Pakistan Terrorism: కాశ్మీరీ మైనర్లను ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తున్న పాకిస్తాన్.. ముగ్గురు మైనర్లను పట్టుకున్న పోలీసులు!
కశ్మీర్‌లోని కుప్వారాలో నియంత్రణ రేఖను దాటేందుకు ప్రయత్నిస్తున్న ముగ్గురు మైనర్లను పోలీసులు పట్టుకున్నారు. ఈ ముగ్గురూ పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాద కమాండర్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Pakistan Terrorism: కశ్మీర్‌లోని కుప్వారాలో నియంత్రణ రేఖను దాటేందుకు ప్రయత్నిస్తున్న ముగ్గురు మైనర్లను పోలీసులు పట్టుకున్నారు. ఈ ముగ్గురూ పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాద కమాండర్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఒక నిర్దిష్ట సమాచారం తర్వాత, పోలీసులు కుప్వారాలోని రహస్య స్థావరం నుండి ముగ్గురిని పట్టుకున్నారని ఎస్ఎస్పీ మన్హాస్ తెలిపారు. దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాకు చెందిన ముగ్గురు బాలురును ఒక ఉగ్రవాద కమాండర్ సంప్రదించినట్లు ఆయన చెప్పారు. అతను తనను తాను పాకిస్తాన్‌లో చురుకైన టైబ్ ఫరూఖీగా అభివర్ణించుకునేవాడు. ముగ్గురూ అతన్ని కలవడానికి, శిక్షణ తీసుకోవడానికి కుప్వారా మీదుగా నియంత్రణ రేఖను దాటడానికి వెళుతున్నారు. అక్కడ శిక్షణతో పాటు ఆయుధాలతో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేందుకు వారిని తిరిగి కాశ్మీర్‌కు పంపించాల్సి ఉంది.
ముగ్గురూ కుటుంబానికి అప్పగింత..
విచారణలో, దక్షిణ కాశ్మీర్‌కు చెందిన ఈ యువకులు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా రాడికలైజేషన్ వైపు ప్రేరేపించినట్లు పోలీసులకు తెలిసింది. ఈ కారణంగా వారు హింసా మార్గంలో వెళ్లేందుకు అంగీకరించారు. ఈ అబ్బాయిల పరిస్థితి, చిన్న వయస్సును చూసి, జమ్మూ కాశ్మీర్ పోలీసులు వారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ముగ్గురు అబ్బాయిల తల్లిదండ్రులను పిలిపించి చర్చల అనంతరం యువకులను వారికి అప్పగించినట్లు ఎస్‌ఎస్పీ తెలిపారు.
జమ్మూ కాశ్మీర్‌లో సైన్యం నిర్వహిస్తున్న ఆపరేషన్ ఆలౌట్, భద్రతా బలగాల ఆపరేషన్ ఆల్ అవుట్ కొనసాగుతోంది. బుధవారం నాడు రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో టిఆర్‌ఎఫ్ కమాండర్ సహా ఐదుగురు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. ఈ రెండు ఎన్‌కౌంటర్‌లు కశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో జరిగాయి. చనిపోయిన టీఆర్ఎఫ్ కమాండర్ పేరు అఫాక్ సికిందర్.
ఇవి కూడా చదవండి: PM Modi on Crypto Currency: క్రిప్టో కరెన్సీపై ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు!
Rice in Telangana: బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయబోం.. ఎందుకో వివరించిన కేంద్రం