Super Bear video: సూపర్ క్యాచ్‌లతో క్రికెటర్లకే షాకిస్తున్న ఎలుగుబంటి..! నెట్టింట హల్‌చల్ చేస్తున్న వీడియో
సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ప్రపంచం చాలా చిన్నదై పోయింది. ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్నది సంఘటన జరిగినా.. క్షణాల్లో ప్రపంచం మొత్తం వ్యాపిస్తోంది. ఇందుకు ఉదాహరణే నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలు. తాజాగా ఎలుగుబంటికి సంబంధించిన వీడియో...
సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ప్రపంచం చాలా చిన్నదై పోయింది. ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్నది సంఘటన జరిగినా.. క్షణాల్లో ప్రపంచం మొత్తం వ్యాపిస్తోంది. ఇందుకు ఉదాహరణే నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలు. తాజాగా ఎలుగుబంటికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. క్రికెట్ ఆడుతున్నప్పుడు ప్లేయర్స్ ఎన్నో అద్భుతమైన క్యాచ్ లను పట్టడం చూసాం.. ఎంజాయ్ చేసాం. అయితే ఇక్కడ ఓ ఎలుగు బంటి మీకన్నా నేనేం తక్కువ కాదంటూ తన అద్భుతమైన క్యాచ్ లతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఈవీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
జూ లో జంతువులను చూడటానికి వెళ్ళినప్పుడు మనం వాటికి ఆహారాన్ని, ఏదైనా తినే పదార్ధాలను అందిస్తూ ఉంటాం. ఇక్కడ కూడా ఓ ఎలుగుబంటిని చూడటానికి కొంతమంది పర్యాటకులు వచ్చారు. కారులో ఉండి ఆ ఎలుగుబంటిని చూస్తూ దానికి బ్రెడ్ ను ఇవ్వడానికి ట్రై చేశారు. ఒకొక్క బ్రెడ్ పీస్‌ను ఎలుగు బంటి వైపు విసిరారు.. వాళ్ళు విసిరిన బ్రెడ్ ను ఆ ఎలుగుబంటి ఎంతో చాకచక్యంగా క్యాచ్ పట్టుకుంటూ తింటోంది. వాళ్లు అలా విసిరినప్పుడు నోటితో కొన్ని.. చేత్తో కొన్ని పట్టుకుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో పాతదే అయినప్పటికీ మరో సారి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ వీడియోను నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మరి మీరూ ఓ లుక్కేయండి.
మరిన్ని చూడండి ఇక్కడ:
jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..