Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rice in Telangana: బాయిల్డ్‌ రైస్‌ కొనుగోలు చేయబోం.. ఎందుకో వివరించిన కేంద్రం

ఓవైపు TRS మహాధర్నా చేస్తుండగానే.. తెలంగాణలో బియ్యం కొనుగోలుపై స్పష్టత ఇచ్చింది కేంద్రం. బాయిల్డ్‌ రైస్‌ కొనుగోలు చేయబోమని స్పష్టం చేసింది..

Rice in Telangana: బాయిల్డ్‌ రైస్‌ కొనుగోలు చేయబోం.. ఎందుకో వివరించిన కేంద్రం
Paddy Procurement
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 18, 2021 | 6:03 PM

ఓవైపు TRS మహాధర్నా చేస్తుండగానే.. తెలంగాణలో బియ్యం కొనుగోలుపై స్పష్టత ఇచ్చింది కేంద్రం. బాయిల్డ్‌ రైస్‌ కొనుగోలు చేయబోమని స్పష్టం చేసింది..ఈ సీజన్‌లో 60 లక్షల టన్నుల ధాన్యం సేకరించేందుకు ఇప్పటికే అంగీకారం తెలిపామని చెప్పింది. గతంలో 44.7 లక్షల మెట్రిక్‌ టన్నుల బాయిల్డ్‌ రైస్‌ కొనుగోలు చేస్తామని చెప్పినట్లు వెల్లడించింది. ఇకపై బాయిల్డ్‌ రైస్‌ సేకరణ కుదరదని అప్పుడే చెప్పినట్లు గుర్తుచేసింది. అందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా అంగీకరించిందంటూ ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో పారా బాయిల్డ్ రైస్‌కు డిమాండ్ లేదు. ఈ తరహా రైస్‌ వినియోగించే రాష్ట్రాలు స్వయంగా సమకూర్చుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇకపై బాయిల్డ్ రైస్ సేకరణ కుదరదని ఇప్పటికే తెలంగాణకు చెప్పామని.. అందుకు ప్రభుత్వం కూడా అంగీకరించిందని స్పష్టం చేసింది. సీఎం కేసీఆర్‌ మహాధర్నా చేపట్టిన కొద్ది గంటల్లోనే కేంద్రం రిప్లయ్ ఇవ్వడం హాట్‌ టాపిక్‌గా మారింది.

సీఎం కేసీఆర్‌ రాసిన లేఖపై స్పందించిన కేంద్రం.. బాయిల్డ్ రైస్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోబోమని స్పష్టం చేసింది. యాసంగి పంట ధాన్యం కూడా పరిమితంగానే కొంటామని పేర్కొంది. రబీ పంట సేకరణకు సంబంధించి రాష్ట్రాలతో చర్చించిన తర్వాత.. వచ్చే ఏడాది ఎంత సేకరించాలో నిర్ణయం తీసుకుంటామని క్లారిటీ ఇచ్చింది. దేశంలో నిల్వలు సరిపడా ఉన్నాయని.. అవకాశం ఉన్నంత వరకు ఎగుమతి చేయడానికి ఉన్న అవకాశాలను పరిగణనలోకి తీసుకుంటున్నామని కేంద్రం వివరణ ఇచ్చింది.

పంజాబ్‌లో వరి వినియోగం అంతగా ఉండదని అందుకే 90శాతం ధాన్యం సేకరిస్తున్నామని వివరించింది. దేశ అవసరాలకు మించి వరి, గోధుమ సాగవుతోందని.. పంట మార్పిడి అనివార్యమని తేల్చిచెప్పింది కేంద్రం.

ప్రధాని మోడీకి తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్న లేఖాస్త్రం

ప్రధాని మోడీకి తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్న లేఖాస్త్రం సంధించారు. ధాన్యం కొనుగోలుపై FCI కి ఆదేశాలివ్వాలని విఙ్ఞప్తి చేశారు. అలాగే రబీలో మిగిలిన ధాన్యం కొనుగోలు చేయాలని విన్నవించారు. పంజాబ్ త‌ర‌హాలో తెలంగాణ‌లో కూడా ధాన్యం సేక‌ర‌ణ చేప‌ట్టాల‌న్నారు. వ‌చ్చే ర‌బీలో రాష్ట్రం నుంచి ఎంత ధాన్యం కొంటారో స్పష్టం చేయాలన్నారు. ఏటా ఉత్పత్తి పెరుగుతున్నా.. సేక‌రించే మొత్తం పెర‌గ‌ట్లేదని లేఖలో పేర్కొన్నారు సీఎం కేసీఆర్.

పంట మార్పిడి అంటే..

వ్యవసాయంలో పంట మార్పిండి అనే చాలా కీలకం. పంట దిగుబడి సాధించేందుకు ‘పంట మార్పిడి అనే విధానాన్ని పాటిస్తారు శాస్త్రీయంగా అనుసరిస్తున్నారు దేశంలోని అన్నదాత. ఇది చాలా సంవత్సరాలుగా సంప్రదాయంగా వస్తున్నదే. అసలు పంటమార్పిడి అంటే .. సాధారణంగా అధిక నీటి వినియోగంతో పండే పంటలైన వరి, చెరకు, గోధుమ వంటి పంటలను వేస్తుంటారు. అధిక నేలసారాన్ని కోరుకునే పంటలు వేసిన తర్వాత.. నేల తన సారాన్ని ఎంతో కొంత కోల్పోతుంది.

ఆ సారమే పంట దిగుబడి రూపంలో లాభిస్తుంది. వెంటనే అదే పంటను వేసినట్లయితే నేలలో అదే విధమైన రెండో పంటకు సరిపడినంత సారం లేకపోవడం వల్ల దిగుబడి తగ్గుతుంది. సాధారణంగా వరి, చెరకు వంటి పంటల్ని వేశాక రెండో పంటగా పెసర్లు, వేరుశెనగ వంటివి పండిస్తుంటారు రైతులు.

ఈ పంటలకు వరి, చెరకుకు కావలసినంత సారం, నీరు అవసరం ఉండదు. పైగా ఇవి వేళ్లలో ఉండే రైజోబియం అనే బాక్టీరియా ద్వారా గాలిలో ఉన్న నత్రజనిని నత్రజని సమ్మేళనాలుగా మార్చి నేలను మళ్లీ సారవంతం మార్చుతాయి.

అటు పంట ఫలంతో పాటు నేల సారం కూడా పెరుగుతుంది. కొన్నిసార్లు మొదటి పంట తర్వాత ఫలాన్ని ఇవ్వని పశుగ్రాసాన్ని పండిస్తారు. అలా పండిన దానిని పై భాగాన్ని తీసివేసి దున్నినపుడు నేల సారవంతం అవుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు ఇదే వెల్లడించింది. పంట మార్పిడి చేయండం వల్ల రైతుల రాజుగా మారుతాడని.

ఇవి కూడా చదవండి: CM KCR Maha Dharna Live: ముగిసిన టీఆర్‌ఎస్‌ మహా ధర్న.. పార్టీ నాయకులతో రాజ్‌ భవన్‌కు బయలు దేరిన సీఎం కేసీఆర్‌..

IND vs NZ: ఇండియన్‌ ఓపెనర్ల తడాఖా.. ఖాతాలోకి సరికొత్త రికార్డ్‌.. ఏంటంటే..?