Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kamanchi Plant: కాలేయ సమస్యలకు చెక్ పెట్టే ఈ కలుపు మొక్క.. పేటెంట్ రైట్స్ కోసం యుఎస్ సైతం పోటీ..

Kamanchi Plant: ప్రకృతి ఇచ్చిన వరం మొక్కలు. అందం కోసం పెంచుకునే మొక్కలైనా.. పనికిరావని కలుపు మొక్కలుగా భావించే వాటిల్లోనైనా అనేక ఔషధగుణాలు ఉన్నాయి..

Kamanchi Plant: కాలేయ సమస్యలకు చెక్ పెట్టే ఈ కలుపు మొక్క.. పేటెంట్ రైట్స్ కోసం యుఎస్ సైతం పోటీ..
Kamanchi Plant
Follow us
Surya Kala

|

Updated on: Nov 19, 2021 | 7:50 AM

Kamanchi Plant: ప్రకృతి ఇచ్చిన వరం మొక్కలు. అందం కోసం పెంచుకునే మొక్కలైనా.. పనికిరావని కలుపు మొక్కలుగా భావించే వాటిల్లోనైనా అనేక ఔషధగుణాలు ఉన్నాయి.  పూర్వకాలం నుంచి సంప్రదాయం వైద్యంలో ఈ మొక్కల వేర్లు, కాండం, పువ్వులు ఆకులూ ఇలా ప్రతి భాగాన్ని ఉపయోగిస్తున్నారు. కొన్ని మొక్కలను మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం.. అయితే వీటిల్లో ఔషధగుణాలు ఉన్నయని..గానీ వాటి వలన ఆరోగ్య ప్రయోజనాల గురించి గానీ అంతగా తెలియదు. ఈరోజు గ్రామాల్లో మనం చూసే ఓ మొక్క కామంచి మొక్క. చిన్నగా, ద‌ట్టంగా పెరిగే ఓ చిన్న ఔషధ మొక్క. ఈ కూర కారంగా, చేదుగా ఉంటుంది. దీనిని అరవవారు విశేషంగా ఉపయోగిస్తారు.

ట‌మాటా జాతికి చెందిన కామంచి మొక్కని.. కామాక్షి చెట్టు అని కూడా అంటారు. చూడడానికి మిర‌ప చెట్టులా ఉంటుంది. దీని పండ్లు నలుపు రంగులో చిన్న చిన్న గా ఉంటాయి. అవి చూడడానికి చిన్న టమాటా పండ్లలా ఉంటాయి. ఈ మొక్కలో అద్భుత ఔషధగుణాలు ఉన్నాయి. క్యాన్సర్‌, కాలేయ వ్యాధుల చికిత్సకు కామంచి మొక్క (బ్లాక్‌ నైట్‌ షేడ్‌) ఆకులు ఉపయోగపడతాయని కేరళలోని తిరువనంతపురంలో ఉన్న రాజీవ్‌గాంధీ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీ (ఆర్‌జీసీబీ) శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పటికే ఈ మొక్కపై పేటెంట్ హక్కుని కూడా తీసుకున్నారు.

*కాలేయం వ్యాధుల నివారణకు కామంచి మొక్కల ఆకులు లివర్ కు టానిక్ లా పనిచేస్తాయి. ముందుగా ఈ మొక్క ఆకులను తీసుకుల నుంచి రసం తీసుకుని అందులో కొంచెం జీలకర్ర పొడి, మిర్యాల పొడి కలిపి రోజూ ఉదయాన్నే పరగడుపున తాగాల్సి ఉంది. దీంతో లివ‌ర్ వ్యర్ధాలు తొలగిపోతాయి. లివర్ శుభ్ర పడుతుంది. వ్యాధులు, దోషాలు తొలగిపోతాయి. లివ‌ర్ ఇన్ఫెక్షన్లు, కామెర్లని నివారిస్తాయి. *ఫ్యాటీ లివ‌ర్‌, ఆల్కహాల వలన డ్యామేజ్ అయినా కాలేయం.. వంటి అనేక స‌మ‌స్య‌లకు కామంచి ఆకులు చెక్ పెడతాయి. అందువులం అనిన్ రకాల కాలేయ సంబంధిత వ్యాధులకు ప్రకృతి ఇచ్చిన దివ్య ఔషధం కామంచి మొక్క. *ఈ మొక్క ఆకుల రసం యాంటీసెప్టిక్ గా ఉపయోగపడుతుంది *సీజనల్ వ్యాధులైన దగ్గు, జ్వరం, ఆస్తమా నివారణకు దివ్యౌషధం. *విరేచనకారిగాను, జీర్ణకారిగాను పనిచేస్తుంది. *కీళ్లనొప్పులు, బ్రాంకైటిస్, అల్సర్లు, అజీర్తి, నిస్సత్తువ వంటి లక్షణాలను అరికడుతుంది. *ఈ ఆకుల ర‌సాన్ని రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. వ్యాధులు రాకుండా చేస్తుంది. *తేలు కాటు వేస్తే వెంటనే కామంచి ఆకుల రసం తేలు కాటువేసిన ప్రాంతంలో అప్లై చేస్తే  విషం హరిస్తుంది. *ఈ ఆకుల రసం చర్మ సమస్యలను నివారిస్తుంది. *నోటి పూతతో ఇబ్బంది పడేవారు కామంచి పండ్లను రోజు తింటే నోటి పూత నుంచి బయటపడవచ్చు. *రేచీకటి నుంచి బయటపడడానికి ఈ మొక్కలు మంచి ఆహారం. ఈ మొక్క ఆకుల‌ను కూర‌గా వండుకుని తింటే రేచీక‌టి త‌గ్గుతుంది. *ఈ మొక్క భాగాలను నీళ్లలో కాచి వడపోసి డికాక్షన్ తాగితే గుండె జబ్బులను నివారిస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. * మూత్రం సాఫీగా జారీ అయ్యేలా ఉపయోగపడుతుంది. *ఇటీవలే కొంద‌రు భార‌తీయ సైంటిస్టులు ఈ మొక్కకు చెందిన ఆకుల్లో క్యాన్సర్ల‌ను త‌గ్గించే ఔషధ‌గుణాలు ఉన్నాయ‌ని తేల్చారు. అందుకు సంబంధించి వారు పేటెంట్ హ‌క్కుల‌ను కూడా తీసుకున్నారు. కలుపుమొక్క అని భావిస్తున్న ఈ కామంచి మొక్కలో ఉన్న ఔషధ గుణాలు ఉన్నాయి కనుక ఎక్కడ కనిపించినా వెంటనే ఇంటికి తెచ్చుకోండి.

Also Read:  ఈరోజు ఈ రాశివారు కొత్త నగలు, కొత్త పనులు కొనుగోలు చేస్తారు.. ఈరోజు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌