Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skin Care Tips: చలికాలంలో డ్రై స్కిన్‌తో బాధపడుతున్నారా.. అద్భుమైన చిట్కా మీకోసం.. ఇంట్లోనే చేసుకోండిలా..

శీతాకాలపు చల్లని గాలులు ప్రభావం ముందుగా మన చర్మంపై కనిపిస్తుంది. దీని వల్ల చర్మం పొడిబారడం, పెదవులు పగిలిపోవడం, మడమలు పగిలిపోవడం తదితర సమస్యలు..

Skin Care Tips: చలికాలంలో డ్రై స్కిన్‌తో బాధపడుతున్నారా.. అద్భుమైన చిట్కా మీకోసం.. ఇంట్లోనే చేసుకోండిలా..
Winter Problems And Skin Ca
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 19, 2021 | 5:27 PM

Winter Problems: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగిపోయింది. చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.అయితే శీతాకాలపు చల్లని గాలులు ప్రభావం ముందుగా మన చర్మంపై కనిపిస్తుంది. దీని వల్ల చర్మం పొడిబారడం, పెదవులు పగిలిపోవడం, మడమలు పగిలిపోవడం తదితర సమస్యలు తెరపైకి వస్తాయి. ఇది కాకుండా, శీతాకాలంలో దాహం తక్కువగా ఉంటుంది. దీని కారణంగా నీరు తీసుకోవడం కూడా తగ్గుతుంది. అటువంటి పరిస్థితిలో డీహైడ్రేషన్ (నిర్జలీకరణం) జరుగుతుంది. అలాగే చర్మం పరిస్థితి కూడా అధ్వాన్నంగా మారుతుంది. అయితే, ఈ రోజుల్లో పొడిని తొలగించడంలో సహాయపడే అనేక రకాల చర్మ ఉత్పత్తులు మార్కెట్లో అమ్ముడవుతున్నాయి. కానీ కొంతమందికి చర్మం చాలా పొడిగా ఉంటుంది. చర్మ సంరక్షణ ఉత్పత్తులు కూడా పూర్తిగా పనిచేయవు. అటువంటి పరిస్థితిలో ఇక్కడ పేర్కొన్న కొన్ని ఇంటి చిట్కాలతో చర్మం పొడిబారకుండా చేయడం ఎలానో తెలుసుకుందాం.

నారింజ తొక్కలు

నారింజలో విటమిన్ సి లభిస్తుంది. ఇది మీ చర్మాన్ని పునరుద్ధరించడానికి పనిచేస్తుంది. కానీ మీరు నారింజ తిన్న తర్వాత దాని తొక్కలను ఉపయోగించవచ్చు. తొక్కలు ఎండబెట్టి పొడి చేసుకోవాలి. దీని తర్వాత అవసరాన్ని బట్టి ఈ పొడిలో తేనె మిక్స్ చేసి పేస్ట్‌ రెడీ చేసుకోవాలి.. ఆ పేస్టును ముఖానికి అప్లై చేయాలి. దాదాపు అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని కడగాలి.

పసుపు, బేసన్ (శెనగపిండి) 

మన అమ్మమ్మల కాలం నుంచి పసుపు, శెనగపిండి వాడేవారు. ఈ పద్ధతి నేటికీ ప్రభావవంతంగా ఉంది. దీన్ని సిద్ధం చేయడానికి మీరు ఒక టీస్పూన్ పసుపు పొడిలో రెండు టీస్పూన్ల శెనగపిండిని కలపాలి. ఒక చెంచా క్రీమ్ వేసి కొద్దిగా పాలు కలపండి. దీని తరువాత, అన్ని వస్తువులను బాగా కలిపి పేస్ట్ సిద్ధం చేయండి. దీన్ని ముఖానికి పట్టించి.. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల మీ చర్మం పొడిబారడం క్షణాల్లో మాయమవుతుంది. అలాగే నలుపు కూడా తొలగిపోతుంది.

మసూర్ పప్పు

మీరు పప్పు ప్యాక్ గురించి చాలా విని ఉంటారు. బహుశా దీనిని కూడా ఉపయోగించారు. అయితే చర్మం పొడిబారకుండా ఉండాలంటే మాత్రం ప్యాక్‌ని డిఫరెంట్‌గా తయారు చేసుకోవాలి. ఇందుకోసం దేశీ నెయ్యిలో పప్పును వేయించాలి. దీని తర్వాత పప్పును పాలలో నానబెట్టాలి. పప్పు బాగా ఉబ్బినప్పుడు మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖంపై కనీసం ఒకటిన్నర గంటల పాటు అప్లై చేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. దీని వల్ల చర్మం పొడిబారడమే కాకుండా ముఖం చాలా మృదువుగా మారుతుంది.

ఇవి కూడా చదవండి: CM Jagan: చంద్రబాబు కుటుంబ సభ్యుల గురించి ఎవరూ మాట్లాడలేదు.. క్లారిటీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్..

Petrol Diesel Offer Price: పెట్రోల్, డీజిల్‌పై డిస్కౌంట్ కావాలా.. అయితే ఈ క్రెడిట్ కార్డుతో కొట్టించండి..