AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hen fight with Dog: కోడి పిల్లలపైకి దూసుకొచ్చిన కుక్క.. శునకాన్ని తరిమి తరిమి ఉరికించిన కోడి.. వైరల్‌ వీడియో

Hen fight with Dog: కోడి పిల్లలపైకి దూసుకొచ్చిన కుక్క.. శునకాన్ని తరిమి తరిమి ఉరికించిన కోడి.. వైరల్‌ వీడియో

Anil kumar poka
|

Updated on: Nov 18, 2021 | 9:47 AM

Share

ఈ ప్రపంచంలో ఏ కల్మషం లేనిది ఏదైనా ఉంది అంటే అది తల్లి ప్రేమ మాత్రమే. తాను ఎలా ఉన్నా తన బిడ్డ సంతోషంగా ఉండాలని ప్రతి తల్లీ ఆలోచిస్తుంది. బిడ్డ సంరక్షణ కోసం ఎంతదూరమైనా వెళుతుంది..


ఈ ప్రపంచంలో ఏ కల్మషం లేనిది ఏదైనా ఉంది అంటే అది తల్లి ప్రేమ మాత్రమే. తాను ఎలా ఉన్నా తన బిడ్డ సంతోషంగా ఉండాలని ప్రతి తల్లీ ఆలోచిస్తుంది. బిడ్డ సంరక్షణ కోసం ఎంతదూరమైనా వెళుతుంది.. ఎవరితోనైనా పోరాడుతుంది. ఇది కేవలం మనుషుల్లోనే కాదు పశుపక్ష్యాదుల్లోనూ ఉంటుంది. ఈ కోవకు చెందిన వీడియో ఒకటి తాజాగా నెట్టింట్లో వైరల్‌ అవుతోంది.

ఈ వీడియోలో ఓ కోడి తన పిల్లలను తీసుకొని షెడ్డు నుంచి బయటకు వచ్చింది. అదే సమయంలో ఓ శునకం కోడి పిల్లలపైకి దూసుకొచ్చింది. దీంతో ఒక్కసారిగా అలర్ట్‌ అయిన తల్లి కోడి ఆ శునకంపైకి దాడి చేసింది. శునకాన్ని తరిమి, తరిమి ఉరికించింది. తన పిల్లలు సేఫ్‌ అనుకునేంత దూరం వరకు కుక్కను తరిమి కొట్టింది. అద్భుతమైన ఈ సంఘటనను అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది. తల్లి ప్రేమకు ప్రతిరూపంగా ఉన్న ఈ వీడియోను నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. కుక్కపై కోడి చూపిన ప్రతాపానికి ఫిదా అవుతున్నారు. రకరకాల కామెంట్లతో లైక్‌ చేస్తున్నారు. ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
మరిన్ని చూడండి ఇక్కడ:

Icon Star Allu Arjun Pushpa: సోషల్ మీడియాలో పుష్పరాజ్ సందడి.. ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్ పుష్ప లుక్స్..

jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..

Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..