Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLA Roja: నాకు చాలా సంతోషంగా ఉంది.. బైబై బాబూ అంటూ రోజా సంచలన వీడియో

విధి ఎవరినీ విడిచిపెట్టదనీ, అందరి సరదా తీర్చేస్తుందనీ, ఇప్పుడు చంద్రబాబుకు అదే జరిగిందని కామెంట్‌ చేశారు ఎమ్మెల్యే రోజా. 72 ఏళ్ల వయసులో ఎన్టీఆర్‌ ఎంత ఏడిపించారో గుర్తుందా..

MLA Roja: నాకు చాలా సంతోషంగా ఉంది.. బైబై బాబూ అంటూ రోజా సంచలన వీడియో
Mla Roja Chandrababu
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 19, 2021 | 4:59 PM

MLA Roja – Chandrababu: విధి ఎవరినీ విడిచిపెట్టదనీ, అందరి సరదా తీర్చేస్తుందనీ, ఇప్పుడు చంద్రబాబుకు అదే జరిగిందని కామెంట్‌ చేశారు ఎమ్మెల్యే రోజా. 72 ఏళ్ల వయసులో ఎన్టీఆర్‌ ఎంత ఏడిపించారో గుర్తుందా అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు అదే వయసులో.. 71 సంవత్సరాలా 7 నెలలకే ఏడ్చావని చంద్రబాబు ఏడ్చారని.. మనం ఏది చేస్తే అది మనకు తిరిగి వస్తుందని అన్నారు. ఆ రోజు హైదరాబాద్‌ అసెంబ్లీలో నాపై నీవే చేసిన కామెంట్స్ గుర్తున్నాయా అంటూ మండిపడ్డారు. ఆనాడు నీవు ఎవరిమీద ఎలాంటి కామెంట్స్ చేశావో అంతా గుర్తుంచుకున్నారని అన్నారు. ఎవరో ఏదో అన్నారని దొంగ ఏడ్పులు ఏడ్చేస్తున్నారని ఏద్దేవ చేశారు. ప్రధాని మోడీతో సహా అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని మాట్లాడావో తెలుసన్నారు. చాలా హ్యాపీగా ఉందని కామెంట్‌ చేశారు రోజా. అంతే కాదు బైబై బాబూ అంటూ రోజా వీడియో విడుదల చేశారు.

అంతకు ముందు సీఎం ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతు..చంద్రబాబు కుటుంబ సభ్యుల గురించి ఎవరూ సభలో మాట్లాడలేదని క్లారిటీ ఇచ్చారు సీఎం జగన్‌. ఆయనే తన చిన్నాన్న, చెల్లి గురించి మాట్లాడారన్నారు. గతంలో జరిగిన హత్యలపై విచారణ జరగాలని తమ సభ్యులు అంటే దాన్ని మరో రకంగా మార్చి డ్రామా క్రియేట్‌ చేశారని విమర్శించారు. గతంలో తన చిన్నాన్నను ఓడించారని, ఆయన్ను వాళ్లే ఏదో ఒకటి చేసి ఉంటారని వ్యాఖ్యానించారు సీఎం జగన్‌

ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ..

ఇవి కూడా చదవండి: CM Jagan: చంద్రబాబు కుటుంబ సభ్యుల గురించి ఎవరూ మాట్లాడలేదు.. క్లారిటీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్..

Petrol Diesel Offer Price: పెట్రోల్, డీజిల్‌పై డిస్కౌంట్ కావాలా.. అయితే ఈ క్రెడిట్ కార్డుతో కొట్టించండి..