెలిసి చాలామంది బరువు తగ్గించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో డైట్ మెయింటేన్ చేయడం, వ్యాయామం చేయడం వంటికి చేస్తుంటారు. అయితే, బరువు తగ్గడానికి చేసే ప్రయత్నంలో.. తగినంత ఫైబర్ ఫుడ్స్ తినడం ఉత్తమం అని వైద్యులు, నిపుణులు సూచిస్తుంటారు. తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలలో ఉండే కరిగే ఫైబర్.. ఆరోగ్యకరమైన గట్ బాక్టీరియా, బల్క్ అప్ స్టూల్‌ను పెంచడంలో సహాయపడుతుంది. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. కొవ్వును కరిగిస్తుంది. ఫైబర్ ఫుడ్ తినడం వలన కడుపు నిండినట్లుగా అనిపిస్తుంటుంది. దాంతో ఇతర ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడానికి ఆస్కారం లేకుండాపోతోంది. ఫలితంగా బరువు తగ్గేందుకు ఉపకరిస్తుంది. అయితే, ఇక్కడ చిన్న లాజిక్ ఉంది. అన్ని ఫైబర్ ఫుడ్స్ మంచివి కాదని వైద్యులు చెబుతున్నారు. కొన్ని ఫైబర్ ఫుడ్స్ మనం తినే ఆహారంలో ఉన్నా.. ఎక్కువ మోతాదులో తీసుకుంటే మాత్రం ప్రమాదమే అని హెచ్చరిస్తున్నారు. పరిమితికి మించి ఆ ఫైబర్ ఫుడ్స్‌ని తినడం వల్ల బరువు తగ్గకపోగా.. ఫలితం శూన్యంగా మారే ఛాన్స్ ఉంటుందంటున్నారు. అందుకే ఎవరైనా సరే బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు.. ఈ 5 రకాల ఫైబర్ ఫుడ్స్ తినొద్దని నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు. మరి అతిగా తినకూడని ఫైబర్ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

వోట్స్.. వోట్స్ అధిక బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు తీసుకునే ఆరోగ్యకరమైన అల్పాహారం. ఓట్స్‌లో ఫైబర్, ప్రొటీన్, బరువు తగ్గించే ప్రక్రియకు తోడ్పడే ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కానీ అన్ని రకాల వోట్స్ ఒకేలా ఉండవు. అన్నీ ఒకే రకమైన ప్రయోజనాలను అందించవు. ప్రాసెస్ చేయబడిన వోట్స్‌లో.. స్టీల్ కట్ వోట్స్, రోల్డ్ వోట్స్ మాత్రమే ఉత్తమమైనవి. క్విక్ వోట్స్ అత్యధికంగా ప్రాసెస్ చేయబడతాయి. ఇవి అధిక కేలరీలను, చక్కెర స్థాయిలను కలిగి ఉంటాయి. అలాగే అధిక గ్లైసెమిక్ కలిగి ఉంటుంది. ఇవి మీ రక్తంలో చక్కెర స్థాయిని త్వరగా పెంచుతాయి.

గోధుమ రొట్టె.. బరువు తగ్గడానికి గోధుమ రోట్టెల కంటే.. హోల్ వీట్ బ్రెడ్ ఉత్తమం అని చెబుతారు నిపుణులు. వాస్తవానికి ఈ రెండింటిలో పెద్ద తేడా ఏమీ లేకపోయినప్పటికీ.. హోల్ వీట్ బ్రెడ్‌లో ఎక్కువ ఫైబర్ ఉండదు. గోదుమ చపాతీలతో పోలిస్తే ఉపాంత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే పండ్లు, కూరగాయలతో పోలిస్తే.. ఇవి అనారోగ్యకరమైనవి, పోషకాలు తక్కువగా ఉన్నవి అని చెబుతున్నారు నిపుణులు. వేగంగా బరువు తగ్గానుకుంటే వీటిని తక్కువగా తినడమే ఉత్తమం అని చెబుతున్నారు.

క్రీమ్ వెజిటబుల్ సూప్.. క్రీమ్ సూప్‌లో ఫైబర్ ఉంటుంది. అయితే, ఇందులో అధిక కాలరీలు ఉంటాయి. బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నట్లయితే.. ఇది తీసుకోకపోవడమే ఉత్తమం అని చెబుతున్నారు. ఈ క్రీమ్‌ సూప్‌ని కూరగాయలు, బోన్స్‌ ద్వారా చేస్తే మరింత ప్రయోజనం ఉంటుందట.

తృణధాన్యాలు.. తృణధాన్యాలు ఆరోగ్య పరంగా మంచివే అయినప్పటికీ.. బరువు తగ్గడంలో ఉపకరించవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తృణధాన్యాలలో ఎక్స్‌ట్రా షుగర్ లెవల్స్ ఉంటాయని, కేలరీలు అధికంగా ఉంటాయని పేర్కొన్నారు. వీటిలో ఫైబర్‌ సమృద్ధిగా ఉన్నప్పటికీ.. బరువు తగ్గడంలో మాత్రం సహాయపడవని చెబుతున్నారు.

Also read:

Shalu Chourasiya: కీలక మలుపులు తిరిగిన హీరోయిన్ శాలు చౌరాసియా కేసు.. నిందితుడిన పట్టుకున్న పోలీసులు

Suriya: ఆచార్యకు పోటీగా సూర్య సినిమా… థియేటర్లలో ఒకేరోజు సందడి చేయనున్న స్టార్ హీరోస్…

Bigg Boss 5 Telugu: ప్రేక్షకులకు ఎమోషనల్ టచ్ ఇస్తున్న ఆ ఇద్దరు.. డెస్టినీ వాళ్లను కలిపిందంటున్న నెటిజన్స్….

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu