Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Taliban in Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ లో పిల్లలకు ఏమి నేర్పిస్తున్నారో తెలిస్తే షాకే.. ఎందుకంటే..?

తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకుని 100 రోజులు పూర్తి అవుతున్నాయి. ఇప్పుడు అక్కడి పరిస్థితి గందరగోళంగా ఉంది. ముఖ్యంగా అక్కడి దక్షిణ హెల్మండ్ ప్రావిన్స్‌లో, నాద్-ఎ-అలీతో సహా అనేక గ్రామాలు ఉన్నాయి.

Taliban in Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ లో పిల్లలకు ఏమి నేర్పిస్తున్నారో తెలిస్తే షాకే.. ఎందుకంటే..?
Afghanistan
Follow us
KVD Varma

|

Updated on: Nov 19, 2021 | 9:49 AM

Taliban in Afghanistan: తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకుని 100 రోజులు పూర్తి అవుతున్నాయి. ఇప్పుడు అక్కడి పరిస్థితి గందరగోళంగా ఉంది. ముఖ్యంగా అక్కడి దక్షిణ హెల్మండ్ ప్రావిన్స్‌లో, నాద్-ఎ-అలీతో సహా అనేక గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ పిల్లలు చదువుకు బదులుగా ప్రాణాలను రక్షించే విద్యను నేర్చుకుంటున్నారు. వారికి ఆయుధాలు, క్షిపణి భాగాలు, ల్యాండ్ మైన్‌లను గుర్తించడం నేర్పుతున్నారు. నిజానికి ఇక్కడి ప్రజలు తాలిబన్లతో చివరి వరకు పోరాడారు. తాలిబాన్లు ఆ గ్రామాలను తమ ఆధీనంలోకి తీసుకున్నపుడు, ఇక్కడి కుటుంబాలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి గ్రామం నుండి పారిపోయారు.

ఇప్పుడు వారు తిరిగి తమ గ్రామాల్లోకి వస్తున్నారు. ప్రస్తుతం ఆ గ్రామాల్లోని పాఠశాల-ఇళ్లు మోర్టార్లు..బుల్లెట్లతో నిండిపోయాయి. ఇళ్లు శిథిలావస్థలో ఉన్నాయి. ప్రజలు ఈ శిథిలాలలో నివసించవలసి వస్తుంది. తాలిబన్ యోధులు పొలాలు, మార్గాల్లో మందుపాతరలు వేసి ఉండవచ్చని వారు అనుమానిస్తున్నారు. అందుకోసం భూమిలో పాతిపెట్టిన మందుపాతరలు, పేలుడు పదార్థాల అవశేషాలను అన్వేషిస్తున్నారు. మైదానాలు లేదా దారులలో పడి ఉన్న ఈ గనుల పట్టులో పిల్లలు, మహిళలు పడకుండా, వారికి ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేస్తున్నారు. ప్రతి ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశోధిస్తున్న గ్రామాల ప్రజలు తమ పిల్లలను రక్షించుకోవడం కోసం వారికి ఆయుధ సంబంధిత శిక్షణ ఇస్తున్నారు. ఇందులో లేండ్ మైన్ అనుమానం వస్తే ఏమి చేయాలి. క్షిపణి శిధిలాలు కనిపిస్తే వాటికి దూరంగా ఎలా జరగాలి.. బుల్లెట్లకు సంబంధించిన అవశేషాలు చూసినపుడు వాటి విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలను వారికి నేర్పిస్తున్నారు. పలకా బలపం పట్టాల్సిన చేతులు ఇప్పుడు యుద్ద సామగ్రీ అవశేషాల గురించి నేర్చుకున్తున్నాయి ఆఫ్ఘనిస్తాన్ లో.

సోదాలు జరిపిన ప్రాంతాలన్నీ తెలుపు-ఎరుపు రాళ్లతో మార్కింగ్ చేస్తున్నారు. తెలుపు అంటే ఆ ప్రదేశం సురక్షితం. కాగా.. ఇక్కడ మందుపాతరలు ఉన్నాయని ఎరుపు రంగు గుర్తులు సూచిస్తున్నాయి. 1988 నుంచి ఇప్పటివరకు ఈ మందుపాతరలు, పేలని పేలుడు పదార్థాల వల్ల 41 వేల మంది ఆఫ్ఘనిస్తాన్ లో ప్రాణాలు కోల్పోయారు.

ఇవి కూడా చదవండి: PM Modi on Crypto Currency: క్రిప్టో కరెన్సీపై ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు!

Rice in Telangana: బాయిల్డ్‌ రైస్‌ కొనుగోలు చేయబోం.. ఎందుకో వివరించిన కేంద్రం