Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shalu Chourasiya: కీలక మలుపులు తిరిగిన హీరోయిన్ శాలు చౌరాసియా కేసు.. నిందితుడిన పట్టుకున్న పోలీసులు..

సినీనటి చౌరాసియా ఫై దాడి కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. కేబీఆర్ పార్క్ దగ్గర ఘటనలో కృష్ణా నగర్‌కు చెందిన బాబును పోలీసులు అదుపులోకి..

Shalu Chourasiya: కీలక మలుపులు తిరిగిన హీరోయిన్ శాలు చౌరాసియా కేసు.. నిందితుడిన పట్టుకున్న పోలీసులు..
Attack On Actor Chaurasia
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 19, 2021 | 9:25 PM

Shalu Chourasiya: సినీనటి చౌరాసియా ఫై దాడి కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. కేబీఆర్ పార్క్ దగ్గర ఘటనలో కృష్ణా నగర్‌కు చెందిన బాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సినీనటి చౌరాసియాపై దాడి కేసులో పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఆదివారం రాత్రి బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ పార్క్‌ వద్ద చౌరిసియాపై దాడి చేసిన నిందితుడు ఆమె యాపిల్‌ ఫోన్‌ ఎత్తుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి యూసఫ్‌గూడ, కృష్ణానగర్‌కు చెందిన 70 మంది పాతనేరస్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. సినీకార్మికులుగా చేస్తూ నేర చరిత్ర ఉన్నవారి వివరాలను సేకరించారు. సాంకేతిక ఆధారాలు లభ్యం కాకపోవడంతో కేసు దర్యాప్తులో కొద్దిగా జాప్యం జరిగింది. క్యాన్సర్‌ ఆసుపత్రి సమీపంలో చౌరాసియా యాపిల్‌ ఫోన్‌ స్విచ్‌ ఆఫ్ అయినట్టు పోలీసులు గుర్తించారు. కేబీఆర్‌ పార్క్‌ పరిసరాల్లోని సీసీ కెమెరాల్లో ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో పోలీసులు సాంకేతికతను పక్కన పెట్టి శాస్త్రీయంగా దర్యాప్తు చేశారు.

సినీ నటి శాలు చౌరాసియా పై దాడి కలకలం రేపిన విషయం తెలిసిందే. కొండాపూర్‌లో ఉండే శాలు చౌరాసియా తెలుగు, తమిళం సినిమాల్లో నటించారు. ఆమె ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు కేబీఆర్‌ పార్కుకు ఆనుకుని ఉన్న ట్రాక్‌లో వాకింగ్‌ చేసేందుకు వచ్చారు. గంటన్నర పాటు వాకింగ్‌ చేసి ఓ చోట నిలబడ్డారు. ఇంతలో ఓ ఆగంతకుడు వెనుక నుంచి వచ్చి ఆమె మూతికి గుడ్డ కట్టేందుకు ప్రయత్నించాడు.

ఈ సందర్భంగా జరిగిన పెనుగులాటలో ఆమె కింద పడింది. దీంతో ఆగంతకుడు ఆమెపై దాడి చేశాడు. అనంతరం అక్కడినుంచి పారిపోయాడు. అయితే ఈ కేసు రోజు రాజుకు కొత్త మలుపులు తిరుగుతుంది. ఈ కేసులో నిందితుడు- నటి చౌరాసియాతో అసభ్యంగా వ్యవహరించినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు.

ఆమె పెదాలు, మెడపై గాయాలున్నట్టు గుర్తించారు. చౌరాసియాను అతడు చెట్ల పొదల చాటుకు తీసుకెళ్లే యత్నం చేశాడనీ.. ఈ క్రమంలోనే ఆమె కాలి మడమకు ఫ్రాక్చర్ అయిందనీ పోలీసులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి: Skin Care Tips: చలికాలంలో డ్రై స్కిన్‌తో బాధపడుతున్నారా.. అద్భుమైన చిట్కా మీకోసం.. ఇంట్లోనే చేసుకోండిలా..

MLA Roja: నాకు చాలా సంతోషంగా ఉంది.. బైబై బాబూ అంటూ రోజా సంచలన వీడియో