New Rules: దేశ ప్రజలకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఇవాల్టి నుంచి 6 కీలక మార్పులు ఇవిగో..
నవంబర్ 1 నుండి దేశంలో కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఎల్‌పిజి సిలిండర్ బుకింగ్ నుంచి జిఎస్‌టి మార్పులు, వరకు అనేక కీలక మార్పులు అమలులోకి వచ్చాయి. ఈ మార్పుల గురించి తెలుసుకుని,మీ ఆర్థిక ప్రణాళికలను సర్దుబాటు చేసుకోవడం అవసరమని చెప్పవచ్చు.

కొత్త నెల వచ్చిందంటే చాలు.. దేశ ప్రజలపై ఆర్ధికంగా ప్రభావం చూపే అనేక కొత్త నిబంధనలు అమల్లోకి వస్తుంటాయి. అందులో భాగంగా నవంబర్ 1 నుండి దేశంలో అనేక నిబంధనలు, విధానాలలో ముఖ్యమైన మార్పులు వస్తున్నాయి. ఇవి ప్రతీఒక్కరిపై ప్రభావితం చూపించనున్నాయి. ఎల్పీజీ గ్యాస్ వినియోగదారుల నుండి పన్ను చెల్లింపుదారులు, ప్రయాణికులు, వ్యాపార యజమానులు వరకు ప్రతీఒక్కరూ వీటి గురించి అవగాహన కలిగి ఉండాలి. ఈ మార్పులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవడం వల్ల ఇబ్బందులు పడకుండా ఉంటారు. నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న రూల్స్ ఏంటంటే..
కాలర్ నేమ్ డిస్‌ప్లే సర్వీస్
నేటి నుంచి కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ (CNAP) సర్వీస్ అమల్లోకి వచ్చింది. మీకు ఎవరైనా కాల్ చేసినప్పుడు వారి మొబైల్ నంబర్‌తో పాటు టెలికాం ఆపరేటర్ డేటాబేస్‌లో నమోదు చేయబడిన పేరు కూడా మీ ఫోన్ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది. స్పామ్ కాల్‌ల్స్, ఓటీపీలు, బ్యాంక్ మోసాల బారిన పడకుండా ఉండేదుకు ఇది ఉపయోగపడనుంది.
ఎల్పీజీ సిలిండర్ నిబంధనలు
గృహ సిలిండర్లు వాడేవారు సబ్సిడీతో కూడిన డొమెస్టిక్ ఎల్‌పిజి రీఫిల్స్ కోసం ఆధార్ వెరిఫికేషన్‌ను తప్పనిసరి చేశారు. ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే మార్కెట్ ధరతో సిలిండర్ పొందాల్సి ఉంటుంది. నేటి నుంచి వాణిజ్య సిలిండర్ ధరలు పెరిగాయి.
ప్రత్యేక రైళ్లు నేటి నుంచే..
దీపావళి పండుగ సందర్భంగా ఇండియన్ రైల్వేస్ ప్రత్యేక రైళ్లను నేటి నుంచి నడుపుతుంది. ప్రయాణికులు ఐఆర్‌సిటిసి (IRCTC) వెబ్‌సైట్‌లో ఈ రైళ్ల వివరాలను తనిఖీ చేయవచ్చు. అక్కడే బెర్త్‌ల ఖాళీ చెక్ చేసుకుని బుక్ చేసుకోవచ్చు.
పెన్షన్ లైఫ్ సర్టిఫికేట్
పెన్షనర్లు తమ వార్షిక లైఫ్ సర్టిఫికేట్ సమర్పించేందుకు నవంబర్ 1, 2026 నుండి అవకాశం కల్పిస్తున్నారు. దీనిని నవంబర్ 30 లోపు సమర్పించాలి. ఇది పూర్తి చేయకపోతే పెన్షన్ నిలిచిపోయే అవకాశముంది. పెన్షన్ తీసుకునే వ్యక్తి జీవించే ఉన్నాడని నిర్ధారించడానికి ఇది ఉపయోగపడుతుంది.
ఆదాయపు పన్ను గడువులు
టాక్స్ ఆడిట్ పరిధిలోకి వచ్చే పన్ను చెల్లింపుదారుల కోసం అసెస్‌మెంట్ ఇయర్ 2026-27 ఐటీఆర్ (ITR) దాఖలు గడువు అక్టోబర్ 31 నుండి నవంబర్ 21, 2026 వరకు పొడిగించారు. ఇది సాధారణ జీతభత్యాలు పొందే పన్ను చెల్లింపుదారులకు వర్తించదు. డిసెంబర్ 31, 2026 వరకు లేట్ రిటర్న్ ఫైల్ చేసే అవకాశం ఉంటుంది.
జీఎస్టీ మార్పులు
57వ జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) రీఫండ్‌లు, చిన్న బీ2సి (B2C) వ్యాపారాల కోసం క్వార్టర్లీ పేమెంట్, యాన్యువల్ రిటర్న్ (ఏఆర్‌క్యూపీ) పథకం వంటి సిఫార్సులను చేసింది. ఐటీసీ రీఫండ్ నిబంధనలు నవంబర్ 1 నుండి అమలులోకి వచ్చాయి.
