Viral Video: సీఎంను మెప్పించిన చిన్నారుల డ్యాన్స్.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో..
చిన్నారులు ఏ పనిచేసినా చూడముచ్చటగా ఉంటుంది. వారి మోములో స్వచ్ఛమైన చిరునవ్వును చూస్తుంటే ఎలాంటి సమస్యలనైనా ఇట్టే మర్చిపోతుంటాం...

చిన్నారులు ఏ పనిచేసినా చూడముచ్చటగా ఉంటుంది. వారి మోములో స్వచ్ఛమైన చిరునవ్వును చూస్తుంటే ఎలాంటి సమస్యలనైనా ఇట్టే మర్చిపోతుంటాం. అందుకే చాలామంది చిన్నారులతో గడిపేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని సజోలాంగ్ తెగకు చెందిన కొందరు చిన్నారులు జానపద పాటలకు ఎంతో అద్భుతంగా డ్యాన్స్ చేశారు. అందరూ తమవైపు చూస్తున్నా ఏ మాత్రం తొణకకుండా మరింత ఉత్సాహంతో కాలు కదిపారు. చిన్నారుల డ్యాన్స్ అక్కడి వారినే కాదు ఏకంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూనే మెప్పించింది. అందుకే సోషల్ మీడియాలో ఆ పిల్లల డ్యాన్స వీడియోని పంచుకుని మురిసిపోయారు.
ఇదే మా రంగురంగుల జీవితం.. ‘ఇది మా అరుణాచలం. మా జీవితాలు కూడా ఇలాగే రంగురంగులు, ఉత్సాహం, ఉల్లాసంతో నిండి ఉంటాయి. వెస్ట్ కమెంగ్ జిల్లాలోని ఖాజాలాంగ్ గ్రామానికి చెందిన ఈ పిల్లలు జానపద పాటలకు ఎంతో అద్భుతంగా డ్యాన్స్ చేశారు’ అంటూ అరుణాచల్ ప్రదేశ్ టూరిజం, ఇన్‌క్రెడిబుల్ ఇండియా ట్యాగ్ చేస్తూ సీఎం ట్వి్ట్టర్‌లో రాసుకొచ్చారు. ఈ వీడియోలో రంగురంగుల దుస్తులు ధరించిన చిన్నారులు, జానపద పాటలకు ఎంతో ఉల్లాసంగా కాలు కదపడం మనం చూడవచ్చు.
This is our Arunachal…
Colourful, happy, cheerful with full of life and energy.
A traditional merrymaking dance by sweet and charming #Sajolang children of Khazalang village in West Kameng district. @incredibleindia @MDoNER_India @MinOfCultureGoI @tourismgoi @ArunachalTsm pic.twitter.com/d6elJz4Z0O
— Pema Khandu པདྨ་མཁའ་འགྲོ་། (@PemaKhanduBJP) November 17, 2021
Also Read:
Viral Video: నాకేదీ అడ్డు.. ఇనుప కంచె మీదుగా చాకచక్యంగా దూకిన ఏనుగు.. వైరల్‌గా మారిన వీడియో..
Mysterious Fish: 555 పదునైన పళ్లు.. ఈ రాకాసి చేప యమ డేంజర్.. చూస్తే షాకవుతారు..