AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఆవు పేడను తింటోన్న ఎంబీబీఎస్‌ డాక్టర్‌.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..

గో మూత్రం ఆరోగ్యానికి చాలా మంచిదని, అందులో పొట్టను శుద్ధిచేసే సుగుణాలు ఉంటాయని చాలామంది చెబుతారు..

Viral Video: ఆవు పేడను తింటోన్న ఎంబీబీఎస్‌ డాక్టర్‌.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..
Basha Shek
|

Updated on: Nov 18, 2021 | 11:39 AM

Share

గో మూత్రం ఆరోగ్యానికి చాలా మంచిదని, అందులో పొట్టను శుద్ధిచేసే సుగుణాలు ఉంటాయని చాలామంది చెబుతారు. అందుకు తగ్గట్లే ఇటీవల కొందరు గోమూత్రం తాగడం మనం చూశా. అదేవిధంగా ఆవు పేడతో కూడా ఎన్నో లాభాలున్నాయని, చాలా రోగాలను నయం చేసే గుణాలు ఇందులో ఉంటాయని కొందరు నమ్ముతారు. అయితే గోమూత్రం, ఆవుపేడ గురించి పురాణాల్లో లేదా ఎవరో ఒకరు చెప్పడమో కానీ వాటికి తగిన ఆధారాలు లేవు. ఈ నేపథ్యంలో సాక్ష్యాత్తూ ఎంబీబీఎస్‌ పట్టా పుచ్చుకుని, ఎండీ పూర్తి చేసిన ఓ డాక్టర్ గోమూత్రం, ఆవు పేడను తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. అంతేకాదు అది నిజమని నిరూపించేందుకు తానే ఆవు పేడ తిని చూపిస్తున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు డాక్టర్‌ మనోజ్ మిట్టల్‌. అతని ట్విటర్ ప్రొఫెల్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. అతను హర్యానాలోని కర్నాల్‌లో చిల్ర్డన్‌ స్పెషలిస్ట్ డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.. ఇక వీడియో చూసినట్లయితే గోశాలలో కింద పడి ఉన్న ఆవు పేడను చేతిలోకి తీసుకున్న మనోజ్‌.. మరో చేత్తో దానిని తినడం మనం చూడొచ్చు. ఈ సందర్భంగా గోమూత్రం, ఆవు పేడను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా అతను వివరించారు. స్మార్ట్‌ఫోన్లు, ఏసీలు, ఫ్రిజ్‌ల నుంచి వెలువడే రేడియేషన్‌ క్యాన్సర్‌కు దారి తీస్తుంది. ఆవు పేడ తీసుకోడం వల్ల శరీరంపై రేడియేషన్‌ ప్రభావాన్ని తగ్గించవచ్చని మనోజ్‌ చెబుతున్నారు. గర్భిణులు దీనిని తీసుకుంటే సుఖ ప్రసవం జరుగుతుందని, ఎలాంటి సమస్యలు తలెత్తవని సూచించాడు. తాను ఎప్పుడూ నేలపైనే నిద్రపోతానని, తన గదిలో ఏసీలు ఉండవని డాక్టర్‌ పేర్కొన్నారు. ఆవు పేడలో 28 శాతం ఆక్సిజన్‌ ఉంటుందని, ఇది శరీరాన్ని, మనసును శుద్ధి చేస్తుందంటున్నాడు. అందుకే తాను ఆరోగ్యంగా ఉన్నానని ఆ డాక్టర్‌ చెప్పుకొచ్చారు. కాగా ఈ వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. అతని మెడికల్‌ డిగ్రీ నకిలీదని, మెడికల్‌ కౌన్సిల్‌ మనోజ్‌పై చర్యలు తీసుకోవాలని కొందరు కామెంట్లు చేస్తుండగా. మరికొందరు ఆవుపేడతో ప్రయోజనాలున్నాయంటూ డాక్టర్‌ నిర్ణయంతో ఏకీభవిస్తున్నారు.

Also Read:

KTR Helping Photos: రియల్ హీరో అనిపించుకుంటున్న కేటీఆర్.. దగ్గరుండి మరీ రోడ్డుప్రమాదంకు గురైన విద్యార్థులకు..(ఫొటోస్)

40 ఏళ్లుగా అడవిలో ఒంటరిగా జీవిస్తున్నాడు..ఎందుకంటే..? కారణం తెలిసి చలించిపోతున్న నెటిజన్లు..(వీడియో)

Super Bear video: సూపర్‌ క్యాచ్‌లతో క్రికెటర్లకే షాకిస్తున్న ఎలుగుబంటి..! నెట్టింట హల్‌చల్‌ చేస్తున్న వీడియో