AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sneeze Problems: తరచుగా తుమ్ములు వస్తున్నాయా? అయితే ఇలా చేసి తుమ్ములను నియంత్రించండి..!

Sneeze Problems: తుమ్ము అనేది సర్వసాధారణం. అయితే, తుమ్ములు తరచుగా, నిరంతరంగా వస్తే అది సమస్య అయి ఉండొచ్చు. బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థ కారణంగానే తరచుగా తుమ్ములు

Sneeze Problems: తరచుగా తుమ్ములు వస్తున్నాయా? అయితే ఇలా చేసి తుమ్ములను నియంత్రించండి..!
Sneeze Problems
Shiva Prajapati
|

Updated on: Nov 18, 2021 | 10:21 PM

Share

Sneeze Problems: తుమ్ము అనేది సర్వసాధారణం. అయితే, తుమ్ములు తరచుగా, నిరంతరంగా వస్తే అది సమస్య అయి ఉండొచ్చు. బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థ కారణంగానే తరచుగా తుమ్ములు వస్తాయని నిపుణులు చెబుతుంటారు. వాస్తవానికి ముక్కులో శ్లేష్మ పొర ఉంటుంది. దీని కణజాలాలు, కణాలు చాలా సున్నితంగా ఉంటాయి. ఈ కణజాలాలు, కణాలు బయట ఏదైనా ఉత్తేజపరిచే వాసన లేదా వస్తువుతో తాకినప్పుడు తుమ్ములు మొదలవుతాయి. ఇది కాకుండా, కొన్నిసార్లు దుమ్ము, బూజు, కాంతి, వాసన, స్పైసి ఫుడ్, జలుబు మొదలైన వాటి కారణంగా కూడా తుమ్ములు వస్తాయి. అయితే, తుమ్ములను ఆపడంలో సహాయపడే కొన్ని ఇంటి నివారణల గురించి ఇప్పుడు తెలుసుకోండి..

తేనె.. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, విటమిన్లు ఎ, బి, సి, మెగ్నీషియం, ఫాస్పరస్ కలిగి ఉన్న తేనె తుమ్ముల సమస్యను తగ్గించడంలో సహాయపడే గొప్ప ఔషధం. దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలను పొందవచ్చు.

ఆవిరి పట్టాలి.. ఆవిరి పట్టడం ద్వారా కూడా ఈ సమస్యను నియంత్రించవచ్చు. ఇది చలి ప్రభావాన్ని తగ్గిస్తుంది. అలాగే ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడానికి మార్గాన్ని క్లియర్ చేస్తుంది.

విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు తినాలి.. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి విటమిన్ సి చాలా ముఖ్యం. తుమ్ము సమస్యను నివారించడంలో కూడా ఇది ప్రభావవంతంగా ఉంటుంది. విటమిన్ సి కోసం నారింజ, సీజనల్ ఫ్రూట్స్, నిమ్మ, ఉసిరి మొదలైన పుల్లని పదార్థాలు తినాలి.

పసుపు పాలు.. పసుపులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వేడి పాలలో పసుపు వేసి రోజూ తాగాలి. దీంతో తరచుగా వచ్చే తుమ్ముల సమస్యను అధిగమించవచ్చు. చలికాలంలో పచ్చి పసుపును ఉపయోగించవచ్చు.

నల్ల ఏలకులు.. నల్ల ఏలకులను రోజుకు రెండుసార్లు, మూడుసార్లు నమలడం వల్ల తుమ్ములు, అలెర్జీల నుండి గొప్ప ఉపశమనం లభిస్తుంది. ఇది కాకుండా, అల్లం, తులసి రెండూ జలుబుతో పోరాడడంలో చాలా సహాయకారిగా ఉంటాయి. అల్లం, తులసిని టీలో కలుపుకుని తీసుకోవడం వల్ల చాలా ఉపశమనం లభిస్తుంది.

యూకలిప్టస్ నూనె.. దుమ్ము, అలెర్జీల కారణంగా తుమ్మినట్లయితే యూకలిప్టస్ ఆయిల్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నీటిలో కొన్ని చుక్కలు వేసి ఆవిరి పట్టాలి. శుభ్రమైన రుమాలుతో యూకలిప్టస్ ఆయిల్‌ని వేసి వాసన పీల్చవచ్చు.

తుమ్ముల నివారణకు ఇంకా ఏం చేయాలంటే.. 1. చలికాలంలో ఎక్కువ నీరు త్రాగాలి, గోరువెచ్చని నీరు త్రాగాలి. 2. ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకోవద్దు, కొద్ది మొత్తంలో ఆహారం తీసుకోండి. 3. స్పైసీ ఫుడ్ మానుకోండి. 4. మద్యం సేవించవద్దు. 5. నాసల్ స్ప్రేని ఎప్పటికప్పుడు వాడండి . 6. మీ ఇంట్లో హ్యూమిడిఫైయర్ ఉపయోగించండి.

Also read:

Balakrishna: బాలకృష్ణ-గోపిచంద్ మలినేని సినిమా పై సరికొత్త గాసిప్.. అదెంటంటే..

India vs Pakistan: భారత్-పాకిస్థాన్ క్రికెట్‌పై పీసీబీ ఛీఫ్ కీలక వ్యాఖ్యలు.. ట్రై సిరీస్‌లు ఆడదామంటూ బీసీసీఐకి ఆఫర్..!

Digilocker: మీ ఫోన్‌లో ఈ ఒక్క యాప్‌ ఉంటే చాలు.. అన్ని డాక్యుమెంట్లు భద్రంగా దాచుకోవచ్చు..!