Mysterious Fish: 555 పదునైన పళ్లు.. ఈ రాకాసి చేప యమ డేంజర్.. చూస్తే షాకవుతారు..
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో 'సక్కర్ మౌత్ క్యాట్ ఫిష్' అనబడే ఓ రాకాసి చేప మత్స్యకారుల వలకు చిక్కిన సంగతి తెలిసిందే

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో ‘సక్కర్ మౌత్ క్యాట్ ఫిష్’ అనబడే ఓ రాకాసి చేప మత్స్యకారుల వలకు చిక్కిన సంగతి తెలిసిందే. భారీ బరువు, వింతైన ఆకారంలో ఉండే ఈ చేపను వారు దెయ్యం చేపగా అభివర్ణించారు. ఇప్పుడు అంతకంటే భయంకరమైన చేప పసిఫిక్ మహా సముద్రం ఒడ్డున మత్స్యకారులకు చిక్కింది. ఈ చేపనోట్లో ఏకంగా 555 పదునైన పళ్లు ఉన్నాయి. దీంతో చేపను వలవేసి పట్టుకున్న జాలర్లు షాక్‌కు గురయ్యారు. ఈ చేప అరుదైన పసిఫిక్ లింగ్‌కాడ్ జాతికి చెందినదని, ఉత్తర పసిఫిక్ తీరంలో ఎక్కువగా ఈ చేపలు కనిపిస్తుంటాయని జాలర్లు చెబుతున్నారు. ఈ చేపల దంతాలు వేగంగా పెరుగుతాయని, అదే సమయంలో వేగంగా ఊడిపోతాయని వారు తెలిపారు. కొన్ని సందర్భాల్లో ఒక చేపకు రోజుకు 20 దంతాల వరకు ఊడిపోతాయంటున్నారు. ఇక ప్రస్తుతం దొరికిన చేప 36 కిలోగ్రామలు బరువుంటుందని జాలర్లు అంటున్నారు.
రంపపు పళ్లను తలపిస్తూ... ఈ వింతైన చేప దంతాలపై యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌లోని జీవశాస్త్రం విభాగానికి చెందిన కార్లీ కోహెన్, ఎమిలీ కార్ సంయుక్తంగా పరిశోధనలు నిర్వహించారు. ఇందులో పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఈ పసిఫిక్ లింగ్‌కాడ్ జాతి చేపలు యుక్త వయస్సులో 50 సెంటీమీటర్ల వరకు పెరుగుతాయట. కొన్ని చేపలు 1.5 మీటర్లు పొడవు కూడా పెరుగుతాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇక చేప లోపలి భాగంలో సూక్ష్మ దంతాలు ఉంటాయని, ఇవి రంపపు పళ్ల వలే ఎంతో పదునుగా ఉన్నాయంటున్నారు. ఇలాంటి పదునైన దంతాలు ఉండే చేపలకు రెండు జతల దవడలు ఉంటాయని, వీటిని ఫారింజియల్ దవడలు అని పిలుస్తారని రీసెర్చర్స్ పేర్కొన్నారు. కాగా పసిఫిక్ మహా సముద్ర తీరంలో దొరికిన చేప దంతాలు చాలా సూక్ష్మంగా ఉన్నాయని, మైక్రోస్కోప్ సహాయంతో వాటిని గుర్తించామంటున్నారు. ‘పసిఫిక్ ఒడ్డున బయటపడ్డ వింతైన చేపలోని దంతాలను గుర్తించేందుకు చాలా కష్టపడ్డాం. ఆ దంతాలు అతి సూక్ష్మంగా ఉండటంతో ఒక చీకటి గదిలో కూర్చొని మైక్రోస్కోప్ సహాయంతో చేప పళ్లను లెక్కించాం’ అని కార్లీ కోహెన్ పేర్కొన్నారు. కాగా చేపలకు ఆహారం ఇవ్వడం వల్ల దంతాల మార్పిడిలో ఎలాంటి పెరుగుదల కనిపించలేదని, ఈ చేప దంతాలు ఇంకా మిస్టరీ గానే ఉన్నాయని పరిశోధకులు చెప్పుకొచ్చారు.
Also Read:
Viral Video: ఆవు పేడను తింటోన్న ఎంబీబీఎస్ డాక్టర్.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..
40 ఏళ్లుగా అడవిలో ఒంటరిగా జీవిస్తున్నాడు..ఎందుకంటే..? కారణం తెలిసి చలించిపోతున్న నెటిజన్లు..(వీడియో)