AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dosa Tawa: నాన్ స్టిక్ తవా కంటే ఇనుప పెనమే బెస్ట్ అంటున్న హెల్త్ ఎక్స్‌పెర్ట్స్.. వివరాలు

Dosa Tawa: దశాబ్దాల దక్షిణ భారత వంటకాలలో ఒకటి దోశ. ఇది ఆరోగ్యకరమైన అల్పాహారం. తేలికగా జీర్ణమవుతుంది. ఇప్పుడు దోశ అనేక రకాలుగా తయారు చేస్తున్నారు. మసాలా దోశ, పేపర్ రోస్ట్ దోశ..

Dosa Tawa: నాన్ స్టిక్ తవా కంటే ఇనుప పెనమే బెస్ట్ అంటున్న హెల్త్ ఎక్స్‌పెర్ట్స్.. వివరాలు
Dosa Tawa
Surya Kala
|

Updated on: Nov 19, 2021 | 12:51 PM

Share

Dosa Tawa: దశాబ్దాల దక్షిణ భారత వంటకాలలో ఒకటి దోశ. ఇది ఆరోగ్యకరమైన అల్పాహారం. తేలికగా జీర్ణమవుతుంది. ఇప్పుడు దోశ అనేక రకాలుగా తయారు చేస్తున్నారు. మసాలా దోశ, పేపర్ రోస్ట్ దోశ, నెయ్యి దోశ, పనీరు దోశ,  రవ్వ దోశ.. ఇలా అనేకరకాలుగా తయారు చేస్తున్నారు. దోశను చట్నీ , సాంబార్‌తో కలిపి తింటారు. అది ఏ రకమైన దోశ అయినా, దోశ తయారీకి ఇప్పుడు నాన్ స్టిక్ తవాను ఉపయోగిస్తున్నారు. కానీ ఒకప్పుడు ఇనుప పెనాన్ని ఉపయోగించేవారు. అయితే ఈరోజు ఏ రకమైన తవాతో దోశను తయారు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిదో  తెలుసుకుందాం..

ఈ రోజుల్లో ప్రతి ఇంట్లోనూ నాన్ స్టిక్ తవా సర్వసాధారణం. అయితే దోశను వేసుకోవడానికి పోషకాహరణ నిపుణులు ఇనుప పెనాన్ని సిఫార్సు చేస్తున్నారు. నిజానికి గత కొన్ని ఏళ్ల క్రితం వరకూ దోశలను వేసేవారు. అయితే ఇలా ఐరన్ పెనంపై దోశలు వేయడం కొంచెం కష్టంతో కూడుకున్న పని. దీంతో ఐరెన్ పెనాన్ని పక్కకు పెట్టి.. నాన్ స్టిక్ పాన్ వైపు దృష్టి సారించారు.  అయితే ఇలా నాన్ స్టిక్ పాన్ మీద దోశ వేయడం అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే అంటున్నారు పోషకాహార నిపుణులు. ఆరోగ్యపరంగా కాస్ట్ ఐరన్ చాలా మంచిది. ఎందుకంటే మీ ఆహారంలో ఇనుము తీసుకోవడం పెరుగుతుంది. నాన్ స్టిక్ పాన్ తయారీ సమయంలో కొన్ని రసాయనాలను ఉపయోగిస్తారు. టెఫ్లాన్ మరియు నాన్ స్టిక్ పెనాలలో టాక్సిక్ లక్షణాలు కలిగి ఉంటాయి.  వీటిలో ఉన్న కొన్ని రసాయనాలు వేడి చేసినప్పుడు ఆరోగ్యానికి హానికరమైన పదార్ధాలను విడుదల చేస్తుంది. అది మనం తినే ఆహారంలో కలుస్తాయి. హార్మోన్స్ సమతుల్యతకు కారణం అవుతాయి.

అయితే సంప్రదాయకరమైన ఇనుప పెనం మీద దోశలు వేసుకోవడం ఉత్తమని సూచిస్తున్నారు. ఇనుప పెనం మీద వేసే దోశలతో శరీరానికి కావల్సినంత ఐరన్ అందుతుంది. దీంతో ఎనీమియా వ్యాధి రాకుండా ఉంటుంది. ఇమ్యూనిటీ పెరిగేలా చేస్తుంది.  కనుక ఈజీగా దోశలు వేయవచ్చు అంటూ నాన్ స్టిక్ పాన్ ను ఉపగించడం ఇక నుంచి అయినా తగ్గించి.. కొంచెం కష్టమైనా సింపుల్ చిట్కాలను పాటిస్తూ.. ఇనుప పెనం మీద దోశలు వేసుకోవడం ఆరోగ్యానికి ఉత్తమమని అంటున్నారు.

Also Read:  ఐలాండ్‌లో పీతల దండు.. కోట్లలో రోడ్ల మీదకు వచ్చిన పీతలు.. భయాందోళనలో ప్రజలు