40 ఏళ్లుగా అడవిలో ఒంటరిగా జీవిస్తున్నాడు..ఎందుకంటే..? కారణం తెలిసి చలించిపోతున్న నెటిజన్లు..(వీడియో)

40 ఏళ్లుగా అడవిలో ఒంటరిగా జీవిస్తున్నాడు..ఎందుకంటే..? కారణం తెలిసి చలించిపోతున్న నెటిజన్లు..(వీడియో)

Anil kumar poka

|

Updated on: Nov 18, 2021 | 9:56 AM

ప్రపపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్న వేళ.. లాక్‌డౌన్‌ విధిస్తే కేవలం కొద్దిరోజులు ఇళ్లలో ఉండలేకపోయారు జనం. అదో పెద్ద జైలులా ఫీలయ్యారు. కానీ ఓ వ్యక్తి నలభై ఏళ్లుగా అన్నీ వదిలి ఒంటరిగా అడవిలో జీవిస్తున్నాడు.

ప్రపపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్న వేళ.. లాక్‌డౌన్‌ విధిస్తే కేవలం కొద్దిరోజులు ఇళ్లలో ఉండలేకపోయారు జనం. అదో పెద్ద జైలులా ఫీలయ్యారు. కానీ ఓ వ్యక్తి నలభై ఏళ్లుగా అన్నీ వదిలి ఒంటరిగా అడవిలో జీవిస్తున్నాడు. అతని ఒంటరి జీవితం వెనుక ఓ పెద్ద కారణం ఉంది. అదేంటో తెలుసుకుందాం…
డెర్బీషైర్‌కు చెందిన కెన్‌ అనే వ్యక్తి తన 15వ ఏటనుంచే జీవన పోరాటం మొదలు పెట్టాడు. బ్రతకడానికి అనేక పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి 26వ ఏట కెన్‌పై దోపిడీ దొంగలు దాడిచేశారు. ఈ దాడిలో కెన్‌ తీవ్రంగా గాయపడటమే కాదు.. 23 రోజులపాటు స్పృహలేకుండా ఉన్నాడు. ఇక ఇతను కోలుకోవడం అసాధ్యం అనే అనుకున్నారు అందరూ. కానీ వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ కెన్‌ అతి త్వరగా కోలుకొని తిరిగి పూర్వపు జీవితాన్ని ప్రారంభించాడు. కానీ ఇదే సమయంలో అతని తల్లిదండ్రులు మరణించడంలో కెన్‌ మరింత కుంగి పోయాడు. ఈ విషాదం నుంచి కోలుకోవడానికి అతనికి చాలా సమయం పట్టింది. తల్లిదండ్రులు మరణంతో ఒంటరిగా మిగిలిపోయిన కెన్‌ ఇక ఈ మనుషులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అలా అడవిబాట పట్టిన అతను 22 వేళ మైళ్లు నడిచాడు.

అలా అడవి బాట పట్టిన కెన్‌ 22 వేల మైళ్లు నడిచి అతడు స్కాట్లాండ్‌ లోని లోచ్‌ ప్రాంతానికి చేరుకుని అక్కడే కలపతో ఒక ఇల్లు నిర్మించుకున్నాడు. 40 ఏళ్లుగా ఒక్కడే.. ఆ చిన్న గదిలో నివసిస్తున్నాడు. గ్యాస్‌, కరెంట్‌ వంటి సదుపాయాలు లేవు. చేపలు పట్టడం, కూరగాయలు, బెర్రీస్‌ పండిచి వాటిని ఆహారంగా తీసుకుంటున్నాడు. అలా అడవిలో జీవిస్తున్న కెన్‌ 2019లో స్ట్రోక్‌కు గురయ్యాడు. అయితే అతడి వద్ద ఉన్న జీపీఎస్‌ లోకేటర్‌ టెక్సాస్‌, హస్టన్‌లో ఉన్న రెస్పాన్స్‌ కేంద్రానికి ఎస్‌ఓఎస్‌ పంపడంతో కెన్‌ పరిస్థితి గురించి వారికి తెలిసింది. వారు ఈ విషయాన్ని వెంటనే యూకేలోని కోస్ట్‌గార్డ్‌కు తెలియజేశారు. వారు వెంటనే కెన్‌ను ఫోర్ట్ విలియమ్‌లోని ఆసుపత్రికి విమానంలో తరలించారు. అక్కడ అతను కోలుకోవడానికి ఏడు వారాలు పట్టింది. వైద్యులు అతడిని జనవాసంలో ఉండాలని చెప్పినా.. తనకు అక్కడే హాయిగా ఉందంటూ మళ్లీ అడవికి వెళ్లిపోయాడు కెన్‌.

మరిన్ని చూడండి ఇక్కడ:

Icon Star Allu Arjun Pushpa: సోషల్ మీడియాలో పుష్పరాజ్ సందడి.. ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్ పుష్ప లుక్స్..

jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..

Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Published on: Nov 18, 2021 09:51 AM