Omega-3 Rich Foods: ఒమేగా-3 అధికంగా ఉన్న టాప్ 5 వెజిటేబుల్స్ ఇవే.. ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం..

Omega-3 Rich Foods: పండ్లు, కూరగాయలు, సముద్రపు ఆహార పదార్థాలు సహా ఇతర ఆరోగ్యకరమైన పోషకాలను మనం తీసుకునే ఫుడ్‌లో చేర్చడం చాలా ముఖ్యం.

Omega-3 Rich Foods: ఒమేగా-3 అధికంగా ఉన్న టాప్ 5 వెజిటేబుల్స్ ఇవే.. ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం..
Harish Rao
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 19, 2021 | 10:11 PM

Omega-3 Rich Foods: పండ్లు, కూరగాయలు, సముద్రపు ఆహార పదార్థాలు సహా ఇతర ఆరోగ్యకరమైన పోషకాలను మనం తీసుకునే ఫుడ్‌లో చేర్చడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఒమేగా-3 ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. మెదడు, గుండె, పునరుత్పత్తి వ్యవస్థతో సహా శరీరంలోని ముఖ్యమైన భాగాలకు అద్భుతమైన పోషకం ఒమేగా-3. ఈ పోషకాలను క్రమం తప్పకుండా తీసుకుంటే.. జీవితకాలం పెరిగే ఛాన్స్ ఉంది. వృద్ధాప్య చాయలను నిలువరిస్తుంది కూడా. మీరు ఇన్ఫ్లమేటరీ‌తో పోరాడుతున్నట్లయితే మీ ఆహారంలో ఒమేగా-3 చేర్చడం చాలా ఉత్తమం. అయితే, ఒమెగా-3 మాంసహారంలో పుష్కలంగా ఉంటుందని అనుకుంటారు. కానీ, శాఖాహారంలోనూ ఒమెగా-3 ఉంటుంది. మరి ఒమెగా-3 ఉండే 5 ముఖ్యమైన శాఖాహార పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. మీరు శాకాహారి అయితే ఒమేగా-3ని సప్లిమెంట్లుగా తీసుకోవచ్చా? ప్రతి వ్యక్తి రోజూ 1.2 గ్రా నుండి 1.8 గ్రా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ కంటెంట్‌ను కలిగి ఉండాలని పోషకాహార నిపుణులు సిఫార్సు చేస్తున్నాయి. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు వారి అవసరాలకు అనుగుణంగా ఎక్కువ మోతాదులను తీసుకోవచ్చని సూచించారు. విపరీతమైన లోపాలతో బాధపడుతున్న వ్యక్తులు ఈ సప్లిమెంట్లను తరచుగా తీసుకోవాలంటున్నారు. సాధారణంగా ఒమేగా-3 చేపలు, కొన్ని ఇతర రకాల సముద్రపు జీవుల్లో ఉంటుంది. వీటిని తినని శాఖాహారులు.. ఒమేగా-3ని సప్లిమెంట్ల రూపంలో తీసుకోవచ్చు. అయితే, ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. ఒమేగా-3 మొక్కల ఆధారిత ఆహారాలు, కూరగాయలలో ఉంటుందట. అవేంటో కింద చూడండి.

చియా విత్తనాలు.. అత్యంత ప్రజాదరణ పొందిన, అధునాతన విత్తనాలలో ఒకటి చియా విత్తనాలు. ఇవి అద్భుతమైన ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. బరువు తగ్గించే, గుండె ఆరోగ్యంగా ఉండేందుకు ఉపకరించే ఆహార పదార్థంగా చియా విత్తనాలకు గుర్తింపు. ఒక గుప్పెడు చియా విత్తనాల్లో 5g ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. జనపనార గింజలు, అవిసె గింజల్లోనూ ఒమెగా-3 ఉంటుంది.

సముద్రపు పాచి.. సముద్రపు పాచి.. శాకాహారులకు ఉత్తమ మైన ఫుడ్. సముద్రపు పాచి, నోరి, స్పిరులినా వంటి వాటిల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.

అక్రోట్లు.. వాల్‌నట్స్‌ మెదడు, గుండెకు ఎంతో మేలు చేస్తాయి. ప్రతీ రోజూ కొన్ని వాల్‌నట్స్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మెరుగైన ఆరోగ్యం కోసం ప్రతీ రోజూ నానబెట్టిన వాల్‌నట్స్‌ను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ వాల్ నట్స్‌లో ఒమెగా-3 పుష్కలంగా ఉంటుంది.

ఎడమామ్.. ఇది ఒక సోయాబీన్ ఉత్పత్తి. ఎడమామ్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఒమేగా-3 రిచ్ ఫ్యాటీ యాసిడ్‌లు అధికంగా ఉంటాయి. దీన్ని ఆహారంలో తినడం ద్వారా అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి.

కిడ్నీ బీన్స్.. దేశంలో రజ్మా, కిడ్నీ బీన్స్ పేరుతో పిలువబడే వీటిలో ఒమేగా-3 అధికంగా ఉంటుంది. అరకప్పు కిడ్నీ బీన్స్‌లో 0.10 గ్రాముల ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు ఉంటాయి.

Also read:

Shalu Chourasiya: కీలక మలుపులు తిరిగిన హీరోయిన్ శాలు చౌరాసియా కేసు.. నిందితుడిన పట్టుకున్న పోలీసులు

Suriya: ఆచార్యకు పోటీగా సూర్య సినిమా… థియేటర్లలో ఒకేరోజు సందడి చేయనున్న స్టార్ హీరోస్…

Bigg Boss 5 Telugu: ప్రేక్షకులకు ఎమోషనల్ టచ్ ఇస్తున్న ఆ ఇద్దరు.. డెస్టినీ వాళ్లను కలిపిందంటున్న నెటిజన్స్….

యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!