Red Crabs: ఐలాండ్‌లో పీతల దండు.. కోట్లలో రోడ్ల మీదకు వచ్చిన పీతలు.. భయాందోళనలో ప్రజలు

Red Crabs: ఐలాండ్‌లో లక్షలాది పీతలు వలస వెళ్తూ.. రోడ్లపైకి దండెత్తివచ్చాయి. ఒక్కసారిగా రోడ్లమీదకు వచ్చిన ఈ ఎర్ర పీతలు స్థానికులను బెంబేలెత్తించాయి. ఆస్ట్రేలియాలో..

Red Crabs: ఐలాండ్‌లో పీతల దండు.. కోట్లలో రోడ్ల మీదకు వచ్చిన పీతలు.. భయాందోళనలో ప్రజలు
Red Crabs
Follow us

|

Updated on: Nov 19, 2021 | 12:14 PM

Red Crabs: ఐలాండ్‌లో లక్షలాది పీతలు వలస వెళ్తూ.. రోడ్లపైకి దండెత్తివచ్చాయి. ఒక్కసారిగా రోడ్లమీదకు వచ్చిన ఈ ఎర్ర పీతలు స్థానికులను బెంబేలెత్తించాయి. ఆస్ట్రేలియాలో క్రిస్ మస్ ఐలాండ్ లో ఘటన చోటు చేసుకుంది.  క్రిస్ మస్ లో రోడ్లు, బ్రిడ్జిలు, పార్కులు, ఇళ్ల మీదకు పీతలు ఎగ‌బడ్డాయి. ఒక్కసారిగా ఇలా వచ్చిన పీతలను చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇళ్లను విడిచి బయటకు రావడడానికి భయపడిపోతున్నారు.  చివరకు రోడ్లను కూడా క్లోజ్ చేశారు.

అయితే ఒక్కసారిగా ఇలా ఎర్రపీతలు రోడ్డు ఎక్కడం చూసి స్థానికులనే కాదు.. ఐలాండ్ కు పర్యటనకు వచ్చిన పర్యాటకులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలా ప్రతి ఏడాది పీతలు ఇలా జనావాసాల మధ్యకు వస్తాయని స్థానికులు చెబుతున్నారు. క్రిస్‌మ‌స్ ఐలాండ్‌లో సమీపంలోని అడ‌వి నుంచి వెస్ట‌ర్న్ ఆస్ట్రేలియాలో ఉన్న నేష‌న‌ల్ పార్క్ తీరం వైపు కొన్ని వేల క్రాబ్స్ వెళ్తుంటాయి. అక్టోబర్, నవంబర్ నెలల్లో అడవుల్లో వర్షాలు కురవడం ఆగిన తర్వాత ఇలా ఈ పీతలు సముద్రంలోకి వెళ్తాయి. ఆలా వెళ్లే సమయంలో రోడ్లు, ఇల్లు, బ్రిడ్జిలు దాటుకుని వెళ్తాయి. అయితే ఈ ఏడాది ఇలా వెళ్లే పీతల సంఖ్య భారీగా ఉండడంతో అందరూ షాక్ తిన్నారు. ఈ సారి ఇలా రోడ్డుమీదకు దాదాపు 5 కోట్ల పీత‌లు వచ్చాయని అంటున్నారు. ఇవి రోడ్లు, పార్కులు, ఇళ్లు, బ్రిడ్జిల‌ను ఆక్రమించాయి. దీంతో వెంటనే స్పందించిన ప్రభుత్వం రహదారులను మూసివేసింది.  ఇవి సముద్రంవైపు ప్రయాణించే సమయంలో దారిలో దొరికే పూలు, పండ్లు, గింజలు, ఆకులు. చిన్న చిన్న క్రిములు ఇలా ఏది దొరికితే వాటిని తింటూ పయనిస్తాయి.  కోట్ల సంఖ్యలో రోడ్లమీద వెళ్తున్న పీతలను స్థానికులు.. వీడియోలు తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. మీరు కూడా ఆ ఎర్ర పీతలఫై ఓ లుక్ వేయండి మరి.

Also Read: సరదాగా మొదలు పెట్టిన అలవాటుతో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌‌ను సొంతం చేసుకున్న ఆరేళ్ళ చిన్నారి.. ఎక్కడంటే

Latest Articles
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!