World Record: సరదాగా మొదలు పెట్టిన అలవాటుతో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌‌ను సొంతం చేసుకున్న ఆరేళ్ళ చిన్నారి.. ఎక్కడంటే

Lip Balm-World Record: కొన్ని సార్లు సరదాగా మొదలు పెట్టిన పనులు.. చిన్న చిన్న హాబీలు సమాజంలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునే చేస్తాయి. అలా ఆరేళ్ళ చిన్నారి అలవాటు..

World Record: సరదాగా మొదలు పెట్టిన అలవాటుతో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌‌ను సొంతం చేసుకున్న ఆరేళ్ళ చిన్నారి.. ఎక్కడంటే
Scarlett Ashley Cheng
Follow us
Surya Kala

|

Updated on: Nov 19, 2021 | 10:56 AM

Lip Balm-World Record: కొన్ని సార్లు సరదాగా మొదలు పెట్టిన పనులు.. చిన్న చిన్న హాబీలు సమాజంలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునే చేస్తాయి. అలా ఆరేళ్ళ చిన్నారి అలవాటు ఇష్టం.. ఈరోజు గిన్నిస్ వరల్డ్‌ రికార్డును సొంతం చేసుకునేలా చేసింది. తూర్పు ఆసియా దేశాల్లో ప్రజలు కార్టూన్‌ బొమ్మలను బాగా ఇష్టపడతారు. అక్కడ కార్టూన్‌ బొమ్మల రూపంలో ఉంటే వస్తువులకు మంచి డిమాండ్‌ ఉంటుంది. చిన్న పిల్లలు మరీను. అలా ఓ చిన్నారి కార్టూన్‌ బొమ్మలను పోలి ఉన్న లిప్‌బామ్‌లను ఎంతో ఇష్టపడేది. దాంతో వాటిని తరచూ వాటిని కొనడం ఆమెకు అలవాటుగా మారిపోయింది. ఇప్పుడు ఆ చిన్నారి ఇల్లు లిప్‌బామ్‌ ఎగ్జిబిషన్‌లా మారిపోయింది.

చైనాలోని హాంగ్‌కాంగ్‌కు చెందిన ఆరేళ్ల స్కార్లెట్‌ యాష్లీచెంగ్‌ ఆరేళ్లలో 3,388 రకాల లిప్‌బామ్‌లు సేకరించి గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్ సొంతం చేసుకుంది. అయితే స్కార్లెట్‌ అన్నీ ఒకే రకం లిప్‌బామ్‌లు సేకరించలేదు. ఒక్కోటీ ఒక్కో రకం. దేనికదే ప్రత్యేకమైనవి. అంతేకాదు డిఫరెంట్ కలర్స్, టెక్చర్, షేప్, ఫ్లేవర్, ఫంక్షన్, సువాసన. అన్నీ వేటికవే డిఫరెంట్‌గా ఉంటాయి. స్కార్లెట్‌ తన సోదరి కేలిన్‌తో కలిసి…లిప్ బామ్స్ సేకరించడం మొదలుపెట్టింది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ప్రతిసారీ… కొత్త బామ్‌లు తెచ్చుకునేది. కరోనా టైమ్‌లోనూ ఈ కలెక్షన్ ఆపలేదు. ఏప్రిల్ 24, 2021లో స్కార్లెట్… ఈ గిన్నీస్ రికార్డ్ సాధించింది. ఇప్పటికీ స్కార్లెట్‌ లిప్‌బామ్‌ సేకరణ కొనసాగిస్తూనే ఉంది.

లిప్ బామ్‌లు సేకరించడం తనకు హాబీగా మారిందని, వాటిని చూడగానే తనకు ఎంతగానో నచ్చుతాయని, వాటి రుచి, ఫీల్ అన్నీ నచ్చాయని చెబుతోంది. స్కార్లెట్‌కి తొలి లిప్ బామ్‌ను ఆమె నాన్నమ్మ కొని ఇచ్చిందట. ఇక అప్పటి నుంచి కంటిన్యూగా కొనుక్కుంటోందట. ఇప్పుడు తను సేకరించిన లిప్‌బామ్‌లని చూసుకొని ఈ చిన్నారి ఎంతో సంబరపడిపోతోంది. వాటిని చూసినప్పుడల్లా ఎంతో సంతోషం కలుగుతోందట. ఇప్పుడు ఈ ఫ్యామిలీ ఇంట్లోనే సొంతంగా లిప్ బామ్‌లు తయారుచేయడం ప్రారంభించారు. వాటిని ఫ్రెండ్స్, బంధువులకు ఫ్రీగా ఇస్తున్నారు.

Also Read:  నేడు ఈశాన్య భారతంలో పాక్షికంగా చంద్రగ్రహణం.. గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే..